E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: విశ్వను కాపాడిన అమూల్య.. ఇదేం ట్విస్ట్.. శ్రీవల్లి మాస్టర్ ప్లాన్..

Illu Illalu Pillalu Today Episodes: విశ్వను కాపాడిన అమూల్య.. ఇదేం ట్విస్ట్.. శ్రీవల్లి మాస్టర్ ప్లాన్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 11th: అమూల్య ఎందుకు కేసు తీసుకుంటుంది అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు.. అయితే అమూల్య ఆ నిర్ణయం తీసుకోవడం వెనక ఏదైనా బలమైన కారణం ఉందా అని అక్కడ జడ్జ్ అడుగుతాడు. అయితే వాడి దగ్గర నన్నెవరూ బెదిరించలేదు భయపెట్టలేదండి నేనే ఈ కేసుని వాపస్ తీసుకోవాలని అనుకున్నాను అని అనగానే ఇక జడ్జ్ ఏమి చేసేదిలేక విశ్వం నేను ఏదో విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తాడు.. అయితే ఆ విశ్వం మళ్ళీ బయటికి వస్తే అమూల్య జీవితాన్ని ఏం చేస్తాడు అని అందరూ భయపడతారు.. భద్ర సేన విశ్వం విడుదల కాబోతున్నారని ప్రకటించడంతో చాలా సంతోషంగా ఉంటారు.. రామరాజును చూసి వెటకారంగా నవ్వుతారు.. విశ్వంను మొత్తానికి అమూల్య కాపడుతుంది. అసలు అమూల్య ఎందుకు విశ్వం మీద అంత జాలి చూపించిందో అర్థం కాక ధీరజ్జు ఆలోచిస్తూ ఉంటాడు..

నర్మద అంతు చూస్తాను..

ఆ నర్మద, ప్రేమలు నీ జీవితాన్ని నాశనం చేశారు.. నర్మదను ఇంట్లో నుంచి పంపిస్తాను అని చెప్తున్న సరే నువ్వు మాత్రం వినకుండా రివేంజ్, కాకరకాయ నీది ముసలి ఐడియాలు అంటూ నన్ను ఏదేదో అన్నావు అని భాగ్యం దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతుంది. ఇవాళ ఆ నర్మద లేకుండా ఉంటే నువ్వు నీ భర్తతో సుఖంగా కాపురం చేసుకునే దానివి కదా అని భాగ్యం సీరియస్ అవుతుంది. నా బావ ను నా నుంచి దూరం అవడానికి కారణం వాళ్ళిద్దరూ కాబట్టి వాళ్ళిద్దరిని ఇకమీదట వదిలిపెట్టను అని శ్రీవల్లి శబదం చేస్తుంది. ఎలాగైనా సరే ఆ నర్మదా ప్రేమలకు ఇకమీదట నవ్వే లేకుండా చేస్తాను అని శ్రీవల్లి అనుకుంటుంది.. ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి అని భాగ్యం శ్రీవల్లితో అంటుంది.. నువ్వు ఇప్పుడు ఆ ఇంట్లో కూరలు తీసేసిన పాము లాంటి దానివి ఏమి చేయడానికి లేదు అని శ్రీవల్లితో భాగ్యం అనగానే శ్రీవల్లి గట్టిగా అరుస్తుంది..

శ్రీవల్లి సీరియస్.. భాగ్యం ప్లాన్..

