// // Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు షాకిచ్చిన ధీరజ్.. నర్మదకు ఝలక్ ఇవ్వబోతున్న భాగ్యం..సెంటిమెంట్ వర్కౌట్.. -->
E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు షాకిచ్చిన ధీరజ్.. నర్మదకు ఝలక్ ఇవ్వబోతున్న భాగ్యం..సెంటిమెంట్ వర్కౌట్..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు షాకిచ్చిన ధీరజ్.. నర్మదకు ఝలక్ ఇవ్వబోతున్న భాగ్యం..సెంటిమెంట్ వర్కౌట్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode February 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి భాగ్యం ఆనందరావు ముగ్గురు కూడా గెటప్ లు మార్చుకొని సాగర్ కి జాబ్ ఇచ్చినా ఏజెంట్ దగ్గరికి వెళ్తారు.. అక్కడ అతన్ని మాటల్లో పెట్టి శ్రీవల్లి అతనికి లైన్ వేసినట్లు నాటకమాడి నిజమే రాబట్టాలని అనుకుంటారు.. ఆ ఏజెంటు శ్రీవల్లి మాయలో పడిపోతాడు. ఇక శ్రీవల్లి తనని ట్రాప్ చేసి ఎలాగైనా సరే సాగర్ డీటెయిల్స్ ని కనుక్కోవాలని అనుకుంటుంది. ఇక ఇద్దరూ కలిసి అతని మాయలో ముంచేస్తారు.. మా ఆయనకి జాబ్ కావాలని అడగగానే ఐదు లక్షల కట్టాలని అతను అంటాడు. డబ్బులు కట్టిన తర్వాత మీరు డబ్బులు తీసుకొని పారిపోతే ఎలా అని భాగ్యం అడుగుతుంది. నేను అంత మోసం చేసేవాళ్లకు కనిపిస్తున్నానా మీకు మిగతా వాళ్ళకి అయితే పది లక్షలు మీ కుట్టి ప్రేమగా అడిగింది కాబట్టి ఐదు లక్షల ఒప్పుకున్నాను.. నేను జాబులు ఇప్పిచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి ఎవరికి ఫోన్ చేయమంటారో చెప్పండి వాళ్లకి ఫోన్ చేసి అడుగుతాను అని అతను అంటాడు. సాగర్ ఫోటో కనిపించడంతో వాళ్లు షాక్ అవుతారు.. మొత్తానికి వాళ్ళ అనుమానమే నిజమైంది అని సంతోషంగా ఉంటారు. మొత్తానికి ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నర్మదా సాగర్ ల ఉద్యోగం గురించి తెలియగానే శ్రీవల్లి, భాగ్యం ఇద్దరు కూడా ఎలాగైన సరే అన్ని బయట పెట్టాలని అనుకుంటారు. పార్టీ గురించి నర్మదా ఇంట్లో చెప్పగానే అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. కానీ శ్రీవల్లి నిజం చెప్పకబోతుంటే భాగ్యం మాత్రం అడ్డుకుంటుంది.. అయితే వేదవతి రామరాజు మాటకి బాధపడిపోతుంది.. నర్మదా నువ్వేం బాధపడకు నర్మదా నేను మీ మావయ్య గారిని ఒప్పించే పని చేస్తాను. కచ్చితంగా వస్తాను అని అంటుంది.. ఇక శ్రీవల్లి ఎందుకమ్మా నన్ను ఆపావు నిజం చెప్పేసినట్టే వాళ్ళ పరిస్థితి అయిపోయేది కదా అని అంటుంది.. ఇప్పుడు నిజం చెప్తే నలుగురికే తెలుస్తుంది రాత్రి పార్టీలో నిజం చెప్తే అందరికీ తెలిసిపోతుంది కదా అందుకే అని భాగ్యం అంటుంది.. ఇక తర్వాత ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా కార్ షోరూం కి వెళ్తారు.. అక్కడికి వెళ్ళగానే ప్రేమ ఇన్ని లక్షలు నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చాయి రా అని అడుగుతుంది.. కార్ సెలెక్ట్ చేయి ఆ తర్వాత నేను చెప్తాను అని ధీరజ్ అంటాడు.. అక్కడ కూడా వీళ్లిద్దరు గొడవ పడడంతో ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది..

Advertisement

ప్రేమ ఒకవైపు ఎంత చెప్తున్నా సరే ధీరజ్ మాత్రం కారు కొనే తీరాలి అని అనుకుంటాడు.. వీడి దగ్గర ఇంత డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఎలా వచ్చాయి అని ఆలోచిస్తూ ప్రేమ ఉంటుంది.. నర్మదా ఫంక్షన్ గురించి ప్రేమకి చెప్పాలని అనుకుంటుంది. ప్రేమ ధీరజులు ఉదయం నుంచి ఇంట్లో కనిపించలేదు ఎక్కడికి వెళ్లారు అని నర్మదా అంత వెతుకుతుంది. అయితే ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోతుంది కదా అని నర్మదా వాళ్ళకి ఫోన్ చేయగానే ప్రేమ కారు షోరూంలో ఉన్నామని చెప్తుంది. అదేంటి అక్కడ ఏం చేస్తున్నారో అని నర్మదా అడిగితే నా తింగరి మొగుడు కారు కొనాలని ఇక్కడికి వచ్చాడు. అయితే డబ్బులు ఎక్కడవో తెలియదు కానీ కారు మాత్రం కొనడానికి వచ్చాడు ఏంటో నాకు అర్థం కావడం లేదు అని ప్రేమ అంటుంది..

