E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ, ధీరజ్ మధ్య మళ్ళీ గొడవ.. తల మీద గుడ్డవేసుకున్న శ్రీవల్లి.. గెలిచిన వేదవతి..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ, ధీరజ్ మధ్య మళ్ళీ గొడవ.. తల మీద గుడ్డవేసుకున్న శ్రీవల్లి.. గెలిచిన వేదవతి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. తిరుపతి నా సౌందర్యలహరి ఎక్కడ ఎక్కడ అంటూ పార్కులో తెగ హడావిడి చేస్తాడు.. విశ్వం ఇలా నువ్వు కట్టుకొని ఉంటే నాకు ఎలా మాట్లాడాలి అనిపిస్తుంది నీతో మాట్లాడకుండా చూడకుండా ఉండలేకపోతున్నానని అంటాడు.. ముఖానికి ఉన్న చున్నీని అమూల్య తీసేస్తుంది.. ఈ మూడు జంటలు ఇలా పార్కు రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ అనుకుంటూనే మాట్లాడుకుంటూ ఉంటారు.. ప్రేమ ధీరజ్ మాత్రం పోట్లాడుకుంటారు. తిరుపతి నా సౌందర్య లహరి ఎక్కడ ఎక్కడ అంటూ వెతుక్కుంటూ శ్రీవల్లి చందూ దగ్గరికి వస్తాడు.

మీకు ఇంట్లో రొమాన్స్ చేయడానికి సరిపోట్లేదా ఇలా పార్క్ కూడా వచ్చారు అని అడుగుతాడు. మాకంటే పెళ్లయింది వచ్చాము మరి నీకు పెళ్లి కాలేదు కదా బాబాయ్ నువ్వు ఎందుకు వచ్చావు అని శ్రీవల్లి అడుగుతుంది. నేను వేరే పర్సనల్ పని మీద వచ్చాను అని తిరుపతి అంటాడు. అలా మూడు జంటల దగ్గరికి వెళ్లిన తిరుపతి షాక్ అవుతాడు. నా సౌందర్యలహరి ఎక్కడుందో వెతుక్కోవాలి వీళ్ళతో నాకేంటి పని అని అనుకుంటాడు.. విశ్వం, అమూల్యను చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. వాళ్లను కవర్ చెయ్యడానికి చాలా తంటాలు పడుతుంది. చందు చూసేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఈ ముగ్గురు జంటలుగా వచ్చిన పార్కులో అమూల్య విశ్వం కనిపించడం చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. మనం ఇక్కడ ఉంటే మావయ్య అత్తయ్య గారికి డౌట్ వస్తుంది తిడతారు మనం వెళ్ళిపోదాం పదండి అని అంటుంది. కానీ వాళ్ళు పార్క్ వచ్చింది కాసేపు సరదాగా ఉండడానికే కదా మరి హడావిడిగా వెళ్లిపోవడం ఎందుకు అని అంటారు. ఓరి నాయనో వీళ్ళిద్దరూ వీళ్ళ కంటపడితే ఇక సంగతి అంతే అని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. చందు మాత్రం అమూల్య విశ్వంను చూస్తాడు. ఈయన చూసేసారు ఏం అడుగుతాడు ఏం చెప్పాలి అని శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత ప్రేమ ధీరజ్లు ఇంటికి వెళ్లి కూడా మళ్ళీ గొడవపడతారు..

నేను నీకు ఇచ్చిన పువ్వు ఎక్కడ పెట్టావ్ అని ధీరజ్ అడుగుతాడు.. నువ్వేమన్నా గోల్డ్ ఫ్లవర్ ఏమైనా ఇచ్చావా ఏంటి ? దాచి పెట్టుకోవడానికి అక్కడే పడేసాను వెళ్లి వెతుక్కోపో అని ప్రేమ అంటుంది. ఆ పువ్వు ని పడేసావా? నువ్వు ఇచ్చిన పువ్వు ని ఇంత భద్రంగా దాచిపెట్టుకున్నాను చూసావా అని ధీరజ్ అంటాడు.. అయితే ధీరజ్ ఒకవైపు మాట్లాడుతుంటే.. ఏమో మాత్రం ఏమో రాసుకుంటూ కనిపిస్తుంది.. వాటిని చూసినా ధీరజ్ ఏంటిది నువ్వు నేను ఇలా అని అనుకుంటాడు.. మన రెండు కుటుంబాలు ఎప్పటికైనా కలుస్తాయి మనం చాలా సంతోషంగా ఉంటాము అని ప్రేమ ఉంటుంది. ఏమైనా పిచ్చి పట్టిందా మన రెండు కుటుంబాలు ఈ జన్మలో కలవు అలాంటి ఆశలు ఏమీ పెట్టుకోవద్దు అని ధీరజ్ అంటాడు. వీళ్ళిద్దరూ మా కుటుంబాల కోసం గొడవపడతారు.

