E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం ప్లాన్ సక్సెస్.. శ్రీవల్లి ఫుల్ హ్యాపీ.. సాగర్ ను కొట్టిన రామరాజు..

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం ప్లాన్ సక్సెస్.. శ్రీవల్లి ఫుల్ హ్యాపీ.. సాగర్ ను కొట్టిన రామరాజు..
Advertisement

Illu Illalu Pillalu Today Episode February 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. కారును ప్రేమ పేరు మీద రిజిస్టర్ చెయ్యమని చెప్పడం వల్ల ప్రేమ షాక్ అవుతుంది. మా నాన్న ఎప్పుడూ ఏది తీసుకున్నాం మా అమ్మ పేరు మీదే తీసుకుంటాడు నాకు నువ్వు అలాగే కదా అందుకే నీ పేరు మీద తీసుకున్నాను అని సెంటిమెంట్ డైలాగులు కొడతాడు ధీరజ్.. ఆ మాటలకి ప్రేమ పొంగిపోతుంది. ఇక తర్వాత ప్రేమ ధీరజ్లు ఇద్దరు కూడా కార్ని టెస్ట్ చేస్తారు.. అక్కడ ఇద్దరు కలిసి గొడవపడతారు. ఇంక రాత్రి ప్రసాద్ఏ ర్పాటుచేసిన పార్టీకి అందరూ కూడా వెళ్తారు. ప్రసాద్ రావు తన అల్లుడు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడమే చాలా గొప్పగా అందరికి పరిచయం చేస్తాడు..వేదవతి తన కొడుకు గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటే మురిసిపోతూ ఉంటుంది..

నా కొడుకు ఇంత గొప్ప వాడవుతాడని నేను చాలా సంతోషంగా ఉంటానని అనుకోలేదు అని మనసులో అనుకుంటుంది.. ఇక నర్మదా చాలా బాధపడుతూ కనిపిస్తుంటే వేదవతికి అనుమానం వస్తుంది. ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడిగితే ఏం లేదు అత్తయ్య అని నర్మదా అంటుంది. ఇక తర్వాత అందరూ కూడా చాలా సంతోషంగా సాగర్ కి కంగ్రాజులేషన్స్ చెప్తూ ఉంటారు.. సంతోషంగా ఉంటారా అయితే ఇంకా సేపట్లో బాంబు పేల పోతుంది అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. భాగ్యం రామరాజు దగ్గరికి వెళ్లి ఈరోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు అన్నయ్యగారు అని అంటుంది. ఏం చెల్లమ్మ ఏం మాట్లాడుతున్నావ్ ఏం జరిగింది అని రామరాజు అడుగుతాడు.. ఎవరిని ఎప్పుడూ నమ్మలో ఎవరు మనల్ని తెలియకుండానే మోసం చేస్తారు అర్థం కావట్లేదు అన్నయ్యగారు అని నాటకం మొదలుపెడుతుంది. మా ఫ్రెండు ఒక ఆమె ఉద్యోగం ఇచ్చే ఏజెంట్ దగ్గరికి వెళ్ళింది.. అక్కడ ఉద్యోగం డబ్బులతో జరిగిపోతుందట. డబ్బులు కడితే వెంటనే ఉద్యోగాన్ని ఇచ్చేస్తారని చెప్తుంది. అయితే అక్కడ మన సాగర్ ఫోటోని చూసిందట.. నేను తనకి బుద్ధి లేదు మన సాగర్ అలాంటి పని ఎందుకు చేస్తాడు అని చెప్పాను. కానీ వీడియో పెడతాను అని చెప్పింది అది రాగానే ఒకసారి చూడాలి అని అనుకుంటుంది..

