E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ కోసం కన్నీళ్లు పెట్టుకున్న ధీరజ్.. నిజం చెప్పిన చందు..కుప్పకూలిపోయిన సేనా..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ కోసం కన్నీళ్లు పెట్టుకున్న ధీరజ్.. నిజం చెప్పిన చందు..కుప్పకూలిపోయిన సేనా..
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 9th: ప్రేమకు ఏమన్నా అవుతుందేమో అమ్మ అని శ్రీవల్లి కంగారు పడుతుంటే ఆ లారీ డ్రైవర్ కి ఫోన్ చేసిన అతను లిఫ్ట్ చేయకపోవడంతో అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక తర్వాత లారీ డ్రైవర్ చాలా స్పీడ్ గా రావడంతో వాళ్లు కంగారు పడతారు.. ఎంతసేపని ఇక్కడ ఉంటావు నువ్వు అక్కడికి వెళ్లి కూర్చో ప్రేమ అని అనగానే ప్రేమ వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికి షాప్ కి వెళ్తుంది. లారీ వస్తుండటం గమనించిన ప్రేమ చందు ని కాపాడటానికి వస్తుంది.. అయితే లారీ ఒక్కసారిగా స్పీడ్ గా రావడంతో ప్రేమ చందు ని పక్కకు లాగేసి ఆ లారీ కింద పడిపోతుంది. అందరూ ఒక్కసారిగా ప్రేమ అని అరుస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్ ప్రేమ ఆక్సిడెంట్ అయిందని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతాడు..

కన్నీళ్లు పెట్టుకున్న ధీరజ్..

ప్రేమ కోసం ధీరజు హాస్పిటల్ లో కన్నీళ్లు పెట్టుకుంటాడు.. ఏంట్రా చిన్నోడా బాధపడుతున్నావు ఏం కాదులేరా అని చందు కూడా బాధపడుతూ ఉంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన రామరాజు అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా ధీరజ్ ను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. అసలు ఏమైందిరా చిన్నోడా ఎందుకు ఆక్సిడెంట్ అయింది అని రామరాజు వచ్చి అడుగుతాడు. ప్రేమ పరిస్థితి ఇలా అవ్వడానికి కారణం నేనే అని ధీరజ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.. ఏంట్రా చిన్నోడా చిన్నపిల్లల్లాగా ప్రేమకి ఏమి కాదులేరా అని రామరాజు ఎంతగా ఓదారుస్తున్నా సరే ధీరజ్ మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటాడు.. వీడు చిన్నపిల్లలాగా ఏడుస్తున్నాడు ఏం కాదులేరా అని అందరూ ఓదారుస్తూ ఉంటారు. అమూల్య కూడా వదినకు ఏం కాదన్నయ్య నువ్వేం బాధపడకు అని అంటుంది..

తండ్రికి నిజం చెప్పిన చందు..

Advertisement

ప్రేమకిలో అవ్వడానికి కారణం నేనే నాన్న అని చందు అంటాడు. ఏంట్రా ఇదంతా ఏం జరిగింది రా అని రామరాజు అడుగుతాడు.. ఏంటి నువ్వు కారణమేంట్రా అని రామరాజు షాక్ అవుతాడు.. ప్రేమని నేను కాలేజ్ దగ్గర వదిలిపెట్టడానికి తీసుకొని వెళ్ళాను. మధ్యలో బండికి పంచరవడంతో ధీరజ్ని రమ్మని ఫోన్ చేసి చందు పిలిచాను. అయితే ఫోన్ మాట్లాడుకుంటూ నేను పక్కనే ఉండడంతో వెనకలు వచ్చే లారీని చూసుకోలేదు. నన్ను కాపాడడానికి వచ్చిన ప్రేమ ఆక్సిడెంట్ తనకు జరిగేలా చేస్తుంది.. ప్రేమ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు నేను ఉండాలి. కానీ ప్రేమ నన్ను కాపాడింది అని చందు నిజం చెప్తాడు.. ప్రేమకు ఏమన్నా అయితే నేను బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది అని చెందు బాధపడతాడు. నర్మదా ధీరజ్ నీ ఓదార్చడానికి ప్రయత్నించినా కూడా ధీరజ్ మాత్రం కంట్రోల్ చేసుకోలేక పోతాడు.

