E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: దారుణంగా మోసపోయిన సాగర్.. నిజం తెలుసుకున్న నర్మద..శ్రీవల్లికి టెన్షన్..

Illu Illalu Pillalu Today Episode: దారుణంగా మోసపోయిన సాగర్.. నిజం తెలుసుకున్న నర్మద..శ్రీవల్లికి టెన్షన్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ వెళ్లి ఇంటికి తీసుకుని తిరిగి వస్తుంది. శ్రీవల్లి అది చూసి ధీరజ్ కి చెప్తుంది. చూసావా ఇది మళ్ళీ మావయ్య గారికి మీదికి ఏ గొడవను తీసుకొని వస్తుందో తెలియట్లేదు అని కాపురంలో చిచ్చు పెడుతుంది.. ఇక తర్వాత ప్రేమ వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ వెళ్తుంది. అయితే వాళ్ళ నాన్న ఎక్కడో పడిపోయి ఉండడం చూసి జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వస్తుంది. అది చూసిన శ్రీవల్లి అయ్య బాబోయ్ ప్రేమ వల్ల ఆనంద్ తీసుకుని వచ్చిందా ఇది మనకు వాడుకోవాలి. నా మీదే సీమటపాక ఎగిరెగిరి పడుతుందా దీనికి కచ్చితంగా నేను బుద్ధి చెప్పాల్సిందే అని అనుకుంటుంది. ధీరజ్ ని వెతుక్కుంటూ వెళ్లి ధీరజ్ ఒకసారి ఇలా రా అని తీసుకొని వెళ్తుంది.

ఏంటి వదిన ఏమైందని అడుగుతాడు కానీ ప్రేమ వాళ్ళ నాన్నని తీసుకురావడం చూసినా శ్రీవల్లి ఆ విషయాన్ని ధీరజ్ చూడాలని అనుకుంటుంది. వాళ్ళ నాన్నని ఎంత జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వచ్చిందో ఇది కనుక మావయ్య గారు చూస్తే ఎన్ని గొడవలు జరుగుతాయో అని కావాలనే చిచ్చు పెడుతుంది. మొత్తానికి అటు నర్మదా, ఇటు ప్రేమ కాపురంలో చిచ్చు పెట్టాలని శ్రీవల్లి గట్టిగా నిర్ణయించుకుంటుంది. వాళ్ళిద్దరి భర్తలకు భార్యలపై లేనిపోనివి చెప్పి రెచ్చగొడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. తను గవర్నమెంట్ జాబ్ చేసి అందరిలో గౌరవంగా ఉండాలని సాగర్ అనుకుంటాడు. అయితే ఎగ్జామ్ రాసిన పాస్ అవ్వకపోవడంతో మరోసారి రాసిన పాస్ అవ్వను అని ఫిక్స్ అయిపోతాడు.. ఎలాగైన సరే డబ్బులు సంపాదించి ఆ జాబ్ ను సొంతం చేసుకోవాలని అనుకుంటాడు.. తన ఫ్రెండ్ మాట విని షేర్స్ లో పెట్టడానికి డబ్బులు ఇస్తాడు.. కానీ ఫ్రెండ్ అని నమ్మినందుకు మోసపోయినట్లు తెలుసుకుంటాడు సాగర్.. వీడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయట్లేదు వీళ్లు నన్ను మోసం చేశాడా డబ్బులు కోసం ఆశపడి నేను మోసపోయానా అని ఆలోచిస్తూ ఉంటాడు సాగర్.. లక్ష రూపాయలు నాన్నకి ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు..

