E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు ప్రేమ దూరం.. రామరాజు మాటతో ప్రేమ కన్నీళ్లు.. నిజం చెప్పేసిన వేదవతి..

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు ప్రేమ దూరం.. రామరాజు మాటతో ప్రేమ కన్నీళ్లు.. నిజం చెప్పేసిన వేదవతి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 27th : నిన్నటి ఎపిసోడ్ లో.. విశ్వం అమూల్య ను చూసి సాగర్ ధీరజ్ ఇద్దరు కూడా కొట్టడానికి వస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన చందు నాకు ఈ విషయం రెండు రోజుల క్రితమే తెలిసింది రా అని అంటాడు.. రెండు రోజుల క్రితమే తెలిస్తే నువ్వెందుకు చెప్పలేదు రా అప్పుడే వాడిని మేము చంపేసేవాళ్లం కదా అని ధీరజ్ అంటారు.. ఈ విషయాన్ని నాన్న దగ్గరికి వెళ్లి తేల్చుకుందాం అని చందు అంటాడు. తన కూతురు చేసిన పనికి బాధపడుతూ వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అమాయకపు తల్లి అని నన్ను అందరికీ చెప్పినట్లే అమాయకురాలని చేసేసావు వారిని నువ్వెలా ప్రేమించావే అని బాధపడుతుంది. ఇక రామరాజు కూడా వాడిని ప్రేమించే ముందు ఈ తండ్రి నీకు గుర్తుకు రాలేదా అని ఎమోషనల్ అవుతాడు. ఎవరైనా పిల్లల్ని మంచిగా పెంచాలని అనుకుంటారు నేను మీకు ఏం తక్కువ చేసాను నన్ను ఎందుకు ఇలా రోడ్డుమీదకి లాగుతున్నారు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు రామరాజు..

కన్నీళ్లు పెట్టుకోవాల్సింది నువ్వు కాదు నాన్న అమూల్యని ట్రాప్ చేసి అమాయకురాలని తన బుట్టలో వేసుకున్న వాణ్ని బ్రతకనివ్వకూడదు అని ధీరజ్, సాగర్ లు ఇద్దరు విశ్వంను కొట్టడానికి వెళ్తారు. విశ్వం ని బయటకు తీసుకొని వస్తారు.. కానీ ప్రేమని కొడుతుంటే అడ్డుపడుతుంది.. అసలు తప్పు చేసింది మా అన్నయ్య కాదు అని అంటుంది. మొత్తానికి అమూల్య విశ్వంలో ప్రేమతో రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవే జరుగుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇది ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. సేన రామరాజు ని అంతగా బాధించేలా మాట్లాడడంతో ఇంట్లోని వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. భద్రా, విశ్వం తమ ప్లాన్ వర్కౌట్ అయిందని చాలా సంతోషంగా ఉంటారు.. ఆ రామరాజు మొదటిసారి తలదించుకున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది అని భద్ర అంటుంది. ఇంకొన్ని రోజులు పోతే ప్రేమ కూడా మన దగ్గరికి వచ్చేస్తుంది అని విశ్వం అంటాడు.. అమూల్యతో పెళ్లయితే ఆ రామరాజు కచ్చితంగా చచ్చిపోతాడు అని వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు.. ఇక నర్మద దగ్గరికి వెళ్లిన ప్రేమ తనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే నర్మద మాత్రం మాట్లాడదు. గుడిలో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ నర్మదా నాతో మాట్లాడ్డానికి నువ్వెవరు నీకు చెప్పడానికి నేనెవరు అని అంటుంది.. ఆ మాట వినగానే ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది అని శ్రీవల్లి డాన్స్ వేస్తూ ఉంటుంది.

