E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి షాకివ్వబోతున్న నర్మదా.. ప్రేమ పరిస్థితి దారుణం..  ధీరజ్ దెబ్బకు రాజాపుష్పంకు ఫ్యూజుల్ అవుట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి షాకివ్వబోతున్న నర్మదా.. ప్రేమ పరిస్థితి దారుణం..  ధీరజ్ దెబ్బకు రాజాపుష్పంకు ఫ్యూజుల్ అవుట్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 3rd: నర్మదా ఇంట్లోకి అడుగుపెట్టగానే వల్లి అంటూ కేకలు పెడుతూ లోపలికి వస్తుంది.. అక్కడ వేదవతి నర్మదా ఎందుకింత ఆవేశంగా వస్తుంది అని అనుకుంటుంది.. లోపలికి వెళ్ళగానే వేదవతి ఏంటో ఇంతగా కేకలు పెడుతూ వస్తున్నారు ఏం జరిగిందో అని అడుగుతుంది.. ఆ వల్లి కడుపుతో ఉన్నదన్న విషయాన్ని అబద్ధం చెప్పింది.. అసలు అవన్నీ నిజంగానే కడుపుతో లేదు అని ఆ డాక్టర్ చెప్పాడు మరి అబార్షన్ ఎలా అవుతుంది అని నర్మదా అంటుంది.. ఈ విషయాన్ని ఆ డాక్టర్ చెప్పిందా మరి ఆ డాక్టర్ని తీసుకురాలేదేంటి అని వేదవతి అడుగుతుంది.. అయితే నువ్వు ఇప్పుడు అబద్ధం చెప్పావని నాకు అర్థం అవుతుంది.. నువ్వు వెళ్లి ఆ డాక్టర్ని తీసుకురా అప్పుడే నేను నమ్ముతాను.. అంతేకాదు ఆ వల్లిని నేనే మెడ పట్టుకొని బయట గెంటేస్తాను లేదంటే మాత్రం నువ్వు నిజాన్ని చెప్పాలి అని వేదవతి నర్మదతో అంటుంది.. వల్లికి అబార్షన్ అయ్యింది అని చెప్పిన డాక్టర్ని ఎలాగైనా సరే పట్టుకొస్తాను అని నర్మదా అనుకుంటుంది.

మెరుపుతీగ కోసం నర్మద వేట..

నర్మదా తనపై పడ్డ నిందల్ని చెరిపేసుకోవాలని ఎన్ని నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. ఈ క్రమంలో నా వల్లికి అబార్షన్ చేసిన డాక్టర్ని కలుపుకొని అసలు నిజాన్ని బయట పెట్టాలని అనుకుంటుంది.. వల్లికి అబార్షన్ చేసిన ఆ డాక్టర్ మెరుపుతీగ కోసం నర్మదా హాస్పిటల్ కి వెళుతుంది. అయితే అక్కడ మెరుపుతీగ గురించి డాక్టర్ని అడిగితే అతను మాత్రం ఇక్కడ అలాంటి డాక్టర్ లేరు అని చెప్పడంతో నర్మదా ఒక్కసారిగా షాక్ అవుతుంది.. డాక్టర్ తో మెరుపుతీగ తెలుసుకొని నర్మదా ఎలాగోలాగా దాన్ని పట్టుకోవాలని అనుకుంటుంది.. ఆ మెరుపుతీగను పట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తారు.. ఈ ఫేక్ డాక్టర్ గురించి ఎలాగైనా సరే నిజం తెలుసుకొని ఇంట్లో వాళ్ళందరి ముందర తీసుకొని వచ్చి వల్లి యొక్క భాగోతాన్ని బయట పెట్టాలని నర్మదా ఆవేశంగా ఇంటికి బయలుదేరుతుంది.

ప్రేమ కోసం ధీరజ్..