వీడియో రాగానే అది చూసి షాక్ అయినా భాగ్యం.. రామ రాజుకి ఆ వీడియోని చూపిస్తుంది.. అది చూసిన రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. ఏంటి ఎందుకు సాగర్ ఇలాంటి పని చేశాడు అని అనుకుంటాడు.. ఇక రామరాజుని రెచ్చగొట్టే విధంగా ఆనందరావు కూడా మాట్లాడడంతో రామరాజు ఇంకా రెచ్చిపోతాడు.. ఇలాంటి కొడుకుని ఎలా కన్నారు బావగారు పిల్లనిచ్చిన నాకే ఇంత కోపంగా ఉంది మీకెంత కోపంగా ఉంటుందో అర్థం చేసుకోగలను అని రెచ్చగొడతాడు. ఆ వనజ గారికి ఇవ్వాల్సిన 20 లక్షలు సాగరు ఏజెంట్ కి కట్టి ఉద్యోగం తెచ్చుకున్నాడేమో ఏంటి బావ గారు ఇదంతా అర్థం కావడం లేదు. సాగర్ ఇలా చేశాడంటే నాకు ఎంత కోపంగా ఉంది అని ఆనంద్ రావు రామరాజు దగ్గర మాట్లాడుతాడు..

Advertisement

ఈ విషయం గురించి ఎలాగైనా సాగర్ ని తేల్చుకోవాల్సిందే వనజ గారికి డబ్బులు ఇవ్వాలి అంటే ప్రతిసారి తడబడి పడుతూ ఉన్నాడు.. డబ్బులు ఇప్పుడిస్తాను.. అప్పుడు ఇస్తాను అని దాచేసాడు మరి ఆ ఐదు లక్షలు ఎక్కడ నుంచి కొట్టేసాడు ఎక్కడ అప్పు చేసి అడుగు కూడా అర్థం కావడం లేదని భాగ్యం అనగానే ఆ మాటకి కోపంగా బయలుదేరుతాడు రామరాజు.. వెంటనే పార్టీలోకి వస్తాడు అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది.. పార్టీలో కేక్ కట్ చేసి అందరూ సరదాగా ఉంటారు.. భాగ్యం ఫోన్ చేసి శ్రీవల్లికి ఇక్కడ పులి బయలుదేరింది అని చెప్పగానే చాలా సంతోషంగా ఉంటుంది.

ఇక చందు అందరూ వచ్చి కేక్ కట్ చేసి చాలా సరదాగా ఉంటారు. ఇది పార్టీ టైం కాబట్టి డాన్స్ వేయాలని శ్రీవల్లి అనగానే అందరూ కలిసి పెయిర్స్ గా డాన్సులు వేస్తారు.. మనము ఆ ఏజెంట్ కి ఫోన్ చేసి రామరాజు ఫోటో పంపించి ఎలాగైనా సరే ఇంకాస్త గొడవలు పెంచాలి అని భాగ్యం అనుకుంటుంది..

Also Read :దెబ్బలతో చక్రధర్.. కళ్ళు తిరిగిపడిపోయిన అవని.. పల్లవి నిజస్వరూపం బయటపడుతుందా..?

ఆ ఏజెంట్ కి రామరాజు గురించి చెప్తుంది. అందరూ సంతోషంగా డాన్సులు వేస్తూ ఉండగా రామరాజు షాకింగ్ ఎంట్రీ ఇస్తాడు.. ఆ ఏజెంటు నాకే 5 లక్షలు ఇవ్వాలి మీరు ఇవ్వండి అని అడగ్గాని అతన్ని ఒక్కసారిగా కొడతాడు అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు.. ఆ తర్వాత సాగర్ రామరాజు ని అంత కోపంగా చూసి షాక్ అవుతాడు. ఉద్యోగాన్ని 25 లక్షలు పెట్టి కొన్నావా నువ్వు అని అడగ్గాని ఒక్కసారిగా నర్మదతో పాటు అందరూ షాక్ అయిపోతారు.. సాగర్ ని రామరాజు ఇంత బుద్ధి తక్కువ పని చేస్తావని కొడతాడు. డబ్బుల గురించి నర్మదా చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×