E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి కి వేదవతి గిఫ్ట్.. అమ్మా.. భాగ్యం ప్లానా ఇదంతా.. కామాక్షి హడావిడి..

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి కి వేదవతి గిఫ్ట్.. అమ్మా.. భాగ్యం ప్లానా ఇదంతా.. కామాక్షి హడావిడి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 27th: నర్మదా శ్రీవల్లి ప్రెగ్నెంట్ అని చెప్పడంతో అక్కడికి వెళ్లి తీసుకురావడానికి వెళ్తుంది.. అక్కడికి వెళ్లిన తర్వాత శ్రీవల్లి బాగోతం గురించి వేదవతి బయటపెట్టి భాగ్యంకి శ్రీవల్లికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఇంటికి తీసుకొని వస్తుంది. ఇన్ని రోజులు వేదవతి రాదు అని అనుకున్న ప్రేక్షకులు ఒక్కసారిగా సడన్ ఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాక్ అయిపోతారు.. వల్లి కడుపుతోందని తెలుసుకున్న రామరాజు చాలా సంతోషంగా ఉంటాడు. చందు నిజం చెప్పకపోతే వేదవతి ఆపుతుంది. ఈవారం హైలెట్ ఎపిసోడ్ అంటే వేదవతి ఎంట్రీనే.. ఇకముందు శ్రీవల్లి ఎలాంటి ప్లాన్ వేస్తుంది లేదంటే వేదవతి చెప్పినట్టు వింటుందా అన్నది సస్పెన్స్ గా మారింది..

వల్లికి వేదవతి గిఫ్ట్..

రామరాజు పెద్దకోడలు నెలతప్పింది అని రామరాజు చాలా సంతోషంగా ఫంక్షన్ చేయాలని అనుకుంటాడు. అయితే ఊర్లోని వాళ్ళందరినీ పిలిపించి తన కోడలికి ఆశీర్వాదం ఇప్పించాలని రామరాజు అనుకుంటాడు. ఇక శ్రీవల్లి సాయంత్రం చేసే ఫంక్షన్ కి తను ఎలా రెడీ అవ్వాలి అన్నది తెలుసుకోలేక కంగారు పడిపోతూ ఉంటుంది.. అయితే చీరల్ని అటు ఇటు పట్టుకొని ఏది కట్టుకోవాలి ఏది కట్టుకోవాలి అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఎదురుగా వేదవతి రావడంతో అత్తయ్య గారండీ ఫంక్షన్ కి ఏ చీర కట్టుకోమంటారు చెప్పండి అని అడుగుతుంది. ఆ చీర ఈ చీర కాదు నేను ఒక చీర తెచ్చాను అది ఇస్తాను అని వేదవతి తన కోడలికి చీర నగలను గిఫ్ట్ గా ఇస్తుంది.. అది చూసినా శ్రీవల్లి షాక్ అవుతుంది ఇవి గిల్టు నగలు కాదు కదా అని అనగానే వేదవతి సీరియస్ అవుతుంది.

భాగ్యం ప్లానే ఇదంతా..

Advertisement

తన కోడలు కడుపుతో ఉందని సంతోషంగా ఉన్న వేదవతిని చూసి భాగ్యం ఇదంతా నిజం కాదని తెలిస్తే ఏమైపోతుందో ఎంత రచ్చవుతుందో తెలియడం లేదు అని అనుకుంటుంది. జరిగిన విషయన్ని ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి గుర్తు చేసుకుంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్లిన భాగ్యం తన కూతురు కాపురాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీదే అని కాళ్ళ మీద పడుతుంది. నా కూతురు కాపురం ఇలా మారింది మీరు దయచేసి నిలబెట్టాలి ఒక చిన్న అబద్ధం చెప్పి నా కూతుర్ని కాపాడండి అని కాళ్లు పట్టుకుంటుంది. ఇక డాక్టరు ఒక ఆడపిల్ల జీవితం నిలబడుతుంది అని అబద్ధం చెప్తుంది. అంటే ఇప్పుడు వల్లి తల్లి కాలేదని తెలిసిపోయింది.

కొత్త ప్రేమ ఎంట్రీ..

