E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: సాగర్ డబ్బుల మ్యాటర్ బయటపడుతుందా..? ప్రేమకు సపోర్ట్ గా వేదవతి.. ట్విస్ట్ ఇదే..

Illu Illalu Pillalu Today Episode: సాగర్ డబ్బుల మ్యాటర్ బయటపడుతుందా..? ప్రేమకు సపోర్ట్ గా వేదవతి.. ట్విస్ట్ ఇదే..
Advertisement

Illu Illalu Pillalu Today Episode February 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. భార్యకి ఇష్టమైన గవర్నమెంట్ జాబ్ వచ్చిందని ఒక వైపు సంతోషంగా ఉన్నా సరే.. మరోవైపు మాత్రం సాగర్ బాధపడుతూనే ఉంటాడు.. తన తండ్రి మాటను ఎదిరించానన్న బాధ తనలో ఉంటుంది. అయితే మొదటి రోజు ఉద్యోగానికి వెళ్ళబోతూ.. తన తండ్రిని ఎదిరించానన్నా బాధ ఎక్కువైంది అని నర్మదతో అంటాడు.. దానికి నర్మదా నువ్వు తప్పేమీ చేయలేదు కదా నీకు ఇష్టమైన పని నువ్వు చేసావు కదా వాళ్లే అర్థం చేసుకుంటారు. నువ్వు దీని గురించి బాధపడుతూ ఉద్యోగానికి వెళ్లాల్సిన అవసరం లేదు అని నర్మదా అంటుంది.. నువ్వు నీకోసం ఆలోచించావు వాళ్ళు నిదానంగా నీ ఉద్యోగాన్ని నీ ఎదుగుదలను చూసి గర్వపడతారు. అలాగా నువ్వు ఉద్యోగంలో ముందుకు వెళ్లాలి అని నర్మదా అంటుంది.. మా నాన్న కోరిక మేరకు నేను ఎటువంటి లంచాలు అవి తీసుకోకుండా నేను మంచిగానే జాబ్ చేసుకొని ఆయన పేరుని నిలబెడతానని సాగర్ అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రామరాజు మాత్రం సాగర్ పై కోపంగానే ఉంటాడు. ఆ తర్వాత ప్రేమ ఇలాంటి టైంలో మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్తే ఎవరికైనా తెలిస్తే.. ఇంట్లో చెప్తే ఏం జరుగుతుందో ఊహించలేము అని ధీరజ్ తో అంటుంది. నువ్వేమీ కంగారు పడకుండా రా వెళ్దాం అనేసి ధీరజ్ ప్రేమను తీసుకొని వెళ్ళిపోతాడు. అటు సాగర్ కూడా తన మొదటి రోజు కాబట్టి ఆఫీస్ కి తొందరగా వెళ్ళిపోతాడు. అయితే భాగ్యం ఆనందరావు సాగర్ కి ఇంత సడన్గా జాబ్ ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అయితే సాగర్ ని అడిగినప్పుడు అతను చెప్పిన పాతిక అనే మాటనే ఏంటో తెలుసుకోవాలని అనుకుంటారు.. సాగర్ కు ఉన్నంత బుర్ర ఎవరికీ ఉండదు. అంత తక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఎక్కడా లేదు అని భాగ్యం అంటుంది.. అయితే శ్రీవల్లి భాగ్యం ఆనందరావు ముగ్గురు కూడా సాగరు లంచం ఇచ్చే ఉద్యోగం తెచ్చుకున్నాడు అని ఫిక్స్ అయిపోతారు.

