E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ఇంట్లో పెద్ద రచ్చ చేసిన సాగర్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ.. చందును కిడ్నాప్ చేసేందుకు ప్లాన్..

Illu Illalu Pillalu Today Episode: ఇంట్లో పెద్ద రచ్చ చేసిన సాగర్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ.. చందును కిడ్నాప్ చేసేందుకు ప్లాన్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 7th: చందు ఇవాళ ఎలాగైనా సరే నాన్న తో మాట్లాడాలి అని అనుకుంటాడు.. నాన్న బయటికి రా బయటికి రా అని గట్టిగా కేకలు వేయడంతో రామరాజు ఏమైందని బయటికి వస్తాడు.. అయితే అక్కడ చందు తాగేసి ఉండడం చూసి రామరాజు షాక్ అవుతాడు. నువ్విలా తాగేసి రావడానికి కారణమేంటిరా..? ఇలా నువ్వు తాగేసి వచ్చావని తెలిస్తే నీ భార్య ఎంత బాధ పడిపోతుందో ఆలోచించవని రామరాజు అంటాడు. మీకు వల్లి గురించి ఓ నిజం చెప్పాలి నాన్న అని ఎంత చెప్తున్నా సరే నర్మదా ప్రేమలు మాత్రం చంద్రుని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చందు లోపలికి వెళ్తుంటే సాగరు నాన్నకి కొడుకులు మీద ఎంత ప్రేమ ఉందో చూసావా అని నర్మద తో చెప్తాడు..

సాగర్, ధీరజ్ మధ్య గొడవ.. 

ఈ పెద్ద మనిషికి నేనేం చేసినా కూడా అది తప్పే అవుతుంది కానీ ఆయన పెద్ద కొడుకు అంటే ఆయనకంత ఇష్టం కాబట్టి కొడుకు తాగొచ్చి ఇంత చేసినా కూడా ఇంట్లోకి తీసుకొని వెళ్తున్నాడు అదే నేను మంచినీళ్లు తాగుతున్న సరే పెద్ద రచ్చ చేస్తాడు ఎందుకంటే నేనంటే ఆయనకి ఇష్టం లేదు అని చెప్పేసి మాట్లాడడంతో ధీరజ్ఆయన గీయనా అని మాట్లాడుతున్నావ్ ఏంట్రా నాన్నను పట్టుకొని ఏం మాట్లాడుతున్నావ్ రా అన్నయ్య అనేసి అడుగుతాడు.. అన్నయ్య నీ ఒక్క మాట అన్నా సరే నేను అసలు ఊరుకోను అని ఎంతగా అంటున్న సరే మాత్రం నేనంటే ఆయనకి ఇష్టం లేదు అని అంటాడు.. అన్నదమ్ముల మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. అందరూ ఎంతగా ఆపడానికి ప్రయత్నించినా సరే సాగర్ ధీరజ్ గొడవపడడంతో తిరుపతి చంప పగలగొడతాడు రామరాజు..

నర్మద, సాగర్ ల మధ్య చిచ్చు.. 

Advertisement

సాగర్ ఆవేశంగా లోపలికి వెళ్లడంతో నర్మదకుడా తనతో పాటు వెళుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ సాగర్ కొంచమైనా నీకు బుద్ధుందా అని అడుగుతుంది.. నువ్వు డబ్బులు పెట్టి జాబ్ కొన్నావు కాబట్టి మావయ్య నిన్ను తిట్టాడు. అక్కడ నేను ఏం మాట్లాడాలి నువ్వు ఏమంటున్నావో అర్ధం కావడం లేదు. సాగర్ అని నర్మద ఎంత అంటున్న సరే సాగర్ మాత్రం నువ్వు చేసిన మీ మామయ్య చేసిన అది తప్పే కాదు. నేను చేసిందే నీకు తప్పు అమ్మ వచ్చిన తర్వాత ఇంట్లో ఉండనే ఉండను వెళ్ళిపోవాల్సిందే అని సాగర్ అంటాడు. ఆ మాట వినగానే నర్మదా షాక్ అయిపోతుంది.

చందుకు యాక్సిడెంట్ చేసేందుకు ప్లాన్..

భాగ్యం శ్రీవల్లి ఆనందరావు ముగ్గురు కలిసి హడావిడిగా ఎక్కడికో వెళ్తూ ఉంటారు.. ఒక వ్యక్తిని కలిసి చందు కి యాక్సిడెంట్ చేయమని చెప్తారు.. నా మొగుడికి ఆక్సిడెంట్ చేయమని చెప్తావా ఏం మనిషివే నువ్వు అని శ్రీవల్లి తిడుతుంది. భర్తకి ఏదైనా జరిగితే దగ్గరుండి సేవలు చేయాల్సింది భార్య మాత్రమే ఇది గుర్తుపెట్టుకోవే తింగరి మొహం అని శ్రీవల్లికి చెప్తుంది.. దెబ్బతో నువ్వు మళ్ళీ ఆ ఇంట్లో సెటిల్ అవ్వాల్సిందే అని భాగ్యం అనగానే శ్రీవల్లి కొంచెం మెల్లగా కొట్టమని చెప్పవే మా ఆయనకు ఏమైనా తట్టుకోలేను. అసలైన మా ఆయన అంటే నాకు ప్రాణం అని అంటుంది..

ప్రేమను పొగిడేసిన ధీరజ్.. 

Advertisement

ప్రేమ కాఫీ పెట్టి అందరికీ ఇవ్వాలని అనుకుంటుంది. అప్పుడే అమూల్య వచ్చి మీ ఇద్దరిలాగే వల్లి వదిన కూడా బాగుంటే బాగుండేది.. నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని అమూల్య అనగానే అప్పుడే రామరాజు వల్లి కాఫీ కావాలమ్మా అని అడుగుతాడు.. ఇక అమూల్య కాఫీతో చెప్పగానే అందరూ కూడా కాపీని మెచ్చుకుంటారు. కాఫీ మా అమ్మ లాగా చేయకపోయినా పర్వాలేదు కానీ అంత ఇంతో బాగానే మా అమ్మ లాగా చేసావు వదినా అని అంటాడు.. కానీ అమూల్య మాత్రం ఆ కాఫీ చేసింది. మీ వదిన కాదు మీ ఆవిడ. అ క్రెడిట్ మొత్తం మీ ఆవిడకి ఇవ్వాలి అని అమూల్య అనగానే ధీరజ్ మౌనంగా ఉండిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో చందు ని ఆక్సిడెంట్ చేసేందుకు భాగ్యం ప్లాన్ చేసి వర్కౌట్ అయ్యేలా చూస్తుంది. కానీ ప్రేమ చందు ని కాపాడి తాను ఆక్సిడెంట్ కి గురవుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : శ్రీకర్ కోసం శ్రీయ గొడవ..పల్లవికి అవని చెక్.. చక్రధర్ కు ఘోర అవమానం..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×