సాగర్ కు జాబ్వచ్చిందని మా నాన్న పార్టీ అరేంజ్ చేసాడు.. అయితే మావయ్య కోపంగానే ఉన్నాడు.. ఏ మాత్రం ఈ పార్టీకి వస్తానని చెప్పింది మీరు కూడా తప్పకుండా ఈ పార్టీకి రావాలి అని నర్మదా అడుగుతుంది. ప్రేమ మేము వస్తాము అక్క నువ్వేం ఫీల్ అవ్వకు అని అంటుంది. అక్కడి నుంచి ఇంటికి వచ్చి రెడీ అవ్వాలంటే చాలా టైం పడుతుంది కదా మీరు త్వరగా వచ్చేసేయండి అని నర్మదా అంటుంది. ఆ తర్వాత నర్మదా నాకు నీ నగలు కావాలి అని ప్రేమను అడుగుతుంది.. దానికి అడగాలి అక్క నువ్వు తీసుకుని పెట్టుకో అనేసి ప్రేమ అంటుంది. నీ నగలు నానగలు ఏంటి అక్క నీకు కావలసినవి తీసుకొని పెట్టుకో అనేసి ప్రేమ అంటుంది..

Advertisement

ఇక శ్రీవల్లి రెడీ అయ్యి భాగ్యం దగ్గరికి వస్తుంది. భాగ్యం మంచిగా రెడీ అయ్యావు అని కూతుర్ని పొగిడేస్తూ ఉంటుంది. ఆ ఫంక్షన్ లో నర్మద గురించి బయట పెట్టేయాలి ఇక్కడ నేను మంట పెట్టేస్తుంటాను అని భాగ్యం చెప్తుంది. ఇవాల్టితో ఆ నర్మద పీడ విరగడ అయిపోతుంది అని భాగ్యం శ్రీవల్లి ఇద్దరు కూడా ప్లాన్ చేస్తారు.. ఇక తర్వాత వేదవతి రాగానే నర్మదా సాగర్ లో ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతుంది. ఆ మాట వినగానే సాగర్ నర్మదా అక్కడికి వస్తారు.. మీరిద్దరు వెళ్ళండి మీ బాగోతం ఇప్పుడు బయట పడుతుంది అని భాగ్యం మనసులో అనుకుంటుంది. ఫంక్షన్ లో అందరు ముందర సాగర్ కు వచ్చిన జాబ్ గురించి బయట పెట్టాలని వీళ్లిద్దరూ ప్లాన్ చేస్తారు..

ఇక ప్రేమ ఇద్దరూ కూడా కారు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.. ఆ కారుని ముందుగా బుక్ చేసుకోవాలంటే రెండు లక్షలు కట్టాలి. అడ్వాన్స్ బుకింగ్ అయితే 20 వేలు కట్టాల్సి ఉంటుంది అని అనగానే ప్రేమ మనసులో వీడి దగ్గర వెయ్యి రూపాయలు కూడా ఉండవు అని అనుకుంటుంది.. ఇక తర్వాత ప్రేమ ధీరజ్ డబ్బులు ఇవ్వడంతో షాక్ అవుతుంది.. ఇంత డబ్బులు నీ దగ్గర ఎలా వచ్చాయి రా నీ ప్రేమ అనుకుంటుంది. క్యాబ్ డ్రైవ్ చేసినప్పుడు వచ్చిన డబ్బుల్ని కొంత కొంత సేవ్ చేసుకున్నాను అవే ఇవి అని అనగానే ప్రేమ షాక్ అవుతుంది. కారుని ఎవరి పేరు మీద బుక్ చేయమంటారు అని అనగానే అందరి పేర్లు చెప్తుంది ప్రేమ..

Also Read : ‘పొదరిల్లు ‘ మహా లో ఈ టాలెంట్ ఉందా..? అస్సలు ఊహించలేదుగా..

కానీ ధీరజ్ మాత్రం ప్రేమ పేరు చెప్పగానే షాక్ అవుతుంది.. ఏంట్రా మీ అమ్మ పేరుగాని మీ నాన్న పేరు గానీ చెప్పకుండా నా పేరు చెప్పావ్ ఏంటి అని ప్రేమ అడుగుతుంది.. మా నాన్న ఎప్పుడూ ఏది తీసుకున్నాం మా అమ్మ పేరు మీదే తీసుకుంటాడు నాకు నువ్వు అలాగే కదా అందుకే నీ పేరు మీద తీసుకున్నాను అని సెంటిమెంట్ డైలాగులు కొడతాడు ధీరజ్.. ఆ మాటలకి ప్రేమ పొంగిపోతుంది. ఇక తర్వాత ప్రేమ ధీరజ్లు ఇద్దరు కూడా కార్ని టెస్ట్ చేస్తారు.. అక్కడ ఇద్దరు కలిసి గొడవపడతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×