అప్పుడే అక్కడికి వచ్చి నన్ను నర్మదా సాగర్ ఏమైంది చెప్పు అని అడుగుతుంది. కానీ సాగర్ మాత్రం చెప్పాలని అనుకోడు.. నర్మదా గట్టిగా అరుస్తుంది. ఎందుకు నువ్వు నాకు చెప్పాలనుకోవట్లేదు అని అంటుంది. ఏమైంది అసలు నువ్వు ఎందుకు ఇంతగా టెన్షన్ పడుతున్నావు అని నర్మదా అడుగుతుంది. నా సంగతి పక్కన పెట్టు నువ్వు నేను మూటలు మోస్తున్నానని ఫీల్ అయిపోతున్నావా అని అడుగుతాడు. ఇంతకీ నీకు ఆ మాట చెప్పింది ఎవరు అని నర్మదా అంటుంది. నువ్వు చెప్పు నువ్వు నిజంగానే నేను రైస్ మిల్లులో మూటలు మోస్తున్నానని ఫీల్ అయిపోతున్నావా? అని అడుగుతాడు. నీకు ఎవరు చెప్పారు అది చెప్పు అని నర్మదా అంటుంది ఎవరో కాదు ఇంట్లోని వాళ్లే చెప్పారు అని సాగర్ అంటాడు.

Advertisement

నువ్వు మూటలు మోస్తున్నావు అని నాకెందుకు అనిపిస్తుంది అలాంటి దాన్ని నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాను నువ్వు ఏ జాబు చేయకపోయినా పర్వాలేదు నాతో ప్రేమగా ఉంటే చాలు అని నేను అనుకుంటున్నాను అని నర్మదా కన్నీళ్లు పెట్టుకుంటుంది. సాగరు ఇంట్లోని వాళ్లే చెప్పారు అని అంటున్నాడు కదా ఖచ్చితంగా ఆ కంచు కనకమహాలక్ష్మి ఈ పని చేసి ఉంటుంది అని శ్రీవల్లి పై నర్మదకు అనుమానం వస్తుంది.. కచ్చితంగా ఆ శ్రీవల్లి సంగతి రేపు చెప్తాను అని నర్మదా అనుకుంటుంది.

ఉదయం లేవగానే నర్మదా ప్రేమ ఇద్దరు వంటగదిలో పాయసం చేసేందుకు అన్ని సిద్ధం చేసుకుంటారు. పాయసం స్మెల్ అదిరిపోయింది అక్క వాసనకి నోరు ఊరి పోతుంది అని ప్రేమ అంటుంది. ఆ రోజు సాగర్ విఆర్వో ఎక్సామ్ రాసినట్లు ఇలాగే శ్రీవల్లి పాయసం చేసే అందరికీ తెలిసిన చేసింది కదా మనం కూడా ఆ శ్రీవల్లి ని ఇరికించేందుకు పాయసం చేసి అందరికీ చెబుదాం అని అంటుంది నర్మదా.. ప్రేమ నర్మద ఇద్దరూ కూడా వంటగదిలో మాట్లాడుకోవడం విన్న శ్రీవల్లి గదిలోకి వెళ్లి తలపేసుకొని కంగారు పడుతూ ఉంటుంది.. ఓయమ్మో, ఓరి నాయనో వీళ్లు మంచితనానికి మారుపేరు అనుకున్న కానీ నా మీద ఇలాంటి రివేంజ్ ప్లాన్ చేస్తారని అస్సలు అనుకోలేదు. నన్ను ఇరికించేందుకు ప్లాన్ చేశారు అని భయపడుతుంది. అప్పుడే నర్మదా ప్రేమ ఇద్దరు కూడా పాయసం తీసుకుని వచ్చి మావయ్య గారు అత్తయ్య గారు రండి అని అందరిని పిలుస్తారు.

Also Read : హీరో శివకార్తికేయన కారుకు ప్రమాదం..అసలేం జరిగిందంటే..?

శ్రీవల్లి తలుపు తెరుచుకొని గుంట నక్కలాగా తొంగి చూస్తూ ఉంటుంది.. ఏమైందమ్మా ఎందుకు ఇప్పుడు ఈ పాయసం చేశారు అని రామారావు అడుగుతాడు. ఏం లేదు మామయ్య మీకు ఒక తీపి కబురు చెప్పాలని పాయసం చేసానని నర్మదా అంటుంది. శ్రీవల్లి అక్క ఈరోజు ఇంటర్వ్యూ కి వెళ్తుంది కదా తను సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అందరి నోరు తీపి చేయాలని అనుకుంటున్నాను అని నర్మదా అంటుంది. అవునమ్మా నువ్వు చెప్పింది కూడా నిజమే అని రామరాజు అంటాడు అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×