Advertisement

సాగర్ మాటల్లో అది బయటపడేలా కనిపించడం లేదు.. ఆ పాతికా అన్న మాట ఏంటో సాగర్ నోటి నుంచి కనుక్కోవాలి.. నువ్వు చెప్పింది కూడా నిజమే అమ్మ నాకు చెంప దెబ్బ కొట్టిన ఆ నర్మదపై నేను బాగా సాధించాల్సిందే అని శ్రీవల్లి కూడా అంటుంది.. అందరూ కలిసి సాగరు ఉద్యోగం ఎక్కడ చేస్తున్నాడు? అతని ఉద్యోగం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ప్లాన్ చేస్తారు. అయితే నర్మదా మావయ్య గారు ఇలా ఉండడం నాకు చాలా బాధగా ఉంది అని బాధ పడిపోతూ ఉంటుంది.. వేదవతి నర్మదా దగ్గరకొచ్చి ఆయన ఈరోజు కోపంగా ఉన్న రేపు తన కొడుకు ప్రయోజకుడు అయ్యాడని సంతోషపడతాడు అని అంటుంది.

ప్రతిరోజు తన కొడుకులు గురించి ఆలోచించే ఆయన కోపం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా.. పాలనురగలాగా వెంటనే తగ్గిపోతుంది.. మీరేమీ బాధపడకుండా మీ పనులు మీరు చూసుకోండి అని వేదవతి.. అయితే వేదవతి దగ్గరకు వచ్చిన ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా మీ ఆశీర్వాదం కావాల అత్తయ్య అని ప్రేమ అడుగుతుంది.. ఇవాళ ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ కి నేను వెళ్ళాలి అని అనుకుంటుంది.. ప్రేమ ఎంత సడన్గా అత్తయ్య కాల మీద ప్రేమగా పడి ఆశీర్వాదం కోరుకుంటుంది అంటే ఏదో చేస్తుంది అని శ్రీవల్లికి అనుమానం వస్తుంది.

Advertisement

నర్మదా ప్రేమ ఇద్దరు కూడా శ్రీవల్లిని ఇరకటంలో పడేస్తారు.. ఏం చూస్తున్నావ్ నీ పని ఏదో నువ్వు చూసుకోవచ్చు కదా ఎందుకు ఎప్పుడు ఎవరో ఒకరు పనిలో వేలు పెట్టాలని అనుకుంటున్నావు నీ గురించి బయట పెడితే నీ పరిస్థితి ఏంటో అది ఆలోచించి ముందు అని మరోసారి నర్మద వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది.. అయితే శ్రీవల్లి మాత్రం ఇద్దరూ నా గురించి తెలుసుకుని నన్ను ఆడుకుంటున్నారు.. ఇద్దరు గురించి నేను తెలుసుకొని ఇంట్లోంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేయాలి. అప్పుడే నేను ఇంటికి మహారాణి అవుతాను అని శ్రీవల్లి అనుకుంటుంది. సాగర్ ఉద్యోగానికి వెళ్లడం చూసిన అమూల్య చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది..

Also Read :అక్షయ్ కు నిజం చెప్పిన అవని..క్రిటికల్ గా అభి పరిస్థితి.. నిజాలు బయటకొస్తాయా..?

ఇక తర్వాత ప్రేమ ఎగ్జామ్ హాల్ కి వెళ్లడానికి భయపడుతూ ఉంటుంది.. ధీరజ్ ప్రేమని చాలా ప్రేమగా నువ్వు ఏమీ భయపడకు నువ్వు అనుకున్నది సాధిస్తావు.. ఎవరి గురించి నువ్వు ఆలోచించకు ఫస్టు ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలని ఆలోచించు.. నీకు నేను ఎప్పుడూ తోడుగానే ఉంటాను అది నా బాధ్యత అని ధీరజ్ అంటాడు. ఆ మాట విన్న ప్రేమ తన మనసులోని భయాన్ని బయటపడేస్తుంది.. ఇక ఇద్దరూ కలిసి కాస్త రొమాంటిక్గా కనిపిస్తారు.. ఎపిసోడ్కి ఇదే హైలెట్గా నిలుస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ప్రేమ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన విషయం శ్రీవల్లికి తెలుస్తుందా..? శ్రీవల్లి ఇంట్లో ఎలాంటి గొడవలను క్రియేట్ చేస్తుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×