E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: చందును మోసం చేస్తున్న శ్రీవల్లి…ప్రేమకు ధీరజ్ ప్రపోజ్..సీన్ అదిరింది..

Illu Illalu Pillalu Today Episode: చందును మోసం చేస్తున్న శ్రీవల్లి…ప్రేమకు ధీరజ్ ప్రపోజ్..సీన్ అదిరింది..
Advertisement

Illu Illalu Pillalu Today Episode February 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు మాత్రం సాగర్ పై కోపంగానే ఉంటాడు. ఆ తర్వాత ప్రేమ ఇలాంటి టైంలో మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్తే ఎవరికైనా తెలిస్తే.. ఇంట్లో చెప్తే ఏం జరుగుతుందో ఊహించలేము అని ధీరజ్ తో అంటుంది. నువ్వేమీ కంగారు పడకుండా రా వెళ్దాం అనేసి ధీరజ్ ప్రేమను తీసుకొని వెళ్ళిపోతాడు. అటు సాగర్ కూడా తన మొదటి రోజు కాబట్టి ఆఫీస్ కి తొందరగా వెళ్ళిపోతాడు. అయితే భాగ్యం ఆనందరావు సాగర్ కి ఇంత సడన్గా జాబ్ ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అయితే సాగర్ ని అడిగినప్పుడు అతను చెప్పిన పాతిక అనే మాటనే ఏంటో తెలుసుకోవాలని అనుకుంటారు..

సాగర్ కు ఉన్నంత బుర్ర ఎవరికీ ఉండదు. అంత తక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఎక్కడా లేదు అని భాగ్యం అంటుంది.. అయితే శ్రీవల్లి భాగ్యం ఆనందరావు ముగ్గురు కూడా సాగరు లంచం ఇచ్చే ఉద్యోగం తెచ్చుకున్నాడు అని ఫిక్స్ అయిపోతారు.  రామరాజు సాగర్ తో మాట్లాడకపోయినా వేదవతి మాత్రం తన కొడుకు గవర్నమెంట్ ఆఫీసర్గా ఉద్యోగానికి వెళ్ళబోతున్నాడని ఆశీర్వదించి పంపిస్తుంది. అందరూ సాగర్ కి ఆల్ ది బెస్ట్ పంపిస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. వేదవతి తన కొడుకు ఉద్యోగానికి వెళ్తున్నాడని పూజ చేసి ఆశీర్వదించి పంపిస్తుంది. మీ నాన్న కొడుకులు ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటారు. అంతేకానీ నువ్వు ఎప్పుడు చేసిన తర్వాత చెప్పడం కాదు చెయ్యకముందు చెప్పడం నేర్చుకో అదే సంస్కారం అని వేదవతి అంటుంది.. ఇక సాగర్ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు… ఆ తర్వాత ఇంట్లోకి రాగానే ధీరజ్ కూడా మేము వెళ్తాం అమ్మ నాన్నతో చెప్పు అని అంటాడు.. సరే నేను చెప్తాను ఆగు అని అంటుంది వేదవతి. అమ్మ మేం కూడా వెళ్లొస్తామని ధీరజ్ అంటాడు. అయితే అవును కదరా మర్చిపోయాను నేను చెప్పాను కదండీ మీకు కూడా.. ఏదో పనిమీద విజయవాడకి వెళ్తున్నారట.. అక్కడ లేట్ అవుతుంది అని ప్రేమ అని కూడా తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు.. అయితే మీరు ఒప్పుకుంటారో లేదో అని కంగారు పడుతున్నారు.. మీరు వెళ్ళమని చెప్పండి వాళ్ళు వెళ్తారు అని వేదవతి అంటుంది..

సరే వెళ్ళిరండి రా అక్కడ లేట్ అయితే జాగ్రత్తగా ఉండండి అని రామరాజు అంటాడు.. ఎగ్జామ్ కోసం వెళ్తున్నాం అన్న విషయాన్ని దాచిపెట్టిన ప్రేమ ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంటుంది.. నన్ను ఆశీర్వదించండి మామయ్య అని ప్రేమ అంటుంది. అదేంటమ్మా ఆశీర్వాదం ఎందుకు అని రామరాజు అడుగుతాడు.. ప్రేమ తనని అడ్డంగా ఇరికించేసిందని ధీరజ్ అనుకుంటాడు. అయితే ఎలాగైనా సరే రామరాజుకి డౌట్ రాకుండా మేనేజ్ చేయాలని అనుకుంటాడు.. అదే నాన్న మీరు ఒప్పుకుంటారో లేదో అని టెన్షన్ పడింది మీరు ఒప్పుకోగానే సంతోషంతో అలా అడిగింది లే అనేసి మేనేజ్ చేస్తాడు.

