E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: తండ్రి మాట కోసం అమూల్య ఎమోషనల్.. అన్నల ప్రేమకు ఫిదా.. విశ్వంకు దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episode: తండ్రి మాట కోసం అమూల్య ఎమోషనల్.. అన్నల ప్రేమకు ఫిదా.. విశ్వంకు దిమ్మతిరిగే షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 22nd: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ ధీరజు ఇద్దరు కలిసి ఒక ఆట ఆడుతారు. గ్లాసులో బత్తాయి అంటూ ప్రేమ చెప్పిన ఆట ధీరజ్ కి అర్థం కాదు.. ఇది కాదు దెబ్బ గుర్తుండిపోయేలా ఉండాలి అని ధీరజ్ కావాలని తనకు తానే ఇరుక్కుని ఎలా చేసుకుంటారు. ఇద్దరు కలిసి ఒక ఆట ఆడుతారు అయితే ప్రేమదే పై చేయి కావడంతో ధీరజుకు దెబ్బలు తగులుతాయి.. ప్రేమ ధీరజ్ని మోసం చేసి మరి కొడుతుంది.. మొత్తానికి ఈ గేమ్ లో ప్రేమదే పై చేయి అవుతుంది. కానీ ఒక సందర్భంలో ప్రేమ ధీరజ్లు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు.. అప్పుడే అక్కడికి వచ్చినా తిరుపతి పెళ్లికాని నాలాంటి వాళ్ళ ముందర ఇలాంటివి చేస్తే నాకు ఎన్ని ఆశలు ఉంటాయో మీరు అర్థం చేసుకోవాలి కదా తలుపులు వేసుకొని రా అని అంటాడు..

అమూల్య ఎంగేజ్మెంట్ జరిగింది అని బాధపడిపోతూ ఉంటుంది.. విశ్వం నేను ఇంకా మర్చిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.. అయితే అప్పుడే విశ్వం ఫోన్ చేయడం చూసిన అమూల్య ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకు నువ్వు బాధ పడిపోతున్నావు. ఎంగేజ్మెంట్ కదా జరిగింది పెళ్లి కాలేదు కదా మనం ఇప్పుడైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామని విశ్వం అంటాడు.. నేను ఇప్పుడు అలాంటి పని చేయలేను మా నాన్న పరువు తీయలేను అని అమూల్య ఎంతగా చెప్తున్నా సరే విశ్వం మాత్రం తనని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు.. కానీ అమూల్య మాత్రం మా నాన్న పరువు ని ఎప్పటికీ తీయను అంటుంది.. ఇది మాత్రం తను ఎందుకో పరధ్యానంగా ఉంది ఏదైనా తప్పు చేస్తుందేమో అని రామరాజు తో అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రామరాజు అన్న మాటలు తలుచుకొని అమూల్య బాధపడిపోతూ ఉంటుంది. ఏదైనా తప్పు చేస్తే మా నాన్న తట్టుకోలేడు అని అనుకుంటుంది.. అలా ఒంటరిగా కూర్చుని బాధ పడిపోతూ ఉంటే ప్రేమ నర్మదతో పాటు ఇంట్లోనే వాళ్ళందరూ వచ్చి అమూల్య దగ్గర కూర్చుంటారు… పెళ్లయి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నానని బాధపడుతున్నావా అని అమూల్యని అడుగుతారు.. అమూల్యమాత్రం అన్నయ్యలా ప్రేమను చూసి మురిసిపోతూ ఉంటుంది.. తను ఎటు తేల్చుకోలేక అయోమయంలో ఉండిపోతుంది.. నీ పెళ్లి కోసం మేమందరం గిఫ్ట్ తీసుకొచ్చాము అని చందు అంటాడు..వల్లిని వెళ్లి ఆ చీరను తీసుకురమ్మని చెప్తాడు. వల్లి మాత్రం సాగర్ మరిది గారు ఏ గిఫ్ట్ తీసుకురాలేదేంటి అని అంటుంది.

