E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ ను రెచ్చగొట్టిన సేనా.. నిజం బయటపెట్టిన ధీరజ్.. ప్రేమ దూరం అవుతుందా..?

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ ను రెచ్చగొట్టిన సేనా.. నిజం బయటపెట్టిన ధీరజ్.. ప్రేమ దూరం అవుతుందా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 28th: సేన తింటూ ఉండగా అక్కడ వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉంటాడు. రామరాజు అల్లుడిని ఏ ఉద్యోగం చేస్తున్నావో అని అడుగుతాడు.. ఆ తర్వాత నువ్వు మంచి ఉద్యోగమే చేస్తున్నావు. కానీ ఈ కూలోళ్ళు మాత్రం ఎటువంటి పని లేకుండా కూలి పనులు చేసుకుంటున్నారు అంటూ రామరాజు కొడుకులని ఘోరంగా అవమానిస్తాడు. అయితే అందరూ సేనకి మాటకు మాట సమాధానం చెప్తారు కానీ రామరాజు మాత్రం ఏమీ మాట్లాడద్దు అని చెప్పగానే మౌనంగా ఉండిపోతారు.. కానీ ప్రేమం విషయాన్ని తీసుకుని వచ్చి మరీ రామరాజు తో పాటు ధీరజ్ని కూడా ఘోరంగా అవమానిస్తాడు సేన.. ఈ సీను ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది.. వేదవతి ఎంతగా చెప్తున్న సరే సేన మాత్రం వినకుండా తనకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తాడు.

రెచ్చగొట్టేలా మాట్లాడిన సేనా..

ధీరజ్ నన్ను మహారాణికన్నా ఎక్కువగానే చూసుకుంటాడు అని ప్రేమ అనగానే భద్ర ఇది వాడి మాయలో పూర్తిగా పడిపోయింది అందుకే ఇలా మాట్లాడుతుంది అని భద్రావతి అనుకుంటుంది.. ఇక సేన కూడా రామరాజు కుటుంబం గురించి గోరంగా మాట్లాడుతాడు అది విన్న వేదవతి తో పాటు శారదంబ అందరూ షాక్ అవుతారు.. సేన మాత్రం నా కూతురు ఎలాంటిది. ఎలాంటి బ్రతుకు బతకాల్సింది.. అమెరికాకి సంబంధం చేసుకోవాల్సిన నా కూతురు ఇలా దిక్కుమక్కు లేని అనాధ కొడుకుని చేసుకోవడం ఎలా ఉంటుంది అని ధీరజ్ ను రెచ్చగొట్టేలా సేన మాట్లాడతాడు.. సే నా మాటలు విన్న ధీరజ్ ఒక్కసారిగా రెచ్చిపోతాడు.. రామరాజు ఎంతగా కంట్రోల్ చేయాలని అనుకున్న సరే ధీరజ్ మాత్రం ఆవేశంగానే ఉంటాడు..

సేనా ను కొట్టిన రామరాజు కొడుకులు..

Advertisement

సేన మాటలకి అందరూ కోపంగా ఉంటారు.. ధీరజ్ గురించి దారుణంగా మాట్లాడుతుంటే వేదవతి నోరు విప్పుతుంది.. నీ కూతురు జీవితమే కాపాడింది నేనే అని ఎంత చెప్తున్నా సరే సేన మాత్రం అసలు వినకుండా నువ్వే ఇదంతా చేశావు అన్నయ్య దారుణంగా పేదవాతిని అనడంతో మా అమ్మని అంత మాట అంటావని కొడతాడు.. మా అమ్మ గురించి అలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం ఉంది అంటూ ధీరజ్ తో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా సేనని కొడతారు.. ఇంట్లో జరుగుతున్న గొడవలకి వల్లి కారణమని తను చాలా సంతోషంగా ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి పెట్టిన నిప్పు అంటుకుంది అని సంతోషంగా ఉంటారు. ఇంట్లో జరుగుతున్న ఈ గొడవ అందరి గుండెల్లోనే బాంబు పెల్చేసింది అని వల్లి సంతోషంగా ఉంటుంది.

నిజం చెప్పేసిన ధీరజ్..

నీ కూతురికి జీవితాన్ని ప్రసాదించింది నేను అనే ధీరజ్ ఎంత చెప్తున్నా సరే సేన మాత్రం అస్సలు వినడు.. ప్రేమ ఎందుకు గొడవ పడుతున్నారు అని టెన్షన్ పడుతూ అక్కడికి వస్తుంది. ధీరజ్ నీ కూతురు ఎవడో కళ్యాణ్ అనే వాడిని ప్రేమించి దారుణంగా మోసపోయింది.. మేము ఆ గుడికి వెళ్లి అదే హోటల్లో దిగాము.. నీ కూతురు మోసపోయింది అని చచ్చిపోవాలని అనుకుంది.. కానీ మా అమ్మ దగ్గరుండి మా ఇద్దరు పెళ్లి ని బలవంతంగా చేయించింది అని ధీరజ్ అనగానే ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ధీరజ్ ఎంతగా నిజం చెప్తున్నా సరే సేన భద్ర ఇద్దరు కూడా అది నిజమని నమ్మరు. రామరాజు మాత్రం నువ్వే వాళ్ళిద్దరు పెళ్లి చేసావా అని వేదవతి పై సీరియస్ అవుతాడు..

ప్రేమ ధీరజ్ కు దూరం అవుతుందా..?

Advertisement

ప్రేమ నీ స్వార్థం కోసం నువ్వు గొప్ప అనిపించుకోవడం కోసం నా గతాన్ని అందరి ముందు బయట పెడతావా…? జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని నువ్వు ఇప్పుడు ఎందుకు బయట పెట్టావు అని ప్రేమ ధీరజ్ ని అడుగుతుంది. ప్రేమ నువ్వు మంచివాడు అనిపించుకోవడానికి నా జీవితాన్ని బయటపెట్టి అందరి ముందు నన్ను తలపించుకునేలా చేసావు కదా అని అంటుంది.. ఆ మాట వినగానే ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.. నువ్వు మా అమ్మ బాధపడింది మాత్రం ఆలోచించవారని ధీరాజు ఎంత చెప్తున్నా సరే ప్రేమ మాత్రం అస్సలు వినకుండా నీ భార్యని అందరి ముందర బయటపెట్టి అవమానిస్తావా అని బాధపడిపోతుంది.. ప్రేమ సేన రెచ్చగొట్టడంతో ఇంకాస్త రెచ్చిపోయి ధీరజ్ పై గొడవకు దిగుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: అవని పై శ్రీయ కామెంట్స్.. అక్షయ్ ఫుల్ హ్యాపీ.. అడ్డంగా దొరికిపోయిన పల్లవి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×