Advertisement

ఆ తర్వాత చందు నేను రైస్ మిల్ కి వెళ్ళొస్తాను అన్నానా అని అంటాడు. అది కేవలం రైస్ మిల్లు కాదురా మనకు అన్నం పెట్టిన దిక్కు అదే కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి అని రామరాజు అంటాడు. ఇక భాగ్యం రైస్ మిల్లు తాళాలను తెచ్చి నీ చేత్తో ఇవ్వమ్మా అని శ్రీవల్లికి చెప్తుంది.. మీ మావయ్య గారు రైస్ మిల్లు కి వెళ్ళేటప్పుడు మీ అత్తయ్య గారు చాలా ప్రేమగా తెచ్చి తాళాలు ఇచ్చారు కదా.. నువ్వు కూడా అలాగే నీ భర్తకు తాళాలు తెచ్చివ్వు అని అనగానే శ్రీవల్లి అలాగే అమ్మ అని అంటుంది.. వేదవతి తాను తాళాలను ఇస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకొని ఫీల్ అవుతుంది..

ఇక భాగ్యం ఆనందరావు అని కూడా రైస్ మిల్ కి వెళ్ళమని చెప్తుంది. అది ఏంటి బాబాయ్ గారు ఎందుకు ఇప్పుడు అవసరం లేదు కదా బావగారు ఒక్కడే చూసుకోగలరు కదా అని నర్మదా అంటుంది.. అదేం లేదు కదా చేదోడు వాదోడుగా ఒక మనిషి తోడు ఉండాలి కదా.. అందుకే ఈయన గాని పంపిస్తున్నాను అని భాగ్యం అంటుంది.. బియ్యం కొనడానికి పంపించాను. వాడు రావడానికి లేట్ అవుతుంది అందుకే బావగారు మీరు వెళ్ళండి అని రామరాజు అతని పంపిస్తాడు. నడి సముద్రంలో వదిలేసినట్లు మీరు అన్ని వదిలేశారు కదా మీకు మాట్లాడే అధికారం లేదు అని నర్మదతో రామరాజు అంటాడు. ఆ తర్వాత నర్మదా కచ్చితంగా వెళ్తున్నాడు అంటే ఏదో ఒకటి జరుగుతుంది అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది..

ధీరజు ప్రేమను తీసుకుని వెళ్ళగానే తన ప్రేమను ఎలాగైనా సరే ప్రేమకు చెప్పాలని ఆశ పడుతుంటాడు.. కానీ ప్రేమ ఏంట్రా నన్ను అలా మింగేసే వాడిలాగా చూస్తున్నావు ఏదైనా మాట్లాడాలని అడుగుతుంది. అవును నేను నీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు కానీ ధీరజ్ కి ధైర్యం సరిపోక మాటలు రాలేదు అని అనుకుంటాడు.. తర్వాత పాటలతో తన ప్రేమను చెప్పాలని అనుకుంటాడు. కానీ తనకు ఆ పాటల ద్వారా ప్రేమకు చెప్పాలన్న విధానం నచ్చక ప్రేమ తిట్టడంతో ఆపేస్తాడు. ఇక ఎలాగైనా సరే మనము ఒక ప్లాన్ చేసుకున్నాం కదా ఆ ప్లాన్ ప్రకారం ప్రేమకి ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు.. అనుకున్న విధంగానే ప్రేమను ఒక రెస్టారెంట్నికి తీసుకొని వెళ్తాడు..

Also Read : కొత్త హీరోయిన్ వచ్చేసిందోచ్.. బాధపడ్డ చక్రీ.. ప్రతాప్ మాటతో మహా కన్నీళ్లు..

అది చూడగానే సర్ప్రైజ్ అవుతావు అని అంటాడు అనుకున్నట్లుగానే అతను ప్రేమను సర్ప్రైజ్ చేస్తాడు. ఇక తన మనసులోని మాటని బయట పెట్టేస్తాడు. నా ప్రాణం ఉన్నంతవరకు నిన్ను ఇలాగే ప్రేమిస్తూ ఉంటాను అని ధీరజ్ చెప్పడంతో ప్రేమ అతని ప్రపోజల్ కి ఫిదా అవుతుంది. అయితే ప్రేమ ధీరజ్  ప్రపోజల్ సీన్ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది… అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ప్రేమ ఎగ్జామ్ గురించి ఇంట్లో తెలిసిపోతుంది ఏమో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×