ప్రేమ కోసం కన్నీళ్లు పెట్టుకున్న శ్రీవల్లి..

శ్రీవల్లి ప్రేమకు ఏమైందో ఏంటో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. యాక్సిడెంట్ అవ్వడానికి కారణం నువ్వే.. నీ చెత్త ఐడియా వల్లే ప్రేమ పరిస్థితి ఇప్పుడు ఇలా ఉందో చూడండి కోపంతో ఊగిపోతుంది. అయితే చిన్న యాక్సిడెంట్ అని ఏదో చెప్పావు వాడు స్పీడ్ గా వచ్చినప్పుడే నాకు అర్థం అయిపోయింది. కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. మీ వల్లే ఇలా జరిగింది అని బాధ పడిపోతుంది. ప్రేమ నా సొంత చెల్లెలు లాంటిది అని నేను తనని ఎంత బాధ పెట్టిన సరే తను మాత్రం నన్ను ఎక్కడ బాధ పెట్టకుండా సొంత అక్క లాగా చూసుకుంది. ఏం చేసినా అలాంటి అమ్మాయికి ఇలా యాక్సిడెంట్ అవ్వడానికి కారణం నువ్వే అని భాగ్యంపై సీరియస్ అవుతుంది శ్రీవల్లి.. నాకు ఏమైనా అవ్వాలి నీ సంగతి తర్వాత చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

ప్రేమకు యాక్సిడెంట్ అవ్వడంతో సేన షాక్..

Advertisement

రేవతికి తిరుపతి ఫోన్ చేసి ప్రేమకు యాక్సిడెంట్ అయి నేను చెప్పగానే ఒక్కసారిగా రేవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ప్రేమకు యాక్సిడెంట్ అయిందంట అత్తయ్య అని అనగానే భద్ర ఏంటి రేవతి ఏం మాట్లాడుతున్నావు అని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. డ్రైవరు ఫోన్ చేయడంతో వస్తే నా అతనితో మాట్లాడి లోపలికి వస్తాడు.. అయితే సేన లోపలికి రాగానే ప్రేమకు యాక్సిడెంట్ అయింది అని అంటారు ఆ మాట వినగానే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు.. అంటే అడ్డు వచ్చింది ప్రేమ అని అనుకొని బాధపడిపోతూ ఉంటాడు.. వెంటనే హాస్పిటల్ కి వెళ్దాం పదండి అని అందరూ అనుకుంటారు..

ప్రేమ సేఫ్… కన్నీళ్లు పెట్టుకున్న సేనా…

డాక్టర్ బయటికి రాగానే మా కోడలు ప్రేమకు ఎలా ఉంది అండి అని రామరాజు తో పాటు అందరూ వరుసగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి అడుగుతారు.. మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు ఒకసారి అమ్మాయి ఎలా ఉందో మీరే చూద్దురు పదండి లోపలికి డాక్టర్ తీసుకొని వెళ్తుంది. అయితే ప్రేమను చూసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. తనకి ఇంత పెద్ద యాక్సిడెంట్ అయిన కూడా ఎటువంటి పెద్ద ప్రమాదం జరగలేదు. చిన్నక్క కాలు బెణికింది అని చెప్పగానే అమ్మయ్య అనుకుంటారు. ఇక మీరు ప్రేమని తీసుకొని వెళ్లొచ్చు అనగానే అందరూ కలిసి ప్రేమను ఇంటికి తీసుకొని వస్తారు.. ప్రేమని చూసిన సేన ఎమోషనల్ అయిపోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: భరత్ ను తిట్టిన రాజేశ్వరి.. పల్లవి, రాజేశ్వరికి భానుమతి వార్నింగ్..అవని ఇంట్లో రచ్చ చేసిన రాజేశ్వరి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×