E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: పెళ్లి చెడగొట్టేందుకు విశ్వం ప్లాన్.. రామరాజు ఎమోషనల్.. చిక్కుల్లో పడ్డ శ్రీవల్లి..

Illu Illalu Pillalu Today Episode: పెళ్లి చెడగొట్టేందుకు విశ్వం ప్లాన్.. రామరాజు ఎమోషనల్.. చిక్కుల్లో పడ్డ శ్రీవల్లి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ నర్మదలకు మాత్రం ఇక్కడ అందరూ ఉన్నారు ఆ శ్రీవల్లి మాత్రం లేదు అని అనుమాన పడుతుంది. వీళ్ళిద్దరూ కలిసి ఈ పెళ్లిని ఆపేందుకు ఏవో ప్రయత్నాలు చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అని ప్రేమ అంటుంది. అవును ప్రేమ నువ్వు చెప్పింది కూడా నిజమే.. వాళ్ళిద్దరూ ఏదో చేస్తున్నారని అర్థమవుతుంది.. ఇక వాళ్ళిద్దరి ఆట కట్టించడానికి మనం ఏదో ఒకటి చేయాలి. ఎంగేజ్మెంట్ ని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలి అని ప్రేమ అంటుంది. వాళ్ళు ఎలాంటి ప్లాన్ చేసినా మనం తిప్పి కొట్టి ఈ నిశ్చితార్థాన్ని పూర్తి చేస్తే అమూల్య పెళ్లి సజావుగా సాగిపోతుంది అని నర్మదా అనుకుంటుంది.. బల్లి అక్క ఎక్కడుందో ఒకసారి తెలుసుకోవాలి అని ఇద్దరు కలిసి వెతుకుతూ ఉంటారు. భాగ్యం, ఆనందరావు కలిసి ఫోటోలను పిల్లలకు దొరికేలా చేస్తారు. శ్రీవల్లి పై అనుమానం వచ్చిన ప్రేమ నర్మదలు శ్రీవల్లిని వెతికెందుకు వెళ్తారు.. కానీ పిల్లల చేతులు అమూల్య విశ్వ ఫోటోలు ఉండడంతో షాక్ అవుతారు.. వాటిని ఎలాగైనా సరే తీసుకోవాలని ప్రయత్నిస్తారు. మొత్తానికి నర్మదా ప్రేమలు ఇద్దరు కలిసి ఆ ఫోటోలను దాచి ఎంగేజ్మెంట్ జరిగేలా చేస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అమూల్య ఎంగేజ్మెంట్ వనజ కొడుకుతో గ్రాండ్గా జరుగుతుంది. ఇద్దరు కలిసి చాలా సంతోషంగా కనిపిస్తారు. అమూల్య ఎంగేజ్మెంట్ పూర్తవడంతో ఇంట్లోని వాళ్ళందరూ ఆటపాటలతో డాన్సులతో సందడిగా ఉంటారు. వనజ నా కోడలికి నా ఇంటి నుంచి వచ్చిన డబ్బులతో నగలు చేయించాలని రామరాజుకు 20 లక్షల డబ్బులను ఇస్తుంది. అది చూసిన శ్రీవల్లి షాక్ అవుతుంది. ఇంట్లోనే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా అమూల్య పెళ్లి జరగబోతుందని సంబరాలు చేసుకుంటూ ఉంటారు.. ఆటపాటలతో ఎంగేజ్మెంట్ ను వేడుకను పూర్తి చేస్తారు.. వనజ తన కొడుకు ఎంగేజ్మెంట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంటారు.

Advertisement

అంతేకాదు తన కోడలికి తన ఇంట్లోని నగలనే వేయాలి అని అనుకుంటుంది. అందుకే రామరాజుకి 20 లక్షలు ఇస్తుంది కూడా.. ఇక అమూల్య ఎంగేజ్మెంట్ జరిగిందని సంతోషంగా ఉంటుంటే భద్ర మాత్రం వీళ్ళని చూసి కుళ్ళుకుంటుంది.. ఇక విశ్వం నేను ఎంగేజ్మెంట్ ని చెడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను అత్త కానీ జరిగిపోయింది నేనేమీ చేయలేకపోయాను అని బాధపడిపోతూ ఉంటాడు.. ఇప్పుడు ఏం చేయాలి అత్తా చెప్పు అని విశ్వం అడుగుతాడు.. అవ్వని రా ఎంగేజ్మెంట్ కదా అయింది ఇంకాస్త ముందుకు వెళ్తే అప్పుడు కదా రామరాజు పరువు పోతుంది అని భద్ర అంటుంది. ఇప్పుడు నువ్వు ఆ పిల్లకి ఫోన్ చేసి ఏం చేయాలో అని విశ్వంకి పూస గుచ్చినట్లు భద్ర ప్లాన్ ని వివరిస్తుంది.