అప్పుడే ఇంట్లోకి కామాక్షి వస్తుంది.. మీకు మీ చెల్లి అంటేనే ప్రేమ నేనంటే ప్రేమే లేదు నాకు కూడా ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చుగా అని అడుగుతుంది.. కానీ మీ చెల్లెలికి అన్ని గిఫ్ట్ ఇస్తున్నారు నేనంటే మీకు అసలు ప్రేమ లేదు కదా అని బాధపడిపోతూ ఉంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన తిరుపతి నీకు నాకు గిఫ్ట్ లు ఇవ్వరు అమ్మ ఆ అమ్మాయి పెళ్లి చేసుకోబోతుంది కదా అందుకే ఇస్తున్నారు అని అంటాడు… నీకెందుకు ఇవ్వాలి మామయ్య నేనంటే వాళ్ళ అక్కని అందుకే ఇస్తారు అని కామాక్షి అంటుంది.. ఇప్పుడు అందరూ అమూల్యకి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ లను ఇస్తారు.. ఈ అక్క అంటే మీకు ప్రేమే లేదు నాకు అర్థం అయిపోయింది అని కామాక్షి ఫీల్ అయిపోతుంది..

Advertisement

వాళ్లకి ఇద్దరు ఒకటే కాకపోతే అమూల్య అంటే కాస్త ప్రేమ ఎక్కువ అని తిరుపతి అనగానే కామాక్షి బాధ పడిపోతుంది.. ఇక తర్వాత అన్నదమ్ముల ప్రేమను చూసి ఫిదా అయిపోతుంది. మా అన్నలని మా నాన్న పరువుని తీసి నేను విశ్వంతో వెళ్ళిపోతే వీళ్ళు తట్టుకుంటారా అని బాధ పడిపోతూ ఉంటుంది.. ఇక తర్వాత తనకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని గుర్తుతెచ్చుకొని ఆ రింగ్ ఎక్కడో పడిపోయిందని వెతకడానికి వెళ్తుంది.. అక్కడే సద్దుతూ కనిపించిన వేదవతి తో ఆ రింగ్ ఎక్కడో ఉంది అని అడుగుతుంది. మొత్తానికి ఆ రింగ్ దొరక్కని మురిసిపోతూ సంతోషంగా కనిపిస్తుంది అమూల్య.

ఇందాక నేను రింగ్ ఇస్తే ఏమీ మాట్లాడకుండా తీసుకున్నావు. ఇప్పుడేంటి దాన్ని చూసి అంతగా సంతోషపడుతున్నావు అని అనగానే.. ఇది మా నాన్న పరువు మా అన్నల ప్రేమ. మా అమ్మ ప్రాణం అందుకే నేను దీన్ని ఇంతగా చూసుకుంటున్నాను మీ మాటను కాదనకుండా నేను ఏ పని చేయను అని అమూల్య వేదవతికి మాటిస్తుంది. మీ నాన్నని కరెక్టు మీ నాన్నకి గెలిచాడు అని వేదవతి అంటుంది. కడుపులో అడ్డం తిరిగాను కానీ ఇప్పుడు మాత్రం మీ పరువుని అడ్డంగా తీయను అని అమూల్య అనగానే వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది..

తర్వాత ఇంట్లో పూజ చేయడంతో అందరూ చాలా సంతోషంగా ఉంటారు.. శ్రీవల్లి మాత్రం అమూల్య పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని దేవుని కోరుకుంటూ ఉంటుంది.. ఒకవేళ అమూల్య పెళ్లి అయితే ఆ బండ సచ్చినోడు మా అమ్మ నాన్నల్ని చంపేస్తాడు. ఇంకేదైనా చేస్తాడు. కాబట్టి ఈ పెళ్లి జరగకుండా చూడవా అని దేవుని గట్టిగా కోరుకుంటుంది.. ఏంటి వల్లి అక్క అంత గట్టిగా ఏదో కోరుకుంటున్నావు అని అడగగానే.. నా గురించి మీరు ఎందుకు తప్పుగా అనుకుంటున్నారు. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని అనుకుంటున్నాను మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు అని అంటుంది..

Also Read : పల్లవి కొత్త డ్రామా.. సెంటిమెంట్ కు కమల్ ఫీల్.. అవనికి నిజం తెలుస్తుందా..?

ఇక భద్రావతి ఇంటికి వాళ్ళ పెద్దమ్మ వస్తుంది.. పెద్దమ్మ మాటే వేదం కాబట్టి ఆమె ఇక్కడికి వస్తుందంటే మనం చాలా బాగుండాలి అని అనుకుంటారు.. అయితే రేవతి మాత్రం వీళ్ళందరూ ఇంతకు భయపడిపోతున్నారు అంటే ఆవిడ లేడీ డాన్ అనుకుంటానని అంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన పెద్దమ్మని చూసి భద్రావతి సేన ఇద్దరు భయపడుతూ ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ప్రేమ ధీరజ్లు కలిసి పెళ్లి పత్రికలను ప్రింట్ చేయించడానికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×