Advertisement

ప్రేమ ఇంకా ఇంటికి రాలేదు.. రాత్రైనా సరే ప్రేమ ఎక్కడ ఉందో తెలియట్లేదు అని చాలా కంగారు పడిపోతూ ఉంటాడు.. అసలు ఈ ప్రేమకి కొంచెం కూడా బుద్ధి లేదు.. ఇంత రాత్రి అవుతున్న సరే ఎక్కడికి వెళ్ళింది అనేది అర్థం కావడం లేదు అని బయట అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడిపోతూ ఉంటారు.. ప్రేమ డాన్స్ క్లాస్ కి వెళ్ళదు అని చెప్పిన సరే ఇలా వెళ్ళింది అంటే నా మాటంటే లెక్కలేదు అని ధీరజ్ చాలా కోపంగా ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నర్మదా ఎలాగైనా సరే వల్లి కడుపు అబద్ధమని చెప్పాలని అనుకుంటుంది.. ధీరజ్ ఈ విషయం గురించి ఆలోచిద్దాము అన్నట్లుగా నర్మదా ధీరజ్ పిలుస్తుంది. అయితే ధీరజ్ మీ చెల్లికి కొంచమైనా బుద్ధుందా వదిన ఇప్పటివరకు కనీసం ఎక్కడ ఉంది అని ఫోన్ కూడా చేయడం లేదు అని తిడతాడు.. ఎక్కడికి వెళ్ళింది ప్రేమ అని నర్మదా అడుగుతుంది.. నేను వద్దని చెప్పిన కూడా డాన్స్ క్లాస్ కి ఎందుకు వెళ్ళింది అని నర్మదా అంటుంది.

రామరాజు మాట విన్న ధీరజ్..

ప్రేమ ఎక్కడికి వెళ్లిందో ఇంకా రావడం లేదు అని ఆవేశంగా నర్మదతో మాట్లాడుతూ ఉండగా.. అది విన్న రామరాజు ఏంట్రా ఏమైంది అని అడుగుతాడు.. ప్రేమ ఇంకా ఇంటికి రాలేదా ఏమైంది ఎక్కడ ఉంది అని రామరాజు అడుగుతాడు.. ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి ఎలా ఉంది ఇప్పుడు అని రామరాజు అడగ్గానే బాగానే ఉంది నాన్న అని అబద్ధం చెప్తారు. ప్రేమ రాత్రి అయినా ఇంకా ఇంటికి రాలేదా ఒకసారి హాస్పిటల్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో.. అసలు ఇద్దరు ఆడపిల్లలు కదా అక్కడికి వెళ్లి ఏమైందో కనుక్కోరా అని రామరాజు చెప్తాడు.. సరే నాన్న నేను హాస్పిటల్ కి వెళ్లి ప్రేమ ఎక్కడ ఉందో చూసేసి వస్తాను అని ధీరజ్ అంటాడు. ఆ మాట విన్నా నర్మదా నేను చెప్తే ఎందుకు వింటారు ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్తే వింటారు అని నర్మదా అంటుంది. అసలే నేను కోపంగా ఉన్న వదిన నన్ను గెలకొద్దు అని ధీరజ్ వెళ్ళిపోయింది..

ప్రేమను కాపాడిన ధీరజ్..

Advertisement

ప్రేమ ఎక్కడుందో అని టెన్షన్ పడిపోతూ వెళ్లిన ధీరజ్ కి ప్రేమ కోసం ఎన్ని సార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు పడిపోతూ ఉంటాడు.. అయితే ప్రేమను ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు రాజాపుష్పం.. ప్రేమని బయటికి రప్పియాలని కరెంటు పోయింది అని అబద్ధం చెప్తాడు.. అయితే ఆ ప్రేమ అది నిజమే అనుకోని నమ్ముతుంది. ఇక మెల్లగా బయటకు వచ్చి అక్కడ ఉన్న ఫోన్ని తీసుకోవాలనుకుంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన రాజపుష్పం ప్రేమని పట్టుకుంటాడు. ఇక ప్రేమ బలవంతంగా లోపలికి వెళ్లి తలుపు పెట్టుకున్న సరే తన అసిస్టెంట్ కలిసి తలుపు నీ బద్దలు కొడతాడు రాజ పుష్పం.. ఆ తర్వాత తనని బలవంతం చేయకపోతే వెంటనే వచ్చిన ధీరజ్ రాజపుష్పాన్ని దారుణంగా కొట్టేస్తాడు. నా భార్య మీద చేయి వేస్తావా నీకు ఎంత ధైర్యం రాని రాజపుష్పాన్ని ధీరజ్ వెంటపడి మరీ కొట్టేస్తాడు.. మొత్తానికి ప్రేమని ధీరజ్ కాపాడతాడు.. అప్పటివరకు కంగారు పడిపోతూ ఉన్న ప్రేమ మాత్రం ధీరజ్ ను చూసి చాలా సంతోషంగా ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవిని అవమానించిన శ్రీయ.. అవని పై సీరియస్.. బిడ్డ రాకతో ఫుల్ హ్యాపీ..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×