E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు నిజం చెప్పిన సాగర్.. ప్రేమ, ధీరజ్ ల రొమాన్స్.. శ్రీవల్లి ప్లాన్ అట్టర్ ప్లాప్..

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు నిజం చెప్పిన సాగర్.. ప్రేమ, ధీరజ్ ల రొమాన్స్.. శ్రీవల్లి ప్లాన్ అట్టర్ ప్లాప్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode February 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. వేదవతి ఒక్కటే కూర్చుని బాధపడిపోతూ ఉంటుంది.. అయితే ప్రేమ ధీరజ్లు ఇంటికొచ్చిన తర్వాత వేదవతిని చూసి ఏమైందమ్మా ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నావని అంటారు. ఆ తర్వాత అందరూ కలిసి వేదవతి దగ్గరికి వస్తారు.. ఏమైందమ్మా ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతారు. మీ నాన్న మీ ముగ్గురు విడిపోతారని బాధపడుతున్నారు రా మీరు ఆయనకు చెప్పకుండా ఏదైనా చేస్తారేమో అని కంగారు పడిపోతూ ఉన్నాడు.. అయితే మీరు ఎవరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళము అని నాకు మాట ఇవ్వండి..

ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మీ ముగ్గురు ఇలాగే కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ నాన్న కోరుకునేది కూడా అదే నాకు మాట ఇవ్వండి అని వేధవతి అంటుంది.. అయితే సాగర్ మాత్రం మాటి ఇవ్వడానికి ఆలోచిస్తాడు కానీ ఏమైంది రా నీకు అని అందరూ అంటారు. డబ్బులు ఇస్తానని చెప్పారు లేడు రా మీరందరూ మాత్రం కలిసి ఉండాలి అని వేదవతి అంటుంది.. అందరూ కలిసి వేదవతికి కలిసుంటామని మాటిస్తారు. ఆ తర్వాత శ్రీవల్లి ఆ డబ్బులని ఊహించుకొని మహారాణి లాగా ఫీల్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. 20 లక్షల గురించి ఆలోచిస్తూ సాగర్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. అయితే నర్మదా సాగర్ కి భోజనం తీసుకొని వస్తుంది. భర్త రోజంతా నిలబడి పని చేశాడు అలాంటిది ఇప్పుడు నేను భోజనం పెట్టకుండా ఉంటే ఎలా ఉంటుంది. నీకు భోజనం తినిపిస్తాను అని భోజనం తినిపిస్తూనే నర్మదా సాగర్ ని నువ్వు ఎప్పుడు ఎగ్జామ్ రాసావు అని అడుగుతుంది. సాగర్అనుమానం వస్తే నర్మదైక వదిలిపెట్టదు అని అనుకుంటాడు.. అసలు ఆ 20 లక్షలు నువ్వు ఎక్కడకి తీసుకొని వెళ్లావు అర్థం కావడం లేదు అని నర్మదా అంటుంది.. ఒకసారి నా ఫ్రెండ్ కు కాల్ చేసి మీ ముందే మాట్లాడుతాను అని నర్మదా అంటుంది..

తన ఫ్రెండు రమ్య కి ఫోన్ చేసి నా నర్మదా సాగర్ మీ బ్యాంకుకు వచ్చి 20 లక్షలు డ్రా చేస్తాడని చెప్పావు కదా.. మరి సాగర్ మాత్రం అకౌంట్లోనే ఉన్నాయని చెప్తున్నారు. నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావా అని నర్మదా అడుగుతుంది. నువ్వు నా ఫ్రెండ్ వి నీకు నేనెందుకు అబద్ధం చెప్తాను. సాగరు ఆల్రెడీ డబ్బులు డ్రా చేసుకొని తీసుకొని వెళ్ళాడు. కావాలంటే రేపు బ్యాంక్ ఓపెన్ చేసినప్పుడు రా నీకు డీటెయిల్స్ చూపిస్తాను అని అంటుంది.. నిన్ను ఆట పట్టించడానికి మీ ఆయన అలా చేస్తున్నాడేమో ఒకసారి కనుక్కో అనేసి తను అనగానే సరే నేను కనుక్కుంటాను అని నర్మదా అంటుంది. ఆ 20 లక్షలు డబ్బులు డ్రా చేశావు మరి ఎక్కడ పెట్టావ్? ఎవరికిచ్చావు అని నర్మదా గట్టిగా నిలదీసి అడుగుతుంది..