ఇక అందరూ కూడా అన్ని సర్దుతూ ఉండగా ప్రేమ గట్టిగ కేకలు వేస్తూ బయటకు వస్తుంది. ఏమైందమ్మా ప్రేమా అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇక ప్రేమ చేసిన హడావిడి అంత ఇంత కాదు. పాత ప్రేమ ఈ ఎపిసోడ్ తో ఎగ్జిట్ అయిపోయి కొత్త ప్రేమ ఎంట్రీ ఇచ్చింది.. ప్రేమ కంగారు పడుతూ కనిపించడంతో అందరూ ఏమైంది అని భయపడుతూ ఉంటారు. ధీరజ్ ప్రేమని కౌగిలించుకొని ఏమైంది చెప్పు అని ఓదారుస్తాడు. బల్లి మీద పడింది అని చెప్పగానే ఏంటి బల్లికి నువ్వు భయపడ్డావా అని అందరూ నవ్వుతారు. శ్రీవల్లి బల్లి మీద పడితేనే ఇంతగా చేయాలా అని అంటుంది. ఆ మాట వినగానే నర్మదా బల్లులు చూడడానికి అమాయకంగానే ఉంటాయి. కానీ వాటి గురించి వాటి లోపల ఉన్న విషయం గురించి తెలిస్తే ఆ తర్వాత ఎవరికైనా మైండ్ పోవాల్సిందేనని అంటుంది.

వేదవతి సెటైర్లు..

Advertisement

బలే మన వల్లి అక్క అనుకున్నావా అలా అనుకోడానికి అదేం లేదు ప్రేమ అని నర్మదా అనగానే ప్రేమ కూల్ అవుతుంది. ఏంటి అత్తయ్య బల్లులు కూడా చాలా ప్రమాదకరం కదా అని వేదవతిని అడుగుతుంది నర్మదా. అవునమ్మా నేను కూడా ఒకప్పుడు బల్లులు చాలా అమాయకమైనవి అనుకున్నాను. కానీ ఇప్పుడు వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని నాకు అర్థం అయిపోయింది అని వేదవతి అనడంతో భాగ్యం శ్రీ వల్లి ఇది మన గురించి అంటుందా అని అనుకుంటారు. వీళ్ళందరూ కలిసి భాగ్యం శ్రీవల్లికి దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇస్తారు.

బంగారం కోసం కామాక్షి హడావిడి..

కామాక్షి తన భర్తను తీసుకొని హడావిడిగా లాక్కుంటూ వస్తుంది.. ఏంటే నడుస్తున్నాను కదా ఇలా లాక్కుంటూ వస్తుంటే ఆటోని లాక్కొని వెళ్ళినట్టు ఉంది అని తను ఎంత చెప్తున్నా సరే కామాక్షి మాత్రం మనం లేటుగా వెళ్తే ఒక తులం బంగారం మిస్ అయిపోతాం రండి అని చెప్పేసి లాక్కుంటూ పరిగెత్తుకుంటూ తీసుకొని వెళ్తుంది. కామాక్షి ఎంట్రీ ఇవ్వడం చూసినా ప్రేమ నర్మదా అమూల్య ఒక్కసారిగా షాక్ అవుతారు. నేను మీలాగా ఖాళీగా కూర్చున్న దాన్ని కాదు అన్ని పనులు చేస్తాను అని కామాక్షి చేసే హడావిడి చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా కౌంటర్ మీద కౌంటర్లు వేస్తారు. ఎప్పుడు పనిచేయని కామాక్షిల పనిచేస్తుందంటే ఏదో ఉంది అని తిరుపతి కూడా అంటాడు.

వియ్యంకుడుకి రామరాజు మర్యాదలు..

కామాక్షి పై కౌంటర్స్ వేస్తున్న నర్మదకు నా గురించి మాట్లాడటం ఆపేసి అటు మీ అమ్మ నాన్న వచ్చారు వెళ్లి చూసుకో అనేసి అంటుంది. నర్మదా వాళ్ళ అమ్మ నాన్న చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వాళ్ళ ఇంట్లోకి రావడం చూసి రామరాజు ఎదురు పడడంతో అందరూ ఏమవుతుందని టెన్షన్ పడిపోతూ ఉంటారు. కానీ రామరాజు మాత్రం చాలా మౌనంగా ఉంటాడు అయితే ధీరజ్ నేనే పిలిచాను అని చెప్పగానే రామరాజు కూడా మీ అమ్మానాన్నలకి మర్యాద చేయమ్మా అని పంపిస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read :Intinti Ramayanam Today Episode: భరత్ కు అవని స్ట్రాంగ్ వార్నింగ్.. పల్లవి మాస్టర్ ప్లాన్.. నిజం బయటపడుతుందా..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×