E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: తండ్రిని మోసం చేసిన సాగర్.. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రేమ.. శ్రీవల్లికి షాక్..

Illu Illalu Pillalu Today Episode: తండ్రిని మోసం చేసిన సాగర్.. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రేమ.. శ్రీవల్లికి షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode February 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదవల నాన్న రామరాజుని చూడడానికి హాస్పిటల్ కి వస్తాడు. అక్కడ ఆయన్ని చూసి మీరేం బాధపడకండి ఆయన వెంటనే కోల్కుంటాడు అని చెప్తాడు. ఆ తర్వాత అందరూ అక్కడికి వచ్చిన తర్వాత ఒక కూతురు ఇలాంటి పని చేస్తే ఏ తంరికైనా ఇదే గతి పడుతుంది అని అంటారు.. అలాగే ఏ తండ్రికి ఇలాంటి కష్టం రాకూడదు అని అతను అంటాడు.. ఇక సాగరును బయటికి రమ్మని పిలుస్తాడు. గవర్నమెంట్ జాబు కొట్టాలి అంటే రేపే లాస్ట్ డేటు ఆ డబ్బులు అరేంజ్ చేసుకుంటే అతనికి డబ్బులు ఇచ్చి జాబ్ కి ఆఫర్ లెటర్ తీసుకోవచ్చు అని అంటాడు. ఇక తర్వాత నర్మదా ప్రేమ ఇద్దరు కూడా భోజనం చేయడానికి అని అందరికీ భోజనం తెస్తారు. తినమని వేదవతిని ఎంతగా బ్రతిమలాడినా సరే.. వేదవతి తినకపోగా వేదవతి బాధపడిపోతూ ఉంటుంది..

రామరాజుకు స్పృహ వచ్చింది అని నర్స్ చెప్పగానే అందరూ సంతోషంతో లోపలికి పరిగెత్తుకొని వెళ్తారు. రామరాజు స్పృహలోకి రావడం చూసి అందరూ సంతోషపడతారు.. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ అతనికి ఊపిరాడనివ్వండి. ఇప్పుడే స్పృహలోకి వచ్చారు కదా మీరు ఇలా గుంపుగా ఉంటే అతను మళ్లీ స్పృహ కోల్పోతాడు అని అంటారు. ఆ తర్వాత రామరాజు హెల్త్ కండిషన్ బాగుంది అని డాక్టర్ చెప్పగానే అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. భాగ్యం శ్రీవల్లి మాత్రం నర్మదకు తెలిసిన విషయం ఇంట్లో వాళ్లకు తెలిస్తే నన్ను చంపేస్తారు అని టెన్షన్ పడిపోతూ ఉంటారు.. ఇంటికి రాగానే వల్లి టెన్షన్ పడిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. ప్రాణాలతో బయటపడి ఇంటికి వచ్చిన కన్నతండ్రిని చూస్తూ అమూల్య అక్కడే ఉండిపోతుంది.. నేను తప్పు చేశాను నాన్న నా వల్లే మీకు ఈ పరిస్థితి వచ్చింది నన్ను క్షమించండి అని తన మనసులో అనుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది. అమూల్య అక్కడుండటం చూసిన విశ్వం ఇక్కడ ఏం చేస్తున్నావే అని కొడతాడు.. ఇక్కడ ఏం పని నీకు పదా లోపలికి అని అంటాడు. అయితే చందు ధీరజ్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే వేదవతి ఆపుతుంది. ఆ తర్వాత తిరుపతి విశ్వంకి వార్నింగ్ ఇచ్చి వస్తాడు. నా పెళ్ళాం నా ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటాను తిట్టుకుంటాను అడగడానికి నువ్వు ఎవడు అని విశ్వం అంటాడు. వేదవతి తిరుపతిని రమ్మని చెప్తుంది.

ప్రేమకు కొరియర్ వచ్చిందని పిలవగానే ప్రేమ వచ్చి ఆ కొరియర్ ని తీసుకుంటుంది. ఎస్ఐ జాబ్ కి ఎగ్జామ్ కి హాల్ టికెట్ వచ్చిందని సంతోషంగా ఫీల్ అవుతుంది.. అయితే ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉండగా నేను ఎగ్జామ్ ఎలా రాయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.. ప్రస్తుతం మావయ్య గారి పరిస్థితి బాగోలేదు కదా అది చూసుకోవాలి. ఆ తర్వాతే ఎగ్జామ్ గురించి ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే శ్రీవల్లి అక్కడికి వచ్చి ఏంటి ప్రేమ దాస్తున్నావు అని అడుగుతుంది. ఏమీ లేదు ఆయన నీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు అని ప్రేమ అంటుంది..

Advertisement

చెప్తే నేను కూడా తెలుసుకుంటాను కదా లెటర్ రాసే వాళ్ళు నీకు ఎవరున్నారు అని ప్రేమను శ్రీవల్లి అనుమానంగా అడుగుతుంది. ఎన్నిసార్లు ప్రేమను శ్రీవల్లి అడిగినా సరే ప్రేమ మాత్రం చెప్పడానికి ఒప్పుకోదు.. ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదు అంటే ఏదో దాస్తుంది అని నాకు అనుమానంగా ఉంది అని శ్రీవల్లి అనుకుంటుంది. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన నర్మదా నీకెందుకు చెప్పాలి అని అంటుంది. తెలుసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని శ్రీవల్లి అనగానే నర్మదా అవునా అయితే లోపలికి వెళ్దాం పద అని అంటుంది. లోపలికి ఎందుకు ఏమైంది అని శ్రీవల్లి అడుగుతుంది.. నువ్వు చేసిన మోసాలు కుట్రలు కూడా ఇంట్లో వాళ్లందరికీ తెలిస్తే ఒక పని అయిపోతుంది కదా రా అని అంటుంది.

Also Read : ఆదివారం టీవీ సినిమాలు.. లవర్స్ కు పండగే.. డోంట్ మిస్..

అయితే ప్రేమకు ఏమి వచ్చిన నాకు సంబంధం లేదు అని శ్రీవల్లి అంటుంది. అటు సాగర్ తన తండ్రి ఇచ్చిన 20 లక్షల డబ్బులను జాబ్ కోసం కట్టేస్తాడు. జాబు వచ్చిందని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఇంటికి వస్తాడు. రామరాజు అమ్మ నర్మదా సాగర్ ఎక్కడ కనిపించలేదు అని అడుగుతాడు.. ఏదో పని ఉందని బయటికి వెళ్లాడు మామయ్య వచ్చేస్తాడు అని నర్మదా అంటుంది.. తనకు జాబ్ వచ్చిన విషయాన్ని చెప్పాలని సాగర్ నర్మదతో చెప్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతుందని అనుకుంటాడు.. కానీ రామరాజు ఎక్కడికి వెళ్లావు అని అడగడంతో ఆ విషయం గురించి చెప్తే తిడతాడు అని భయపడతాడు.. రైస్ మిల్లులో చాలా పనులు ఉన్నాయి అందుకే బయటకు వెళ్లాను అని అంటాడు.. అక్కడితో ప్రోమో పూర్తవుతుంది. మరి సోమవారం ఎపిసోడ్లో 25 లక్షల మేటర్ బయటపడుతుందేమో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×