E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ ప్లాన్ సక్సెస్.. ప్రేమ కు సపోర్ట్ గా రామరాజు.. శ్రీవల్లికి షాక్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ ప్లాన్ సక్సెస్.. ప్రేమ కు సపోర్ట్ గా రామరాజు.. శ్రీవల్లికి షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 14th: ఉదయం లేవగానే రామరాజు దగ్గరికి చందు వచ్చి రైస్ మిల్లు లెక్కలు చూపిస్తూ ఉంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన సాగర్  ను చూసి రామరాజు నా పెద్ద కొడుకు చాలా గొప్పవాడు.. కొంతమంది రైస్ మిల్లులో పని చేయడం నామోషి అని వెళ్ళిపోయారు కానీ వీడు మాత్రం నా కొడుకుగా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు అని చందు ని పొగిడిస్తూ ఉంటాడు.. సాగర్ ఫోన్ వచ్చినట్టు నటిస్తూ మా ఇంట్లో నేను మా ఆవిడ మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నాము. మిగిలిన వాళ్ళు ఎవరూ పెద్దగా చదువుకోలేదు అని అనడంతో ఆ మాట విన్న ధీరజ్ వేదవతి దగ్గరికి వచ్చి ప్రేమ గవర్నమెంట్ ఉద్యోగం గురించి ఇప్పుడు మనం బయట పెట్టాలి అని అంటాడు.. అనుకున్న ప్లాన్ ప్రకారం ప్రేమ పోలీస్ ఆఫీసర్ అవుతుంది అని చెప్తాడు. తన కోరికను నేను తీరుస్తాను రా అని ధీరజ్ అంటాడు.. వేదవతి కూడా సపోర్ట్ చేయడంతో ధీరజ్ ఇంకాస్త రెచ్చిపోతాడు..

ప్రేమ కోరికను బయటపెట్టిన ధీరజ్..

సాగరు ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఎవరు చేయరు ఈయన చేయనివ్వడు అని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ప్రేమ కూడా ఎస్సై జాబు చేయాలని తన కల.. కోచింగ్ తీసుకుని జాబ్ చేస్తుంది అని వేదవతి, ధీరజ్ ఇద్దరూ కాస్త రెచ్చపోయి మరి నాటకం మొదలు పెడతారు.. పోలీస్ అవ్వాలన్న కోరిక ఉంది.. ఉచితంగా తను కచ్చితంగా ప్రేమ పోలీస్ అయ్యి తీరుతుంది.. నాన్నే దగ్గరుండి ప్రేమ కోరికను తీరుస్తాడు అని అనడంతో సాగర్ ఒక్కసారిగా నవ్వుతాడు..ఈ జన్మకి ప్రేమకల కలగని ఉంటుంది నువ్వేమీ సంతోష్ పడాల్సిన అవసరం లేదు వెయిట్ చేస్తూ ఉండు నీ జీవితం సరిపోదు అని సాగర్ వెటకారంగా మాట్లాడి బయటికి వెళ్ళిపోతాడు.

రామరాజు మాటతో ప్రేమ ఫుల్ హ్యాపీ..

Advertisement

ఆపండ్రా మీ నాటకాలు.. ప్రేమని ఎస్ఐ కోచింగ్ లో చేర్పించాలని మీరు ఇలా నాటకం ఆడుతున్నారని నాకు అర్థం అయిపోయిందని రామరాజు అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. అది కాదు నాన్న అని ధీరజ్ ఎంతగా చెప్పడానికి ప్రయత్నించినా సరే ఆ కోరిక మాత్రం తీరదు అని రామరాజు అంటాడు.. అది కాదండి తను జాబ్ చేస్తూ చదువుకోవడం ఆ ఇంట్లో వాళ్లకి నచ్చదు.. అంతేగాని ప్రేమ చదువు అయిపోయిన తర్వాత జాబ్ చేయడంలో తప్పు లేదు కదా వాళ్ళు ఎందుకు అడ్డుపడతారు అని వేదవతి అంటుంది.. మన అమూల్యకైతే అలా చేస్తామా ఏంటి అని వేదవతి అనగానేమి రామరాజు మనసు కరిగిపోతుంది.. ప్రేమ కోరికను తీర్చేందుకు తను ఒప్పుకుంటాడు.. ప్రేమా నువ్వు ఎంతవరకు చదువుకోవాలి అనుకుంటే అంతవరకు చదువుకో అని అంటాడు. చాలా థాంక్స్ మామయ్య మీరు ఒప్పుకుంటారని నేను అసలు ఊహించలేదు అని ప్రేమ అంటుంది. ఇంట్లో వాళ్ళ మాటల కోసమే నేను ఏది అనలేదు చల్లగా ఉండమ్మా అని దీవిస్తాడు రామరాజు..