Advertisement

శ్రీవల్లి ఎప్పటికప్పుడు తనకు ఏదో ఒకటి ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది అని బాధపడిపోతూ ఉంటుంది.. నేను ఎంతగా ప్రయత్నించినా సరే నాకు ఇలాంటివి తగలడం చాలా బాధగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది.. నన్ను ఆ ఇంట్లో లెక్క చేయలేదు. కేవలం మా మామయ్య గారు మాత్రమే నన్ను కోడలుగా చూస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా మనిషిగా కూడా చూడడం లేదు.. ఇదంతా ఆ నర్మదా వల్లే. నర్మదని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలి ఈసారి నేను కొట్టే దెబ్బ ఇక జీవితంలో తను తల ఎత్తుకొని ఇవ్వకుండా చేస్తాను అని శ్రీవల్లి అంటుంది.. మా అత్తయ్య గారికి కూడా నేను గట్టిగానే షాక్ ఇవ్వాలి అని శ్రీవల్లి అనుకుంటుంది. నర్మదను ఆ ఇంట్లో నుంచి పంపించేసి ఆ పొట్టి మిరపకాయకి అసలు తోడు లేకుండా చేస్తాను.. ఆ కుటుంబాన్ని నాశనం అయ్యేలా చేస్తాను అని శ్రీవల్లి కంకణం కట్టుకుంటుంది.. రైస్ మిల్లును కూడా మన పేరు మీద రాయించేసుకోవాలి అని భాగ్యం ప్లాన్ చేస్తుంది..

అమూల్య నిజం చెప్తుందా..?

విశ్వంకి జైలు శిక్ష పడకుండా కాపాడిన అమూల్య బయటకు రాగానే ధీరజ్ ఎందుకు నువ్వు ఇలా చేసావు. వాడి ఏమైనా నిన్ను బెదిరించాడా చెప్పు అమూల్య అని ఎంతగా అడుగుతున్నా సరే అమూల్య మాత్రం అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది.. వాడేం నన్ను బెదిరించలేదు అన్నయ్య నేను కేవలం అమ్మ కోసమే ఇలా చేశాను అని అమూల్య అంటుంది.. అయ్యో శ్రీరామచంద్ర అన్నానంటే అన్నానంటారు నాకోసం ఇలా చేయడం ఏంటే.. ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని వేదవతి అంటుంది.. ఆ ఇంటికి ఆ ఇంట్లో నీ మనుషులకి ఇప్పుడు నువ్వు దూరంగా ఉన్నావు.. ఇప్పుడు ఆ విశ్వాన్ని నేను జైలుకు పంపిస్తే శాశ్వతంగా నువ్వు ఆ ఇంటికి దూరమైపోతావ్ అమ్మ అందుకే నేను వాడు దుర్మార్గుడైనా సరే కేసు వాపస్ తీసుకుంటానని అన్నాను అని అమూల్య అంటుంది..

రామారాజుకు ఘోర అవమానం..

Advertisement

రామరాజు నువ్వు మంచిపనికే చేశావు కానీ వాళ్లు అంత మంచినీ తీసుకునే వాళ్ళు కాదు.. మనము చేతకాకే కేసు వాపసు తీసుకున్నామని వాళ్ళు విర్రవీగుతారు. ఈ విషయంలో మాత్రం నేను చాలా అసంతృప్తిగా ఉన్నాను అని రామరాజు అనగానే నన్ను క్షమించండి నాన్న అని అమూల్య అంటుంది. నా పిల్లలు నా కుటుంబంతో నన్ను కలపాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.. నేను ఎంత చేసినా కూడా వాళ్ళకి దగ్గర కాలేకపోతున్నాను అని వేదవతి సంతోషంలోనే బాధ పడిపోతూ ఉంటుంది.. కేసు వాపస్ తీసుకునింది అని తెలియదని నర్మదా ప్రేమలు అమూల్య ఎందుకు ఇలా చేసింది అని ఆలోచిస్తూ ఉంటారు.. మరి వల్లి ఆ విశ్వం భద్ర వాళ్లతో మళ్ళీ కలిసి పోతుందా..? లేదంటే చందు కు ఇంకా దూరమవుతుందా అన్నది సస్పెన్స్ గా మారింది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : చక్రికీ ఘోర అవమానం.. మాధవ్ పరువు పోయిందిగా.. పల్లీలు అమ్మేవాడిగా కన్నా..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×