కామాక్షి తన వెండి వస్తువులను పోయాయని ఏడుస్తూ ఉంటుంది.. తిరుపతి కామాక్షిని ఒక ఆట ఆడుకుంటాడు.. ఇక తర్వాత సాగర్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే అప్పుడే తనకి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ మాట్లాడిన సాగర్ గవర్నమెంట్ ఉద్యోగం ఉంది అండి కాకపోతే పాతిక లక్షలు ఖర్చు అవుతుందని అంటాడు. అయితే పాతిక లక్షల అని సాగర్ ఆలోచిస్తూ ఉంటాడు.. తన మామ అవమానించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు.. ఎలాగైనా సరే ఈ ఉద్యోగాన్ని సంపాదించాలి అని అనుకుంటాడు..

Advertisement

ఇక అప్పుడే రామరాజు సాగర్ అని పిలుస్తాడు. వనజ ఇచ్చిన 20 లక్షల ను సాగర్ చేతికిచ్చి ఇది మన ఇంటి గౌరవం అని అంటాడు. అయితే నాకు మీ ఇద్దరి పెళ్లిళ్లు చూసే అవకాశం లేకుండా పోయింది.. రామరాజు కొడుకులు లేచిపోయే పెళ్లి చేసుకున్నారు అని మాట నాకు ఇప్పటికీ పోలేదు. అమూల్య పెళ్లితో ఆ మాట పోయి మన గౌరవం ఇంకా పెరుగుతుంది. 20 లక్షలు మన గౌరవాన్ని మర్యాదని పెంచుతాయి అని పదేపదే చెప్పి రామరాజు సాగర్ కు ఆ డబ్బులను ఇస్తాడు. వనజ గారు అన్నట్లు ఈ డబ్బులతో నగలన్ని చేయించి అమూల్యకు పెడదాము అని అంటారు. ఈ డబ్బులు నీ జాగ్రత్తగా బ్యాంకులు వెయ్యు అని పదేపదే చెబుతాడు రామరాజు..

రామరాజు సంతోషాన్ని చూసిన సాగర్ నాన్న ఇంత సంతోషంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు.. మన సంతోషాన్ని ఇలాగే నాన్న ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అనుకుంటాడు. ఇక నర్మదా అమూల్య విశ్వం ఫోటోలు ఎంగేజ్మెంట్ టైంలో ఎవరు తెచ్చారు అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఇప్పుడు అక్కడికి వచ్చిన ప్రేమ కూడా ఏం జరిగింది ఎలా ఆ ఫోటోలు వచ్చాయి అని ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని శ్రీవల్లి దొంగ చాటుగా వింటూ ఉంటుంది. కచ్చితంగా ఇదంతా శ్రీవల్లి ప్లాన్ అని అనుకుంటారు. ఎన్ని రోజులు మనం శ్రీవల్లిని తక్కువ అనుకున్నాము. ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదు అని ఆలోచించము..

Also Read : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న మాస్ చిత్రాలు.. ఏ ఒక్కటి మిస్ అవ్వకండి..

ఇకమీదట అలా జరగకూడదు ఇంట్లో ఎలాంటి పరిస్థితులు జరిగిన శ్రీవల్లి కారణమని అర్థం అయిపోయింది కదా తన అంతు చూడాలి అని ఇద్దరు ఫిక్స్ అవుతారు.. అయితే వీళ్ళిద్దరూ కలిసి అలా అనుకోవడం విన్న శ్రీవల్లి నా కొంపు కొల్లేరు ఎలా ఉంది.. ఇక మీదట ఎటువంటి విషయాలను నేను విశ్వం తో మాట్లాడటం కుదరదు అని ఫిక్స్ అవుతుంది.. ఎలాగైనా సరే ఈ గండ నుంచి కట్టిక్కాలి అని శ్రీవల్లి అనుకుంటుంది.. ప్రేమ, ధీరజ్ ఇద్దరు కూడా గొడవ పడతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×