ఆ తర్వాత రామరాజు కుటుంబం సేన వాళ్ళు అన్న మాటల్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు.. అందరూ అక్కడ ఉండగా ప్రేమ అక్కడికి వస్తుంది.. వాళ్ళందరిని చూసిన ప్రేమ తనతో మాట్లాడరని అనుకుంటుంది. అయితే ముందుగా చందు దగ్గరికి వెళ్ళిన ప్రేమ పెద్ద బావ గారు అని మాట్లాడుతుంది.. చాలమ్మా అమ్మ నువ్వు అక్కడ మాట్లాడిన మాటలు నాకు బాగా గుర్తొస్తున్నాయి.. నువ్వు ఇలా అంటావ్ అని అసలు ఊహించలేదు అని చందు అంటాడు. ఆ తర్వాత సాగర్ బావా అని తన దగ్గరికి వెళ్తుంది ప్రేమ. తను కూడా నువ్వు ఇంకేం మాట్లాడడానికి ఉంది ప్రేమ అని అంటాడు. ఇంకా నువ్వు మాట్లాడడానికి ఏమీ లేదు నువ్వు బాగా మారిపోయావు అని సాగర్ అంటాడు.

Advertisement

ఆ తర్వాత రామరాజు దగ్గరికి ప్రేమ వెళుతుంది.. అన్నయ్య నీ సపోర్ట్ చేస్తూ నేను అలా మాట్లాడటం తప్పే మావయ్య.. కానీ అక్కడ జరిగింది ఏంటి అన్నది మీకు తెలియదు అని ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను చెప్పేది మీరు ఒకసారి వినండి నా తప్పే నన్ను క్షమించండి అని ప్రేమ రామరాజు ను అడుగుతుంది.. ఇందులో నీ తప్పేమీ లేదమ్మా అంత నా తప్పే నాకు కూతుర్లని ఎలా పెంచాలో తెలియదు.. పిల్లల్ని పెంచడం నాకు చేతకాదు మీ వాళ్ళు నన్ను ఎన్ని మాటలు అన్నారో చూసావు కదా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు రామరాజు.

ఇక ప్రేమ వేదవతి దగ్గరికి వెళుతుంది.. వేదవతి నువ్వు నన్ను అత్తా అని పిలవద్దు అని అంటుంది.. మీ అన్నయ్య చేసింది బాగానే ఉంది కదా.. మీ అన్నయ్యని సపోర్ట్ చేస్తూ మా పెంపకం ని తప్పు పట్టేలా చేస్తావా. .? నువ్వు కొంచెం కూడా ఈ కుటుంబం గురించి ఆలోచించవా నువ్వేంటో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నాకు పిల్లల్ని పెంచడం చేతకాదా మీ నాన్న ఏమన్నాడు అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటూ కోడల్ని కడిగి పడేస్తుంది.. ప్రేమ వేదవతి మాటలు విని బాధపడుతుంది. కూతుర్ని ఉసిగొల్పి మేము ఏదో చేయాలని అనుకున్నామని మీ నాన్న ఎన్ని మాటలు అన్నాడు నువ్వు మీ నాన్నకు సపోర్ట్ చేస్తావా అని వేదవతి ప్రేమను దారుణంగా తిట్టేస్తుంది. ఆ తర్వాత మాకు పెంపకం గురించి చెప్తున్నాడా మీ నాన్న నువ్వు నువ్వు చేసింది తప్పు కదా..

Also Read : ఏకలింగం నాటకానికి బ్రేక్.. చెంపపగలగొట్టిన అవని.. ఒక్కటైన అన్నదమ్ములు..

పెళ్లి చేసుకోబోతూ లేచిపోయావు అని అనగానే నర్మదా అత్తయ్య అని అంటుంది. వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రేమ తన అత్త మాట విని బాధపడుతూ ఉంటుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ప్రేమ శాశ్వతంగా తన అత్తింటికి దూరం అవుతుందా? విశ్వం లవ్ ట్రాక్ గురించి నిజాలు తెలుసుకుంటుందా? ఏం జరుగుతుందో సోమవారం ఎపిసోడ్లో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×