E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు దొరికిపోయిన శ్రీవల్లి.. అమూల్య బయటపెట్టిన నిజం.. ప్రేమకు షాక్..

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు దొరికిపోయిన శ్రీవల్లి.. అమూల్య బయటపెట్టిన నిజం.. ప్రేమకు షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 31st: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రామరాజు అందరితో మాట్లాడాలని అనుకుంటాడు.. అందరూ రాదని ఒక్కొక్కరికి పేరుపేరునా క్లాస్ పీకుతాడు..ఇంట్లో ముగ్గురు మగాళ్ళు ఉన్నారు కానీ ఎవరూ కూడా చెల్లెల్ని పట్టించుకోవట్లేదు అని రామరాజు సీరియస్ అవుతాడు. మీ ఇంట్లో ఒక చెల్లెలు ఉంది దాన్ని ఎలా చూసుకోవాలి. కాలేజీకి వెళ్తుంది అని అనగానే ఒక్కరు కూడా బాధ్యతగా లేరు.. మీ గొడవలు నీవే కానీ చెల్లెలు గురించి ఆలోచించే బాధ్యత ఒక్కరి కూడా లేదు అని రామరాజు క్లాస్ పీకుతాడు.. అమూల్య జీవితం ఎటువంటి సమస్యల్లో పడకూడదని నేను మీ అమ్మ ఒక నిర్ణయం తీసుకున్నామని అంటాడు. అమూల్యకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాము.. మాట వినగానే అందరూ షాక్ అవుతారు.. అమూల్య చదువుకుంటుంది ఇప్పట్లో పెళ్లి వద్దు అని ఎంత చెప్పినా సరే ఎవరు వినకుండా పెళ్లి చేయాలని అనుకుంటారు.. రామరాజు నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రేమ వేదవతి దగ్గరికి వెళ్లి ఎంతగా మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా ఆమె సీరియస్ అవుతూ వస్తుంది.. అమూల్యకు ఇప్పుడే పెళ్లి వద్దు అత్త చదువుకొనివు అని అంటుంది.. మా కూతురికి ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలియదా నువ్వు చెప్పాలా అని వేదవతి సీరియస్ అవుతుంది.. లేచిపోయి పెళ్లి చేసుకున్నావు నా కూతురు కూడా అలాగే పెళ్లి చేసుకోవాలా అని అనగానే ప్రేమ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ బయటికి వెళ్లిపోతుంది. నర్మదా వచ్చి వేదవతి తో మాట్లాడుతుంది. లేచిపోయింది అని నువ్వు అంటున్నావు అంతకన్నా ముందు నువ్వు బయటికి వచ్చావు అది ఆలోచించ అత్తయ్య అని అంటుంది..

Advertisement

వాళ్ళ అన్నయ్య తప్పు చేయట్లేదు అని ప్రేమ నమ్ముతుంది. దానిలోంచి మనం బయటకు తీసుకురావాలి అసలు ఎవరిది తప్పు అన్నది ప్రేమకు తెలిసేలా చేయాలి అప్పుడే ప్రేమ ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకుంటుంది అని నర్మదా అంటుంది. అయితే ప్రేమ దగ్గరికి వచ్చిన నర్మదా నువ్వు ఏమీ బాధపడకు ప్రేమ అసలు నిజాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాము అని నర్మదా అంటుంది.. ఇక ఈ విషయం గురించి ఎలా తెలుసుకోవాలి అని నర్మదా ప్రయత్నం చేయాలని అనుకుంటుంది..

శ్రీవల్లి ఒక రోజు వాళ్లతో మాట్లాడుతుంది కదా మరి కచ్చితంగా శ్రీవల్లికి ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది అని అనుకుంటుంది నర్మదా.. శ్రీవల్లి దగ్గరికి వెళ్లి అక్క నువ్వు పాదరసం కన్నా బుర్రన్నదానివి. నాకు ఒక సలహా కావాలి నీ కన్నా ఎవరు గొప్పవాళ్లు కాదు. కృష్ణుడు చేతిలో శ్రీ చక్రం లాగా ఉన్నావు. చిన్న చిన్న సమస్యలు తీర్చడానికి నువ్వే మేధావి అని శ్రీవల్లిని తెగ పొగిడేస్తుంది. ఏంటి ఏమన్నావ్ నన్ను ఇంతగా పొగేస్తున్నావ్ నీకేం కావాలి చెల్లాయి అని శ్రీవల్లి అడుగుతుంది.. నా ఫ్రెండు వల్ల మరదలు ఒక అబ్బాయిని ప్రేమించింది. వాడు మాత్రం ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది కాబట్టి బోలెడు డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నాడు.. అమ్మాయి మాత్రం వాడినే చేసుకుంటాను అని ఏడుస్తుంది..

