E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను ఇరికించబోతున్న శ్రీవల్లి.. ప్రేమకు మాటిచ్చిన ధీరజ్.. ఇది కదా అసలు ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను ఇరికించబోతున్న శ్రీవల్లి.. ప్రేమకు మాటిచ్చిన ధీరజ్.. ఇది కదా అసలు ట్విస్ట్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 13th: వేదవతి, ప్రేమ, నర్మద, ధీరజ్ లు వీళ్ళందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా వల్లి అక్కడకు వచ్చే నిలబడుతుంది. అది చూసి నన్ను నర్మదా వల్లి అన్ని విన్నట్టుంది ఇప్పుడు మావయ్యకి చెప్తుందేమో అని కంగారు పడిపోతూ ఉంటారు.. అది చూసిన వేదవతి కోపంగా వల్లి దగ్గరికి వెళ్లి చాటుగా వినడం ఇప్పటికీ మానవా నువ్వు అని వల్లి చెంప పగలగొడుతుంది.. ఎందుకు కొట్టారు అత్తయ్య నేను పాటలు వింటూ పని చేసుకుంటున్నాను అని వేదవతితో అంటుంది.. ఈవిడ నన్ను మళ్ళీ కొట్టేసింది అని చాలా బాధపడిపోతూ ఉంటుంది వల్లి. ఇక చందు బయటికి వెళ్లి పడుకోడానికి అన్ని తీసుకుని వెళుతుండగా మళ్లీ అడ్డుపడుతుంది. బావ ఎక్కడికి వెళ్తావు అని మళ్లీ అడగగానే చందు సీరియస్ అవుతాడు. రోజు కొత్తగా బొట్టు పెట్టి చెప్పాలా మనిద్దరం బయట వారికి మాత్రమే భార్యాభర్తలం అని చందు అనగానే మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంటుంది..

చందును, వల్లి కలిసిపోతారా..?

చందు బయట వెళ్లి పడుకోవడానికి వెళుతూ ఉంటాడు.. అయితే వల్లి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది. రోజు బొట్టు పెట్టి చెప్పాలా నేను బయటకు వెళ్లి పడుకుంటాను అని చందు కోపంగా అంటాడు. బావ నువ్వు రోజు బయట పడుకుంటే మీ నాన్న చూస్తే ఏమని చెప్తావు అని వల్లి అంటుంది. మా నాన్న వస్తే నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను నువ్వేమీ నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చందు అంటాడు. రోజు ఇలా మీ నాన్నకి చెప్పడం అవసరమా నువ్వు ఇక్కడే పడుకో బావ అని దబాయిస్తుంది శ్రీవల్లి.. ఏంటి దబాయిస్తున్నావ్ ఏంటి.. నువ్వు మళ్ళీ నా జీవితంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నావా అది కలలో కూడా జరగదు అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు.. బయటికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నేను నేల మీద పడుకుంటాను మీరు మంచం మీద పడుకోండి అని శ్రీవల్లి అంటుంది.

ప్రేమ కాపురంలో నిప్పులు పోస్తాను…

Advertisement

ప్రేమ నా కాపురంలో నిప్పులు పోసింది. దాని కాపురంలో నేను కుంపటి వెలిగించాలి అని శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. ఆరోజు వాళ్ళందరూ మాట్లాడుకునే మాటలు వినేసి నా శ్రీవల్లి ఎలాగైనా సరే ప్రేమ ధీరజుల పెళ్లి గురించి ఇంట్లో బయట పెట్టాలి అని అనుకుంటుంది.. ఆ కళ్యాన్ ఎవడు? ప్రేమ వాడి పేరు తలుచుకొని ఎందుకు బాధపడుతుంది.? ధీరజ్ ప్రేమ ప్రేమించుకుని పెళ్లి చేసుకోలేదా? మా అత్త దగ్గరుండి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసిందా? వాళ్ళిద్దరి బాగోతాన్ని నేను బయట పెట్టేస్తాను అని చాలా సంతోషంగా ఉంటుంది శ్రీవల్లి. ప్రేమని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి బయటికి పంపించేలా చేస్తాను అని అనుకుంటుంది.. నన్ను ఎంతో ప్రేమించే నా బావనించి నన్ను దూరం చేశారు.. వాళ్లు ఎలా సంతోషంగా కాపురం చేస్తారు వాళ్ళ మధ్యలో నేను చిచ్చు పెడతాను అని శ్రీవల్లి ఆలోచిస్తుంది.

ప్రేమకు మాటిచ్చిన ధీరజ్..

