// // Illu Illalu Pillalu Today Episode: ప్రేమ పెళ్లి చూపులు సీన్ హైలెట్.. -->
E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ పెళ్లి చూపులు సీన్ హైలెట్.. నర్మద సెటైర్లు.. కామాక్షిని రెచ్చగొట్టిన భాగ్యం..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ పెళ్లి చూపులు సీన్ హైలెట్.. నర్మద సెటైర్లు.. కామాక్షిని రెచ్చగొట్టిన భాగ్యం..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి మాత్రం వాళ్లు ఇక రారు అని అనగానే వేదవతి షాక్ అవుతుంది. అక్కడ పెళ్లి వాళ్ళు వచ్చారు లేదా వెళ్లి చూడు అని అంటుంది వేదవతి. ఇక శ్రీవల్లి బయటికి వెళ్లి రామరాజు వాళ్ళు టెన్షన్ పడుతుండడం చూసి పెళ్లి వాళ్ళు ఇంకా రాలేదని అనుకుంటుంది.. వాళ్లు ఇక రారు అని సంతోష్ పడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత వాళ్ళు రాగానే శ్రీవల్లి షాక్ అవుతుంది.. ఏంటండీ మీకు ఫోన్ చేస్తున్న కాని మీరు తీయట్లేదు అని రామరాజు అంటాడు.. వీళ్ళేంట్రా బాబు రారనుకుంటే వచ్చేసారు అని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. లోపలికి రండి అని రామరాజు అందర్నీ లోపలికి తీసుకొని వెళ్తాడు.. ఈ మాత్రం దేవుడా ఏం జరిగిందో అసలు రారు అనుకుంటే ఇలా వచ్చారు ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటుంది.. మీరు గెటప్పులు మార్చుకొని వెళ్లి వాడిని చెడగొడతామని ఏదేదో కోతలు కోశారు అని అంటుంది. మేము ప్రయత్నం చేశాం అమ్మడు కానీ అక్కడ ఏం జరిగింది అనేది వివరిస్తుంది భాగ్యం.. మొత్తానికి పెళ్లి చూపులు కోసం అందరూ రెడీ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషానికి వస్తే.. ప్రేమ నాకు ధీరజ్ కి పెళ్లి చూపులు జరగలేదు కదా అని సిగ్గు పడిపోతూ ఉంటుంది.. ఒకవేళ మా ఇద్దరికి పెళ్లిచూపులు జరిగితే ఎలా ఉంటుందో అని ఆలోచించుకుంటూ ఉంటుంది.. వాళ్ళిద్దరికీ వాళ్ల ఇంట్లో పెళ్లిచూపులు జరిగితే ఎలా ఉంటుందని ఊహించుకుంటుంది.. ప్రేమ ఊహల్లో పెళ్లిచూపులు సరదాగా ఉంటాయి. రామరాజు కుటుంబం సేన కుటుంబం ఇద్దరు కలిసి ప్రేమగా ధీరజ్ కు పెళ్లి చూపులు ఏర్పాటు చేసినట్లు ప్రేమ ఊహించుకుంటుంది.. ప్రేమ తన ఇంట్లో ఎలా ఉంటుందో అన్నది ఈ సీన్లో చూపిస్తారు.. ఇక ప్రేమ ఏమి రావని చెప్పినా కూడా ధీరజ్ పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఆ తర్వాత ప్రేమ ఒప్పుకోకపోయినా సరే ధీరజ్ మాత్రం తన వెంటపడి మరి కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమిలాడుతూ ఉంటాడు.

Advertisement

ప్రేమ ఒక్కసారిగా నవ్వడంతో నర్మదా ఏమైంది అని అడుగుతుంది. అయితే ప్రేమ పెళ్లిచూపులు గురించి మాట్లాడుతుంది.. ధీరతో నా పెళ్లి చూపులు జరగలేదు కదా అక్క పెళ్లిచూపులు ఎలా ఉంటాయని ఊహించుకున్నాను అని అంటుంది. అందులో ఏం జరిగింది అని అంటే ప్రేమ ధీరజ్ తో పెళ్లి చేయడానికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు.. కానీ ధీరజ్ మాత్రం నా కాళ్ళ వెళ్ళబడి చాలా బ్రతిమలాడాడు అది నాకు బాగా నచ్చింది. ఊహల్లో ధీరజ్ ఎలా నన్ను అడుగుతుంటే నాకు చాలా బాగా నచ్చింది అక్క అని అనగానే ధీరజ్ ఆ మాటలు వింటాడు..

