// // Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి స్ట్రాంగ్ వార్నింగ్.. వల్లి బండారం బయటపడుతుందా..? అమూల్య దొరుకుతుందా..? -->
E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి స్ట్రాంగ్ వార్నింగ్.. వల్లి బండారం బయటపడుతుందా..? అమూల్య దొరుకుతుందా..?

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి స్ట్రాంగ్ వార్నింగ్.. వల్లి బండారం బయటపడుతుందా..? అమూల్య దొరుకుతుందా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. నగలను తీసుకొని శ్రీవల్లి తిరుపతిని బురిడీ కొట్టించి రామ రాజుకు ఇవ్వమని అడుగుతుంది. తిరుపతి మొదట ఇలాంటి పెద్ద సాహసం నేను చేయను నా మీద తప్పు నిందపడుతుంది అని అంటాడు. శ్రీవల్లి మాత్రం కన్నీళ్లు పెట్టుకొని కాళ్ళ వేళ్ళ పడి మరి తిరుపతిని ఒప్పిస్తుంది.. ఇక రామరాజు రాగానే తిరుపతి శ్రీవల్లి ఆ నగలను ఇవ్వాలని అనుకుంటారు. రామరాజు వచ్చి ఇంట్లో కూర్చోగానే తిరుపతి నగలను తీసుకొని వస్తాడు. బావ ఇదిగో నగలని అంటాడు. ఏ నగలు ఏం మాట్లాడుతున్నావు అని రామరాజు అంటాడు.  ఏం నగలు అంటావేంటి ప్రేమ నగలు అని తిరుపతి అనగానే అందరూ షాక్ అవుతారు. నగలు నీ దగ్గరికి ఎలా వచ్చినాయి అనేసి తిరుపతిని రామరాజు అడుగుతాడు.. అంతే కాదు తిరుపతిని కొట్టడంతో శ్రీవల్లి ఎక్కడ నిజం చెప్తాడు అని భయపడుతుంది. భద్ర, సేనా మాకు ఈ నగలు వద్దు అని విసిరి కొట్టేస్తారు. కానీ రేవతి మాత్రం ఇవి ప్రేమ నగలే అని వాటిని ప్రేమకు అందిస్తుంది.. రామరాజు తిరుపతి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని కఠినంగా చెప్పేస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నర్మదా, ప్రేమ ఇద్దరు కూడా వల్లికి గట్టిగానే బుద్ధి చెప్తారు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసావంటే కచ్చితంగా నీ గురించి అందరికీ చెప్పేస్తాము అని వార్నింగ్ ఇస్తారు.. శ్రీవల్లి మాత్రం నేను ఇకమీదట నుంచి ఎటువంటి తప్పులు చేయను మీకు ఇంకా డైలాగులు చెప్పే అవసరం రానివ్వను అని అంటుంది. నన్ను ఇకమీదట నుంచి కొత్తగా చూస్తారు.. అంటూ శ్రీవల్లి భారీ డైలాగులు వదులుతుంది. ఇకమీదట శ్రీవల్లి 2.0 ని మీరు చూస్తారు అని అంటుంది.. సరే ఇక వెళ్లి నువ్వు నీకు కాపురం ఏంటో నీ పని ఏంటో చూసుకో అనేసి అంటుంది నర్మదా.. కాస్త పక్కకు వెళ్ళగానే శ్రీవల్లి అక్కడున్న బస్తాలని చూసి ప్రేమ నర్మదా నన్నే అంటారా ఒక్కొక్కరు బుడతల్లా ఉన్నారు నా మీదే మీ ప్రతాపం చూపిస్తారా అనేసి వాటి మీద తన ప్రతాపాన్ని చూపిస్తుంది..

Advertisement

నా సంగతి ఏంటో మీకు తెలియదు.. నేను మీ గురించి ఆలోచిస్తే మీరు గాల్లో కలిసిపోతారు అని శ్రీవల్లి అక్కడున్న బస్తాలను కొడుతూ ఉంటుంది.. అయితే అది చూసిన ప్రేమ.. ఇది మారదు అని చెప్పాను కదా అక్క ఒకసారి చూడు ఏం చేస్తుందో అని అంటుంది.. ప్రేమ నర్మదా అంటూ బస్తా మీద ప్రతాపాన్ని చూపిస్తున్న శ్రీవల్లిని చూసి అక్కడికొస్తారు ప్రేమ నర్మదా.. ఇకమీదట నీ బుద్ధి మార్చుకోకపోతే నీకు ఏం గతి పడుతుందో అస్సలు ఊహించలేవు అని అంటారు. దీన్ని మనం మార్చుకోవాలి ఎంతైనా తను మన అక్కే కదా అనేసి నర్మదా అంటుంది.. అయితే మనము జాబ్ చేసేలా చేయాలి అప్పుడే మన గురించి ఆలోచించడం మానేస్తుంది అనేసి నర్మదా అంటుంది.