సాగర్ కు దిమ్మతిరిగే షాక్..

బయట వెళ్ళిపోతున్న సాగర్ దగ్గరికి ధీరజ్ వెళ్తాడు.. అన్నయ్య నువ్వు చాలా గ్రేట్ అన్నయ్య అని ధీరజ్ పొగిడేస్తూ ఉంటాడు.. ఏమైందిరా ఎందుకు అంతగా సంతోషంగా ఉన్నావు అని అనగానే.. నాన్న ప్రేమ కోచింగ్ కోసమని ఒప్పుకున్నాడు అని చెప్పగానే సాగర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.. ఏంటి నాన్న ఒప్పుకున్నాడా? ఇంత జరిగిన తర్వాత కూడా నాన్న ఒప్పుకున్నాడు అంటే నిజంగా ఏ భూకంపం వస్తుంది రా భూమి అంతరించిపోతుంది అని సాగర్ అంటాడు. లేదురా నిజంగానే నాన్న ఒప్పుకున్నాడు అని చెప్పగానే సాగర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.. ప్రేమకి కంగ్రాట్స్ చెప్పడంతో… సాగర్ నిజంగానే మంచివాడు అని అందరూ అనుకుంటారు.. సాగర్ కూడా నాకు నాన్న మీద మాత్రమే కోపం రా మీరంటే నాకు ఎప్పుడు కోపం లేదు రా అని అంటాడు.. సాగర్ మాట విన్న అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు..

వేదవతి వాళ్ల డ్యాన్స్ చూసి వల్లి ఫీల్..

Advertisement

సాగర్ కి నాన్న అంటే ఎందుకురా అంత కోపం అని వేదవతి చెప్తూ ఉంటుంది.. కాబట్టే నేను అలా ప్రవర్తిస్తున్నాను అమ్మ అని అంటాడు.. అయితే వేదవతి మాత్రం సాగర్ ని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది.. అప్పుడు నర్మదా మీ కొడుకు గురించి నేను చూసుకుంటాను. ముందు మనం ప్రేమని మావయ్య గారు కోచింగ్ లో జాయిన్ చేయడానికి ఒప్పుకున్నారు కదా.. దీనికి మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని అందరూ కలిసి ఫ్యామిలీ పార్టీ అంటూ డాన్స్ అదరగొడతారు.. వీళ్ళందరూ చాలా సంతోషంగా డాన్స్ చేస్తూ కనిపించడం చూసిన వల్లి ఇది చూసి నేను తట్టుకోలేక పోతున్నాను అని కుళ్ళుకుంటుంది.. నవ్వుని నేను దూరం చేయాలి అని టైం అయిపోయింది.. ప్రేమ వాళ్ళందరూ చాలా సంతోషంగా డాన్స్ వేస్తూ ఉంటే వల్లి మాత్రం బాధపడిపోతూ ఉంటుంది..

ప్రేమను ఇరికించేందుకు వల్లి ప్లాన్..

ప్రేమ ఎస్సై కోచింగ్ కి వెళ్లేందుకు మా మామయ్య గారి దగ్గర పర్మిషన్ తీసుకుంది.. ఇది ప్రేమ ఇప్పుడు ఆ కోచింగ్ వెళ్లకుండా నేను చేయాలి.. దాని సంతోషాన్ని నేను దూరం చేయాలి..అని వల్లి భాగ్యం వాళ్ళ ఇంటికి వచ్చి ప్లాన్ చేస్తుంది.. ప్రేమ గురించి ఏదో ఒకటి బయట పెడితే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను అని మళ్లీ ఆలోచిస్తూ ఉంటుంది.. ప్రేమ నవ్వుని త్వరలోనే దూరం చేస్తాను అని వల్లి అనగానే.. అక్కడికి వచ్చిన తిరుపతిని చూసి సుక్కు సైగలు చేస్తుండడం చూసిన శ్రీవల్లి దీనికి ఏమైంది అని అనుకుంటుంది.. ఇక శ్రీవల్లి చూస్తే ఇంట్లో పెద్ద సమస్య అవుతుంది అని సుక్కు తిరుపతిని వెళ్ళిపో అని అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. అశ్విన్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. దొంగగా మారిన పల్లవి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×