ఇక కామాక్షిని సీన్లోకి దించాలని భాగ్యం అనుకుంటారు.. మొత్తానికి కామాక్షిని శ్రీవల్లి తీసుకొని వస్తుంది. నువ్వు ఈ టైం లో ఇక్కడ ఉండకపోతే నీకు రావాల్సిన కట్న కానుకలు వాళ్ళు ఇవ్వరు అని అనగానే కామాక్షి ఎలా ఎలా కుదురుతుంది నేను కచ్చితంగా తీసుకుంటాను అని అంటుంది.. అయితే నువ్వు మీ నాన్నని కాదు అడగాల్సింది మీ అమ్మని. మీ అమ్మని అడగాలంటే వెనుక కుటుంబం నుంచి వెళ్లి అడుగు అని శ్రీవల్లి అంటుంది. లోపలికి వెళ్లి వేదవతి తో నన్ను పిలవాలని కూడా లేదా మీకు అని అడుగుతుంది. ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు అని కామాక్షిని వేదవతి అడుగుతుంది. ఇంట్లో చెల్లెలికి పెళ్లిచూపులు జరుగుతున్న సొంత అక్కని పిలవాలని మీకు లేదు. నా కర్మ కాకపోతే అని బాధపడుతుంది. నేను పిలవాలి అనుకున్నాం.. కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత కట్న కాను కలు అంటూ వాళ్లని కూడా ఎక్కడ అడుగుతావో భయమేసి పిలవలేదు అని వేదవతి అంటుంది.

Advertisement

నీకు నాకన్నా డబ్బులు ఎక్కువైపోయాయి అమ్మ నువ్వు కూతుర్ని కూడా పక్కన పెట్టేస్తావా అమ్మ అని బాధపడుతూ కామాక్షి బయటికి వస్తుంది.. కామాక్షి ఇయాల రావడం చూసిన శ్రీవల్లి భాగ్యం.. నువ్వు ఇలా బయటికి వస్తే వాళ్ళు నిన్ను రేపు మర్చిపోతారు.. ఓపిక చేసుకొని నువ్వే వెళ్లి దగ్గరుండి అన్ని చూసుకో అప్పుడే నీకు రావాల్సినవి నీకు వస్తాయి అని చెప్పడంతో కామాక్షి అవును నిజమే కదా అని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది.. ఇప్పుడే కదా బయటకు వెళ్లావు మళ్లీ వచ్చావ్ ఏంటి అని వేదవతి అడుగుతుంది.. ఇక తర్వాత నా చెల్లి పెళ్లిచూపులు కదా.. వెళ్ళు నా చెల్లి నేనే రెడీ చేస్తాను అని కామాక్షి అంటుంది..

Also Read : హైదరాబాద్ కు తిరిగివచ్చిన రాజేంద్ర కుటుంబం.. శ్రీయ, పల్లవి రచ్చ.. చక్రధర్ మాస్టర్ ప్లాన్..

అమూల్య రెడీ అయింది చాలుగాని నువ్వు కూడా రెడీ అవ్వాలి కామాక్షి అని అంటారు. పెళ్లిచూపులు దానికి అయితే నేనెందుకు రెడీ కావాలి అని కామాక్షి అంటుంది. ఎందుకంటే నువ్వు పెళ్లి కూతురు అక్క కదా పని మనుషుల కనిపిస్తే బాగోదు కదా అందుకే రెడీ అవ్వాలని రెడీ చేస్తారు.. ఇక తర్వాత కామాక్షి అక్కడ కూర్చొని పెళ్ళికొడుకు ఈ అమ్మాయిని పెళ్లికూతురని అనుకుంటాడు.. వేదవతి మాత్రం ఈ అబ్బాయి చూపే మన వంకర ఏంటి పెళ్లికూతురు ఇక్కడ ఉంటే అటు చూస్తున్నాడేంటి అని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో కామాక్షిని పెళ్లికూతురు అనుకుంటాడు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×