E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ప్రేమను క్షమించిన రామరాజు.. మళ్లీ ఫిట్టింగ్ పెట్టిన శ్రీవల్లి.. ప్రేమ కు షాకిచ్చిన ధీరజ్..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమను క్షమించిన రామరాజు.. మళ్లీ ఫిట్టింగ్ పెట్టిన శ్రీవల్లి.. ప్రేమ కు షాకిచ్చిన ధీరజ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదకు శ్రీవల్లి ఇచ్చిన సలహా పై భాగ్యం సీరియస్ అవుతుంది. బుద్ధిలేని దాన ఇలా చేసావ్ ఏంటి నీ కూతురు నువ్వే తోవ్వుకున్నావు అని తిడుతుంది. భాగ్యమిచ్చిన క్లారిటీతో శ్రీవల్లికి దిమ్మ తిరిగిపోతుంది. అమూల్య నుంచి నిజం కాబట్టి సమయంలో ప్రేమ అక్కడికి వచ్చి అమూల్య చెప్పిన విషయాన్ని నేను విని షాక్ అవుతుంది.. ఆ తర్వాత ప్రేమ చాలా పెద్ద తప్పు చేశానని అనుకుని బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంట్లో వాళ్ళ అందరి దగ్గర నేను చెడ్డ అయిపోయాను అని బాధపడుతూ ఉంటుంది.. ఆ తర్వాత ప్రేమ దగ్గరికి వెళ్లిన నర్మదా అమూల్య చెప్పిన విషయం గురించి మరోసారి చెబుతుంది.. నువ్వు ఏమి బాధపడకు ప్రేమ నువ్వు నిజం తెలుసుకోవాలని అనుకున్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలో అది చెయ్యి అని ప్రేమతో అంటుంది..ప్రేమ విశ్వం నీ కడిగి పడేస్తుంది.. అంతేకాదు ఇంట్లో వాళ్ళందరికీ నిజం తెలుసుకుని ఎలా చేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. తన పుట్టింటి వాళ్లపై సీరియస్ అవుతుంది.. ఇదంతా చేసింది నువ్వే కదా అత్త నేను ధీరజ్ ని వదిలేసి నీ ఇంటికి వస్తానని నువ్వు కలగనకు అని ప్రేమ అంటుంది. ధీరజ్ నా ప్రాణం వాడిని వదిలేసి ఎప్పుడూ నీ దగ్గరికి రాను ఒకవేళ అలా రావాలి అనుకుంటే నా శవమే బయటకు వస్తుంది అని ధీరజ్ పై తనకున్న ప్రేమను ప్రేమ బయటపెడుతుంది. ఇక ఇంట్లోనే వాళ్ళందరూ కూడా నిజం తెలుసుకుంటారు. ఇంట్లోకి వెళ్లిన ప్రేమ రామరాజుకి నాదే తప్పు మావయ్య.. మా అన్నయ్య కన్నీళ్లు పెట్టుకుంటే నిజమే అని నమ్మాను అని అంటుంది..

Advertisement

నేను తప్పు చేశాను మావయ్య నన్ను క్షమించండి అని ప్రేమ అడుగుతుంది. మా అన్నయ్య కన్నీళ్లు పెట్టుకుంటే నిజమే అనుకొని నమ్మాను.. ఎప్పుడు ఇలాంటి తప్పు చేయను అని రామరాజు ని అడుగుతుంది ప్రేమ.. ఇక ప్రేమను రామరాజు క్షమిస్తాడు. నీ తప్పేమీ లేదులేమ్మా అనేసి రామరాజు అంటాడు.. ఇక ప్రేమ వెళ్లి వేదవతిని కూడా క్షమించమని అడుగుతుంది. నన్ను క్షమించత్తా తప్పు నాదే అని ప్రాధేయపడుతుంది.. ఆ ప్రేమను వేదవతి దగ్గరకు తీసుకుంటుంది. నన్ను క్షమించేసావా అత్త అని అనగానే శ్రీవల్లి కత్తితో పొడిచి రక్తం కారుతుంటే నన్ను క్షమించు అని అడిగినట్లు ఉంది అని అంటుంది. శ్రీవల్లి మాటతో నర్మదా దీనికి ఎంత జరిగినా బుద్ధి లేదా అని అనుకుంటుంది.

కొంతమంది తప్పులు చేసి దొరికిపోయిన తర్వాత కూడా తాము ఏ తప్పు చేయలేదని ఫీలవుతూ ఉంటారు. తమ తప్పులు ఎవరికీ తెలియవు అని ధీమాగా ఉంటారు. అవతలి వాళ్ళ మంచితనాన్ని చేతకానితనంగా భావించి రెచ్చిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళ కన్నా ప్రేమ చేసింది తప్పేమీ కాదు.. చిన్నపిల్ల కాబట్టి ఏదో ఆవేశంతో అనేసింది. తప్ప నిజానికి తను ఏ తప్పు చేయలేదు అని నర్మదా ప్రేమకు సపోర్టుగా నిలుస్తుంది. ఏంటి అత్తయ్య నువ్వు క్షమించవా ప్రేమని అని నర్మదా అడుగుతుంది. ఇది మరీ బాగుంది ఆయిల్ క్షమించిన తర్వాత నేనెందుకు క్షమించను ఏమండీ చెప్పండి అని వేదవతి అంటుంది. అంతే బుజ్జమ్మ క్షమించేసాను అని రామరాజు అంటాడు. నేను అయితే రేపు అమూల్యకు పెళ్లిచూపులు ఉన్నాయి అందరూ దగ్గరుండి అన్ని పనులు చేయాలి అని రామరాజు అంటాడు.

Advertisement

Also Read :అవనికి సపోర్ట్ గా అక్షయ్.. ఏకలింగంకు షాకిచ్చిన అక్షయ్.. డ్యూయేట్ సాంగ్ కు అవని, అక్షయ్ డ్యాన్స్..

గదిలోకి వెళ్ళిన ప్రేమ ధీరజ్ తో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ ధీరజ్ మాత్రం నిన్ను చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది నీ పక్కన నిలుచో వాలని అంటే అసహ్యం వేస్తుంది అని సీరియస్ అవుతాడు. మా వాళ్లని అంత బాధ పెడతావా నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళు అనేసి సీరియస్ అవుతాడు. ప్రేమ నా తప్పైపోయింది అని ఎంతగా ప్రాధే పడినా సరే ధీరజ్ మాత్రం కరగడు. నువ్వు వచ్చి నన్ను తీసుకొచ్చేంత వరకు నేను బయట చల్లోనే చచ్చిపోతాను అని ప్రేమ బయటకు వెళ్ళిపోతుంది. అమూల్యతో మాట్లాడాలని విశ్వం తనని పిలుస్తాడు.. వద్దని చెప్పిన కూడా ఆ తర్వాత అమూల్య కలవడానికి వెళుతుంది.. నువ్వు నీ చెల్లిని ఇంటికి రప్పించుకోడానికి నన్ను ట్రాప్ చేస్తావా అని సీరియస్ అవుతుంది. కానీ విశ్వం మాత్రం నేను ఎటువంటి ట్రాప్ చేయలేదు నేను నిజంగానే ప్రేమించాను అని అంటాడు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నేను జీవితంలో మొదటిసారి ప్రేమించింది నిన్నే.. నీకోసమే బతుకుతాను, నీకోసమే చచ్చిపోతాను అని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రేమ చలిలో ఉండడం చూడలేకపోయినా ధీరజ్ తన కోసం మంట వేస్తాడు.. ఇద్దరి మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ మొదలవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×