E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్ ప్రేమకు ఫిదా.. సాగర్ జాబ్ బయటపడుతుందా..? అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి..

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్ ప్రేమకు ఫిదా.. సాగర్ జాబ్ బయటపడుతుందా..? అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode February 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ముగ్గు వేయడానికి బయటకి వస్తారు.. అయితే నర్మదా ముందుగా రావడం చూసి ప్రేమ ఇద్దరం కలిసి వెళ్తామని అంటుంది. నీకు ఒక న్యూస్ చెప్పాలి ప్రేమా అని నర్మదా అంటుంది.. అలాగే ప్రేమ కూడా నీకు ఒక న్యూస్ చెప్పాలి అక్క అని అంటుంది. ఏంటి ఆ న్యూస్ అని అడగ్గా నాకు ఎస్సై ఎగ్జామ్ కి హాల్ టికెట్ వచ్చింది అని చెప్పగానే నర్మదా సంతోషిస్తుంది. ఇక నర్మదా సాగర్ కి జాబ్ వచ్చింది అని చెప్పగానే ప్రేమ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.. ఇతర సంతోషాన్ని చూసిన అమూల్య సంతోషంగా ఉండడం నర్మదా ప్రేమలు చూస్తారు.. అమూల్య కి నువ్వేం బాధపడకు నీ తప్పేమీ లేదు అని తెలుసుకుని మళ్లీ నిన్ను ఇంట్లోకి రాణిస్తారు అని ధైర్యం చెప్తారు.. అమూల్య విశ్వంకి చుక్కలు చూపించాలని ఫిక్స్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నర్మదా పూజ కోసం ఇంట్లోని వల్ల పేర్లందరినీ చెప్తుంది. అలాగే అమూల్య పేరు కూడా చెప్పడంతో వేదవతి సీరియస్ అవుతుంది.. శ్రీవల్లి పొర్లు దండాలు పెడితే దేవుడు కరుణించి మన కష్టాలను తీరుస్తాడు అని భాగ్యం ఆనందరావు అతి కష్టంగా పొర్లు దండాలు పెట్టిస్తారు.. అప్పుడే గుడి లోకి ఎంటర్ అయిన విశ్వక్ అమూల్యలతో పూజ చేయించాలని జానకమ్మ విశ్వక్ని మోకాళ్ళ మీద ప్రదక్షిణాలు చేయమని అంటుంది.. నానమ్మ ఏది చెప్తే అది చేయాలి అని విశ్వక్ కూడా ఏమీ మాట్లాడకుండా ప్రదర్శనలు చేస్తాడు. అటు పొర్లు దండాలు పెడుతున్న శ్రీవల్లిని విశ్వక్ గుద్దుకుంటాడు.. ఇదంతా నీ వల్లే జరిగింది రా దొంగ సచ్చినోడా అని శ్రీవల్లి విశ్వక్ని దారుణంగా తిట్టేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు గొడవ పడుతుంటారు.

Advertisement

ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా పక్కకు వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు.. అయితే ధీరజ్ కొబ్బరికాయ కొడుతూ ఉంటే ప్రేమ నేను కొడతాను అని కొడుతుంది. అప్పుడు ప్రేమ చేతికి దెబ్బ తగలడంతో ధీరజ్ బాధపడతాడు.. నా చేతికి దెబ్బ తగిలింది కనీసం చూడవా అని ప్రేమ అనడంతో చేతికి కట్టు కడతాడు. ఎప్పుడూ లేంది ఈరోజు నాకు కొత్తగా కనిపిస్తున్నావ్ ఏంట్రా అని ప్రేమ అడుగుతుంది.. కొత్తగా ఏం లేదు నీ బాధ్యత నాదే కాబట్టి నేనే నేను చూసుకోవాలి.. కరెక్ట్ సమయం నా ప్రేమని ప్రేమతో చెప్పాలి అని అనుకుంటాడు.. ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే ధీరజ్ గొంతులో నుంచి మాట రాకపోవడంతో ప్రేమ ఏం చెప్పాలనుకుంటున్నావ్ రా చెప్పు అని అడుగుతుంది.

అప్పుడే అమూల్య గొంతు విన్న ప్రేమ ఇద్దరు కూడా నాన్న అమూల్యని చూస్తే మళ్ళీ అప్సెట్ అవుతారు. మనము నాన్నని వెంటనే ఇక నుంచి తీసుకెళ్లి పోవాలి అని అనుకుంటారు.. వెంటనే లోపలికి వెళ్లిన ధీరజ్ ప్రేమ మనం ఇక గుడిలో నుంచి వెళ్ళిపోదాం పద అని అంటారు.. ఏంట్రా అలా అంటున్నావు ఏమైంది అని వేదవతి అడుగుతుంది.. అయిపోయింది కదా అమ్మ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని ధీరజ్ అంటాడు.. సరే వెళ్ళిపోదాం పదండి అని అందరూ వెళ్తుండగా శ్రీవల్లి కాళ్లకు అడ్డంగా పొర్లు దండాలు పెడుతూ కనిపిస్తుంది.. నేను దొర్ల లేక చచ్చిపోతుంటే మధ్యలో ఈ స్పీడ్ బ్రేకర్లు ఏంటి అని శ్రీవల్లి అనుకుంటుంది.. అయితే ఎదురుగా రామరాజు వేదవతిని చూసి అయ్యో మావయ్య గారు మీరా అని అడుగుతుంది..

Advertisement

మీ ఆరోగ్యం బాగుండాలని మా అమ్మాయి పొల్లు దండాలు పెట్టాలని మొక్కునింది అని భాగ్యం అంటుంది.. ఆ తర్వాత అప్పుడే అక్కడికి ప్రసాద్ రావు వస్తాడు.. ఆయన స్వీట్లు పంచడం చూసి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు… ఎందుకండి మీరు స్వీట్లు పంచుతున్నారు అని అడిగితే సాగరు అని చెప్పబోతాడు కానీ నర్మదా నాన్న అని పిలవడంతో ఆగిపోతాడు. ఆ తర్వాత శ్రీవల్లి ఏమైంది ఎందుకు ఏదో సాగర గురించి చెప్పబోయారు అని అడుగుతుంది.. అమ్మాయి, అల్లుడు చాలా సంతోషంగా ఉన్నారు అందుకే పూజ చేయించాను అని అంటాడు.. మొదట ఎవరు నమ్మకపోయినా ఆ తర్వాత అందరూ నమ్ముతారు.

Also Read : రాజేంద్రను చూసి కన్నీళ్లు పెట్టుకున్న అవని.. పల్లవి కన్నింగ్ ప్లాన్.. గ్రాండ్ గా శ్రీయ సీమంతం..

శ్రీవల్లి ఈ దాన్నంతటికి కారణం ఆ బండ సచ్చినోడు వాడిని చంపేస్తే నాకు ఏ బాధ ఉండదు అని అనుకుంటుంది.. విశ్వక్ ఎక్కడున్నాడో వెతుక్కుంటూ అతనిపై ఒక రాయి వేయాలని వెళ్తుంది. కానీ విశ్వక్ మాత్రం చెప్పిన నిజాన్ని విని షాక్ అవుతుంది.. ఏంటి అమూల్య కి నువ్వు తాళి కట్టలేదని చెప్పగానే అవును. నేను తాళి కట్టలేదు అదే తాళి మెడలో వేసుకునింది. దీని వెనకాల ఎవరో ఉన్నారు తెలుసుకోవాలి అని అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇప్పుడు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×