Advertisement

అయితే ముందు ఎవరు ప్రేమించారో తెలుసుకుంటే వాళ్ళ పని అయిపోతుంది కదా అని నర్మదా శ్రీవల్లిని అడుగుతుంది.. అయితే అబ్బాయిలు ఏ విషయాన్ని బయట పెట్టరు.. ఇలాంటి అబద్ధం ఆ అమ్మాయి చేతే మనం నిజం చెప్పించాలి అని శ్రీవల్లి అంటుంది. ఆ అమ్మాయి దారిలోనే వెళ్లి పెళ్లి చేస్తాము అని అసలు నిజం చెప్తే గడగడా బయటికి కక్కేస్తుంది అని శ్రీవల్లి అద్భుతమైన సలహా ఇస్తుంది.. ఆ మాట వినగానే నర్మదా అమూల్య దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని ఎలాగైనా కనుక్కోవాలని అనుకుంటుంది.. ఒంటరిగా కూర్చుని ఉన్న అమ్ములు దగ్గరికి నర్మదా వెళ్తుంది.. అమూల్య ఏంటి డల్లుగా ఒంటరిగా కూర్చుని ఉన్నావు అని నర్మదా అడుగుతుంది..

ఇంట్లో జరుగుతున్న గొడవలు కి నేనే కదా వదినా కారణం అని అమూల్య అంటుంది.. అయితే నువ్వు మీ అమ్మానాన్న మాట వినకుండా శత్రువుల బిడ్డని ప్రేమించావు అని వాళ్ళు బాధపడుతున్నారు అంతే తప్ప నువ్వు ప్రేమించావని కాదు అని నర్మదా అంటుంది.. అయితే నేనేమీ ప్రేమించలేదు వదినా విశ్వమే ముందు ప్రేమించాడు నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడి మరి వేధించాడు. గిఫ్ట్లు తీసుకొచ్చి ఇచ్చాడు.. మన రెండు కుటుంబాలు కలవడానికి మనం పెళ్లి చేసుకుందామని అన్నాడు.. దాంతోనే నేను అతన్ని ప్రేమించాల్సి వచ్చింది అని అమూల్య అంటుంది.

Also Read :అవనిపై పగబట్టిన ఏకలింగం.. పల్లవి మాస్టర్ ప్లాన్.. కన్నీళ్లు పెట్టుకున్న అవని..

సరేగాని మరీ నువ్వెందుకు అందరి ముందర నేనే ప్రేమించాను అని చెప్పావు అని నర్మదా అడుగుతుంది.. ఏం భయపడకుండా నాకు చెప్పు నాకు అమూల్య నేను చూసుకుంటాను అని నర్మదా అంటుంది.. విశ్వక్ అలా చెప్పమని అన్నాడు వదిన అందుకే చెప్పాను అని అమూల్య అంటుంది. ఏంటి విశ్వ అలా చెప్పమని చెప్పాడా ఎందుకు అని నర్మదా అమూల్య నోటి నుంచే అసలు నిజాన్ని బయటకు చెప్పిస్తుంది.. అమూల్య చెప్పింది విని ప్రేమ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది.. శ్రీవల్లి భాగ్యంకి ఫోన్ చేసి నన్ను ఒకసారి పొగడవే అని అంటుంది. అసలు నిజం తెలుసుకున్న భాగ్యం ఒసేయ్ కోడిపుర దాన నువ్వే మొత్తం నిజం చెప్పేసావే అని అంటుంది. అది తెలుసుకున్న శ్రీవల్లి షాక్ అయిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×