అవునక్కా నువ్వు చెప్పింది కూడా నిజమే.. ఎం ఏ ఇంగ్లీష్ అని అన్నారు కదా ఆ చదువు గురించి కూడా బయటపడుతుంది అని ప్రేమ అంటుంది.. ఇక అమూల్య విశ్వమిచ్చిన చీరని కట్టుకొని మురిసిపోతూ ఉంటుంది.. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. విశ్వ సెలక్షన్ చాలా బాగుంది అని అమూల్య అనుకుంటుంది. అప్పుడే వేదవతి అక్కడికి వచ్చి అమూల్య రెడీ అయ్యావా పదా వెళ్దామనేసి అంటుంది.. అవును ఈ చీర నీకు ఎక్కడిది అని వేదవతి అడుగుతుంది..

Advertisement

అమూల్య శ్రీవల్లి వదిన ఇచ్చింది అమ్మ అనేసి పొరపాటున నోరు జారీ చెప్పేస్తుంది.. అయితే శ్రీవల్లి అది విని షాక్ అవుతుంది.. ఇక వేదవతి వల్లి అని గట్టిగా కేకలు వేస్తుంది.. శ్రీవల్లి భయపడుతూ అక్కడికి వస్తుంది. ఏమే వల్లి ఈ చీర నువ్వే ఇచ్చావా అని అడుగుతుంది. అవును అత్తయ్య నేనే ఇచ్చాను అనేసి శ్రీవల్లి అంటుంది. అయినా నువ్వేంటే ఎవరు ఏ చీర ఇచ్చారో ఏ రంగు కూడా తెలియకుండా బతుకుతున్నావా అనేసి అమూల్యను అడుగుతుంది. అక్కడే ఉన్న ధీరజ్ మాత్రం ఇక ఈ చీరలు కూడా ఆపమ్మ నువ్వు అది భయంతో ఎలా వణికి పోతుందో చూడు..

అమ్మ గురించి నీకు తెలుసు కదా చాలా సీరియస్ గా ఉంటుంది.. మీదట ఇలాంటివి జరగకుండా నువ్వే చూసుకోవాలి అని ధీరజ్ అంటాడు. శ్రీవల్లి ఏంటి ఈ చీర గోలేంటి మధ్యలో నన్ను లాగడమేంటి ఏంటి కదా అని అడుగుతుంది.. ఈ చీరను నాకు విశ్వ ఇచ్చాడని అమూల్య సిగ్గుపడుతుంది.. ఏంటి చీరలు ఇచ్చుకునేంతవరకు వచ్చిందా..? కథ చాలా దూరం వెళుతుంది సిగ్గుపడుతున్నావ్ గా అని వల్లి అమూల్యను ఆట పట్టింస్తుంది.. తర్వాత తిరుపతి బయట రామ రాజు కోసం బాధపడుతూ పాట పాడుతూ ఉంటాడు.. అక్కడికి వచ్చిన అల్లుళ్ళని చూసి తిరుపతి ఏంట్రా అల్లుళ్లు మీ మామయ్య గురించి మీరు పట్టించుకోరా ఏంటి అని అడుగుతారు. రామరాజు ఏంట్రా అక్కడ మాటలు అని అనగానే అందరూ మాయమైపోతారు..

రామరాజు ఏంట్రా నువ్వు ఇంకా మా ఇంటి చుట్టే తిరుగుతున్నావు వెళ్లలేదా అనేసి అంటాడు. ఎక్కడికి వెళ్తాను బావ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నీతోనే ఉన్నాను. అక్క బావ ఇద్దరు నాకు అమ్మానాన్నలని అనుకున్నాను. రామరాజుకు భారీ డైలాగులతో కన్నీళ్లు తెప్పిస్తాడు.. అల్లుళ్ళు వచ్చి ఈసారికి మామని క్షమించండి నాన్న అనేసి అడుగుతారు. మొత్తానికి తిరుపతి ఇంట్లోకి వచ్చేస్తాడు.. సారీ బావా నేను లోపలికి వచ్చాను వెళ్ళిపోతాను అని అంటాడు. ఇంట్లో పూజ ఉంది కదా గేటేసి లోపలికి రా అని రామరాజు అంటాడు. ఈ ఎపిసోడ్ కి ఈ సీను గుండెలని హత్తుకుంటుంది. మాట వినగానే తిరుపతి సంతోషంతో గంతులు వేస్తాడు..

Also Read : చక్రధర్ కు అవని దిమ్మతిరిగే షాక్.. పల్లవి మరో నాటకం.. భానుమతి ప్లాన్ వర్కౌట్..

అందరూ కలిసి పూజకు సిద్ధం చేస్తారు. అందంగా ముస్తాబయి దంపతులు పూజలు కూర్చుంటారు. ప్రేమ మాత్రం ధీరజ్ అన్న మాటలు తలుచుకొని దూరంగా వెళ్లిపోతుంది.. వీరిద్దరిని చూసినా నర్మదా ఏదో జరుగుతుందని అనుకుంటుంది. ప్రేమ చీరని పట్టుకుంటాడు. పట్టుకుంది మధ్యలో విడిచి పెట్టడానికి కాదు. తిరుపతి మీరు పూజ ఉన్నామని అనుకుంటున్నారా? మీ రూమ్ లో ఉన్నారని అనుకుంటున్నారా? ఆ రొమాన్స్ ఏంటి రా అనేసి అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×