మన పెళ్లి ఎలా జరిగింది అని అత్త అన్న తర్వాత నాకు మళ్ళీ గుర్తుకు వచ్చింది రా.. ఆరోజు నువ్వే లేకుండా ఉంటే నేను ఈరోజు ఉండేదాన్నే కాదు. మన పెళ్లి ఎలా జరిగింది అన్న విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకుండా చేయాలి. నేను ఇలా చేసుకున్నాను అని తెలిస్తే మా ఇంట్లో వాళ్ళు చాలా బాధపడతారు. ఇక మావయ్య గారికి కూడా ఇలాంటి తెలిస్తే నన్ను తప్పుగా అనుకుంటారు. నువ్వు ఎట్టి పరిస్థితులను మన పెళ్లి ఎలా జరిగిందన్న విషయాన్ని బయట పెట్టొద్దు అని అడుగుతుంది. అసలే నీకు ఆవేశం ఎక్కువ రా నువ్వు బయట పెడితే మా వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. నువ్వు ఎప్పటికీ ఈ విషయాన్ని బయట పెట్టను అని నాకు మాట ఇవ్వు అని ప్రేమ అడుగుతుంది. ప్రేమ కోరిక మేరకు ధీరజ్ తనకి మాట ఇస్తాడు..

తిరుపతి లవ్ సక్సెస్..

Advertisement

తిరుపతి సుకన్యని ప్రేమిస్తున్నాడు అని అందరికీ తెలిసిందే. అయితే వల్లి నుంచి దూరమయి సుకన్య భాగ్యం వాళ్ళ ఇంట్లో ఉంటున్న విషయం తెలిసిందే.. భాగ్యం ఆ తిరుపతి నిన్ను లైకింగ్ చేస్తున్నాడని అర్థమవుతుంది కదా.. వాడిని నువ్వు పెళ్లి చేసుకోవే ఈ సినిమాలు అవి ఇవి చేయడం కన్నా నువ్వే డబ్బులు పెట్టి సినిమా చేసి హీరోయిన్గా పైకి రావచ్చు అని సలహా ఇస్తుంది. ఆ తిరుపతికి బోలెడు ఆస్తుంది వాళ్ళది రాజవంశం. వాడిని పెళ్లి చేసుకుంటే వాడి ఆస్తి నీదవుతుంది ఇది ఆలోచించు అని భాగ్యం సుకన్యకు చెప్తుంది.. ఇక సుకన్య బయట తనకోసం వచ్చిన తిరుపతి తో ప్రేమగా మాట్లాడుతుంది.. తిరుపతి నా ప్రేమకు పునాదులు పడ్డాయి నా పొలంలోకి మొలకలు వచ్చాయి అంటూ చాలా సంతోషంగా హుషారుగా వెళ్ళిపోతాడు.. అప్పుడే రాయి మీదకి బండి ఎక్కి కింద పడిపోతాడు.

సాగర్ కు ధీరజ్ స్ట్రాంగ్ కౌంటర్..

ఉదయం లేవగానే రామరాజు దగ్గరికి చందు వచ్చి రైస్ మిల్లు లెక్కలు చూపిస్తూ ఉంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన సాగర్ ను చూసి రామరాజు నా పెద్ద కొడుకు చాలా గొప్పవాడు.. కొంతమంది రైస్ మిల్లులో పని చేయడం నామోషి అని వెళ్ళిపోయారు కానీ వీడు మాత్రం నా కొడుకుగా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు అని చందు ని పొగిడిస్తూ ఉంటాడు.. సాగర్ ఫోన్ వచ్చినట్టు నటిస్తూ మా ఇంట్లో నేను మా ఆవిడ మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నాము. మిగిలిన వాళ్ళు ఎవరూ పెద్దగా చదువుకోలేదు అని అనడంతో ఆ మాట విన్న ధీరజ్ వేదవతి దగ్గరికి వచ్చి ప్రేమ గవర్నమెంట్ ఉద్యోగం గురించి ఇప్పుడు మనం బయట పెట్టాలి అని అంటాడు.. అనుకున్న ప్లాన్ ప్రకారం ప్రేమ పోలీస్ ఆఫీసర్ అవుతుంది అని చెప్తాడు. తన కోరికను నేను తీరుస్తాను రా అని ధీరజ్ అంటాడు.. వేదవతి కూడా సపోర్ట్ చేయడంతో ధీరజ్ ఇంకాస్త రెచ్చిపోతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ప్రేమ పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి రామరాజు పరమేష్ ఇస్తాడా లేదా చూడాలి…

Also Read :‘ గుండెనిండా గుడిగంటలు’ అరుణ్ రియల్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×