Advertisement

శ్రీవల్లి చందు కి విషయం తెలిసిపోయిందని టెన్షన్ పడుతూ ఉంటుంది.. భాగ్యం ఆనందరావు బజ్జీలు వేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, డాన్స్ లు వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.. టైం లో శ్రీవల్లి ఫోన్ చేయడం చూసి ఆనంద్ రావు టెన్షన్ పడతాడు.. భాగ్యం ఇదొకటి ఇది ఎంజాయ్ చెయ్యదు.. మనల్ని చేసుకోనివ్వదు. ఏంటి అమ్మడు ఏంటి ఇలా ఈ టైంలో ఫోన్ చేశావు అని భాగ్యం అడుగుతుంది.. విశ్వం అమూల్య గురించి ఆయనకి తెలిసిపోయింది ఇంకా ఇంటికి రాలేదు అని అంటుంది.. ఏం జరుగుతుందో ఎలాంటి గొడవలు మొదలవుతాయో అని భయంగా ఉంది అమ్మ అని శ్రీవల్లి అంటుంది.. కానీ భాగ్యం మాత్రం నువ్వేమీ భయపడకు ఇలా చేయని ఒక ప్లాన్ చెబుతుంది..

పక్కనే అమూల్య ఉండడం చూసిన శ్రీవల్లి, ఎదురుగా విశ్వం ని చూసి వీరిద్దరి రొమాన్స్ ని చూడలేక చచ్చిపోతున్నాను.. వీళ్లు లవింగ్ చేసుకుంటున్నారు.. కానీ మా కాపురం కూలిపోయేలా ఉంది అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. తల మీద గుడ్డు వేసుకొని, మా ఆయన ఎలా వస్తాడో తెలియట్లేదు అని టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటుంది. వేదవతి మౌనంగా ఉండడం చూసిన ప్రేమ నర్మదా ఆమె దగ్గరికి వెళ్తారు.. ఏంటి అత్తయ్య గారు ఇంత కోపంగా ఉన్నారు ఏమైందో అని అడుగుతారు.. కానీ వేదవతి మాత్రం నా దగ్గరికి ఎందుకు వచ్చారు అమ్మ నేను మీకు ఏమవుతానని నాతో అసలు మాట్లాడకండి అని అంటుంది..

ఆ మాట వినగానే నర్మదా ప్రేమలో ఏమైందత్త గారు ఎందుకలా కస్సుబుస్సు లాడుతున్నారు అని అడుగుతారు.. ఏమీ లేదమ్మా నాకు చెప్పకుండా పార్కులకి షికారులకి వెళ్తారు. ఒక్క మాటైనా పార్కుకి వెళ్దామా అని అడిగారా అని వేదవతి సీరియస్ అవుతుంది.. మేము మా మొగుళ్ళతో సరదాగా గడపడానికి వెళ్ళాము. ఏదో మొగుళ్ళతో రొమాన్స్ చేసుకుందామని వెళ్తే మీరేంటి ఇలా అంటున్నారు. యంగ్ కపుల్స్ మధ్యలో ముసలాలను తీసుకెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి అని నర్మదా అంటుంది.. ఏంటే ఏం మాట్లాడుతున్నావ్ ముసలాల్ల ఎవరే అని వేదవతి సీరియస్ అవుతుంది.. ముసలోళ్ళు ఏం మాట్లాడుతున్నావ్ తెలుసా.. ఏమైనా బుద్ధి ఉందా నీకు అని వేదవతి సీరియస్ అవుతుంది.

Also Read :తలైవా బర్త్ డే స్పెషల్.. రజనీకాంత్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు…!

మేము మా మొగుళ్ళతో రొమాన్స్ చేయడానికి వెళ్తాం మీరు మీ ఆయన తీసుకొని బయటికి వెళ్ళండి కావాలంటే అని కావాలని నర్మదా రెచ్చగొడుతుంది. వేదవతి మా ఆయన తీసుకుని ఇప్పుడే బయటికి వెళ్తాను..? ఈ టైంలో పార్కులు ఉండవేమో? సెకండ్ షో సినిమాకి వెళ్తాను అని వేదవతి వెళ్లి రామరాజు దగ్గరికి వెళ్తారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఏ రోజైనా భార్యని బయటికి తీసుకెళదామని మీకు ఉందా..? ఎంతసేపు రైస్ మిల్లు పిల్లలు అనే తప్ప ఏ రోజైన భార్యను పట్టించుకున్నారా సరదాగా ఉన్నారా అని వేదవతి అడుగుతుంది..

నన్ను ఇప్పుడు సినిమాకు తీసుకుని వెళ్తారా లేదా అని వేదవతి అడుగుతుంది.. ఇప్పుడు వద్దు మన వయసు ఏంటి మనం చేసే పనులేంటి రేపు వెళ్దాంలే అని రామ రాజు అంటాడు. మీరు నన్ను బయటికి తీసుకెళ్ళి పోతే నేను అలిగిపోతాను.. నన్ను ఇప్పుడు తీసుకెళ్తారా లేదా అని వేదవతి పట్టుబట్టి మరి రామరాజు ని ఒప్పిస్తుంది.. వేదవతి మా ఆయన నన్ను బయటికి తీసుకుని వెళుతున్నాడు అని సంతోషంగా చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×