E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: హమ్మయ్య వేదవతి కోరిక తీరింది.. రామారాజుకు ఘోర అవమానం.. కన్నీళ్లు పెట్టుకున్న భద్ర..

Illu Illalu Pillalu Today Episodes: హమ్మయ్య వేదవతి కోరిక తీరింది.. రామారాజుకు ఘోర అవమానం.. కన్నీళ్లు పెట్టుకున్న భద్ర..
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 23rd: వేదవతి ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది.. నా పుట్టింటి వాళ్ళు తన ఇంటికి రాబోతున్నారు అని బయటకు వెళ్లి చాలా సంతోషంగా ఎమోషనల్ అయిపోతూ వాళ్ళని చూస్తుంది.. ఇక శారదంబ కూడా తన కూతురింటికి వెళ్ళాలి అని హడావిడి చేసి అక్కడికి వెళుతుంది. ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న గీతను దాటి వేదవతి తన వాళ్లతో ఆప్యాయంగా మాట్లాడుతుంది.. వేదవతికి భద్ర ప్లాన్ తెలియక వాళ్ళందరితో అమాయకంగానే తన వాళ్ళు అనుకుని నమ్మి మాట్లాడుతుంది. అందరూ కలిసి చాలా సంతోషంగా ఉండడం ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తుంది. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ సంతోషంగా ఉంటారు.

హమ్మయ్య అక్కా చెల్లెల్లు కలిసిపోయారు..

ప్రేమ వేదవతి ఇద్దరూ కూడా తన కుటుంబ సభ్యులతో చాలా ప్రేమగా మాట్లాడడంతో పాటుగా ఇన్నేళ్లు మన దూరంగా ఉన్నాం కదా.. ఇప్పుడు ఒక్కటే అయిపోయాము అని చాలా సంతోషంగా కన్నీళ్లు పెట్టుకుంటారు.. ఇక వేదవతి ఆనందానికి అవధులు ఉండవు.. పాతికేళ్ల తర్వాత మళ్లీ మీరు మాతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది అని ఇక వేదవతి ఆనందానికి అవధులు ఉండవు గాల్లో ఎగిరిపోతూనే ఉంటుంది. ఇక మీరు మా ఇంటికి వస్తున్నారని చెప్పగానే నేను రాత్రి నుంచి నిద్రపోకుండానే మీకోసం ఎదురుచూస్తున్నాను. అక్క రండి ఇంట్లోకి వెళ్దాం అని అనగానే సేన మొదట వద్దు అని అన్నా కూడా మన అమ్మ కోసమే ఇదంతా చేస్తున్నాం కదరా అని భద్ర అనగానే అందరూ కలిసి సంతోషంగా లోపలికి వెళ్తారు.. ఈ సీను ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తుంది.

రామారాజుకు ఘోర అవమానం..

Advertisement

నిన్న మొన్నటి వరకు గొడవలు పడుతూ అందరికీ విసుగు తెప్పించిన ఈ రెండు కుటుంబాలు ఒక్కసారిగా సంతోషంగా కనిపించడంతో ఆ ఇంట్లోని వాళ్ళందరూ కూడా సంతోషంతో ఉంటారు.. అయితే భద్ర మాట విని లోపలికి అడుగుపెట్టిన సేన ధీరజ్ కాలు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తాను అని అన్నా కూడా ఎవరికి చెప్పింది వాళ్లే చేయాలి అని కోపంగా ఉంటాడు.. కాళ్లు కడుక్కోడానికి నీళ్లు ఈ పనోడు ఇవ్వడా అని ఘోరంగా రామరాజుని అవమానిస్తాడు సేన. ధీరజ్ నేను ఇస్తానని చెప్తున్నా కూడా ఎందుకు మీరు ఇలా వాదిస్తున్నారు అని అంటాడు. ఇక్కడ రామరాజు వేదవతి సంతోషాన్ని చూసి అతిధుల్ని గౌరవించడం మన సాంప్రదాయం నేనే ఇస్తాను పదండి అని రామరాజు సేన వాళ్ళ కుటుంబానికి కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తాడు.. ఇక వేదవతి తన అక్క కాళ్లు కడిగి ఎమోషనల్ అయిపోతుంది.. ఈనెల మన దూరానికి ఇది నీళ్లు కడిగేసినట్లు అవ్వాలి అని వేదవతి అనగానే సేన నువ్వు ఈ పనిని చేసుకొని మమ్మల్ని ఇన్నేళ్లు బాధ పెట్టావు అని అంటాడు.. మొత్తానికి అందరూ కూడా కుడికాలు పెట్టి రామరాజు ఇంట్లోకి అడుగు పెడతారు..

శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

వేదవతి మా అక్క వాళ్ళకి హారతి ఇవ్వాలి అని లోపలికి వెళ్లేటప్పుడు హారతి ఇచ్చి దాన్ని బయటికి తీసుకుని వస్తుంది.. హారతి పల్లి అని అక్కడి వేయగానే.. మా అక్క మా ఇంట్లో అడుగు పెట్టింది అంటూ చిన్న పిల్లలాగా డాన్సులు వేయడం చూసినా నర్మదా ఏంటండీ ఈ డాన్సులు మీ వయసు ఏంటి మీరు చేసే పని ఏంటి అని అడుగుతుంది.. ఇన్ని రోజులు నేను కన్నీళ్లు పెట్టుకున్నాను ఇప్పుడు మా అక్క అన్నయ్య ఇంట్లోకి అడుగుపెట్టగానే నా సంతోషం ఆ బాధని తుడిచివేసింది అని వేదవతి అంటుంది.. ఏది ఏమైనా కూడా నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే మా అక్క ఇంట్లోకి అడుగుపెట్టడం వల్ల అని వేదవతి చిన్నపిల్లలాగా మారి డాన్స్ వేస్తుంది. అది చూసిన శ్రీవల్లి వాళ్ళ కుటుంబం వాళ్ళు వచ్చారని ఎగిరెగిరి పడుతుంది కదా.. మాత ఇవాళ సాయంత్రం పడే బాధని ఇంక జీవితంలో మర్చిపోదు అంటూ శ్రీవల్లి అనగానే సుకన్య షాక్ అవుతుంది..

తిరుపతి డైలాగుతో కామెడీ..

Advertisement

ఆడవాళ్ళందరూ చీరలు అలాగే వంటలు చూడడంలో బిజీగా ఉంటే, మగవాళ్ళందరూ కూడా హాల్లో కూర్చుని ఒకరంటే ఒకరికి పడదు అన్నట్లుగా కోపంగా చూసుకుంటూ ఉంటారు.. విశ్వం అందరినీ పలకరించడానికి నవ్వుతూ ఉన్నా కూడా అందరూ చాలా సీరియస్ గా ఉండడంతో తాను కూడా టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన తిరుపతి బావ బామ్మర్దులు అంటే సరదాగా సరసాలు ఆడుకుంటూ ఉంటారు కదా.. మరి మీరేంటి కారాలు మిరియాలు నోరుతున్నారు ఇది అస్సలు బాగోలేదు అని తిరుపతి అంటాడు.. తిరుపతి ఎంతగా కామెడీ చేయాలని చూసినా కూడా ఆ ఇద్దరూ మాత్రం కంటి చూపుతోనే చంపేసాలా చూస్తారు.. వాళ్ళిద్దరిని కూల్ చేయడానికి తిరుపతి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అక్కడ ఫలించినట్లు కనిపించలేదు. చివరికి కూల్ డ్రింక్ తో కూల్ చేద్దాం అని ట్రై చేసినా కూడా అది కూడా రివర్స్ అవుతుంది.. తిరుపతి చేసిన కామెడీ ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తుంది..

భద్ర కు ప్రేమతో పెట్టిన వేద..

ఇక భద్రావతి శారదాంబ రేవతిని వంట గదిలోకి తీసుకెళ్లిన వేదవతి తాను చేసిన పిండి వంటలని చూపిస్తూ మీరు తినాల్సిందే నేను అస్సలు ఒప్పుకోను అని అంటుంది.. తన అక్క కోసం చాలా ఇష్టమైన వంటలు నేను చేశాను మా అక్క మొత్తం తినాల్సిందే అని వేదవతి మారం చేస్తుంది.. తన కూతుర్లు ఇద్దరు కలిసిపోయారని శారదాంబ చాలా సంతోషంగా ఉంటుంది.. వీళ్ళని కిటికీలుంచి చూస్తున్న శ్రీవల్లి మాత్రం కోపంతో రగిలిపోతుంది. ఇకపోతే వేదవతి తన అక్క వాళ్ళకి చేస్తున్న మర్యాదలను చూసి భద్ర కన్నీళ్లు పెట్టుకుంటుంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఫ్యామిలీ సెంటిమెంట్తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అవుతుందేమో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: అశ్విన్ మాస్టర్ ప్లాన్.. అక్షయ్ కు షాకిచ్చిన అవని.. పల్లవి పై అనుమానం..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×