Advertisement

ఆ మాట వినగానే సాగరు నోట్లో నీళ్లు నములుతాడు. ఆ తర్వాత సాగరు ఆ డబ్బులు ఏం చేశావు అని నర్మదాడగానే ఆ 20 లక్షలు పెట్టే నేను జాబ్ కొన్నాను అని నిజం చెప్పేస్తాడు.. ఆ వనజ గారు ఇప్పటికే మీ చెల్లెలు గురించి నాన్న మాటలని పరువు తీశారు.. మీ నాన్న చావు బతుకుల వరకు వెళ్లి తిరిగి వచ్చారు. అలాంటి ఆయనను ఇప్పుడు ఆ వనజ గారి డబ్బులు తీసుకున్నావు అంటే ఇంకెంత మర్యాద లేకుండా మాట్లాడుతుందో కనీసం ఆలోచించవా.. ప్రాణాలతో బయటపడిన మీ నాన్న ఆమె మాటతో ప్రాణాలు తీసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు అని నర్మదా అంటుంది.

మంచి జాబు అని చెప్పడంతో నేను ఆ డబ్బులు కట్టాను నర్మదా.. నన్ను దయచేసి అపార్థం చేసుకోవద్దు అని సాగర్ బ్రతిమలాడుతాడు. కానీ నర్మద మాత్రం నేను నీలాంటి అబద్దాల కోరుతూ నేను కాపురం చేయలేను. నీవల్ల నాకు పుట్టిల్లు దూరమైంది అనుకున్నాను ఇప్పుడు నాకు మెట్టినిల్లు కూడా దూరమవుతుందని బాధగా ఉంది అని సాగర్ తో అంటాడు. ఆ తర్వాత సాగర్ నర్మదా నువ్వు వెళ్ళిపోకుండా కాళ్లు పట్టుకొని బ్రతిమలాడుతాడు. నువ్వు నా గురించి ఆలోచించవద్దు అని ఎంత చెప్తున్నా సరే.. నువ్వు వెళ్ళిపోతే నేను ప్రాణాలతో ఉండను అని నర్మదతో అంటాడు.

ఇక ధీరజ్ తన కారుని ఫ్రెండ్స్ తీసుకెళ్లారు అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ ఏంటి టెన్షన్ పడిపోతున్నావు ఏదైనా కొంపముంచే పని చేశావు ఏంటి అని అడుగుతుంది. ప్రేమని ఆటపట్టించడానికి ధీరజ్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు.. అయితే వీళ్ళిద్దరూ కలిసి రొమాన్స్ చేసుకుంటున్నారని తిరుపతి చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అరేయ్ మీరిద్దరూ రొమాన్స్ బ్రహ్మచారి ముందర కాదురా మీకు ఒక గది ఉంది కదా అక్కడి పెళ్లి చేసుకోండి రా అని అంటాడు. ఆ తర్వాత శ్రీవల్లి ముగ్గు పెడుతూ ఉంటుంది.. ఇక ఆ తర్వాత అమూల్య ముగ్గు వేయడానికి అని బయటకు వస్తుంది. ఇక్కడ రేవతి ముగ్గు వేసే దానికి నేర్పిస్తాను అని అంటుంది.. అయితే శ్రీవల్లి అక్కడికి వచ్చి నేను ముగ్గు వేయడం నేర్పిస్తాను లెండి అని అంటుంది. అమూల్యని ఎంతగా బతిమిలాడినా సరే నువ్వు చేయడం వలన నా జీవితం ఇలా మారింది అని బాధ పడిపోతూ ఉంటుంది.

Also Read :పల్లవి పై అవనికి అనుమానం.. ఆధారాలను మాయం చేసిన పల్లవి..తండ్రి కొడుకులు కన్నీళ్లు..

ఇక తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసిన ప్రేమ ఏం మాట్లాడుతున్నావ్ వల్ల అక్క అని గట్టిగా అరుస్తుంది.. ఏమీ లేదు ముగ్గు వేయడం నేర్పిస్తున్నాను ఆ ఇంట్లో వాళ్ళు నిన్ను సరిగా చూసుకుంటున్నారా లేదా అని అడుగుతున్నాను అంతే అని ప్రేమ అంటుంది.. ఇక శ్రీవల్లి లోపలికి వెళ్ళగానే ప్రేమ ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితులను బయట పెట్టొద్దు అని మాట తీసుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×