E-Paper
Advertisement

Illu Illalu Pillalu weekly Episodes: పెత్తనం కోసం భాగ్యం ప్లాన్.. ఆస్తి కోసం మరో కుట్ర.. ఈ వారం హైలెట్ ఎపిసోడ్స్…

Illu Illalu Pillalu weekly Episodes: పెత్తనం కోసం భాగ్యం ప్లాన్.. ఆస్తి కోసం మరో కుట్ర.. ఈ వారం హైలెట్ ఎపిసోడ్స్…
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 26th: వల్లి అలాగే భాగ్యం అత్తింట్లో అడుగు పెట్టినందుకు చాలా సంతోషంగా డాన్సులు వేస్తూ ఉంటారు. మనం అనుకున్నట్లుగానే ఇంట్లోకి మళ్లీ అడుగు పెట్టేసాము ఇకమీదట నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అని కూతురుకి నూరిపోరుస్తూ ఉంటుంది. వల్లి నేను ఇకమీదట ఎటువంటి పని చేయను చాలా బుద్ధిగా ఉంటానని చెప్తున్నా సరే.. బాగ్యం మాత్రం అలా ఉంటే నీ తోడికోడళ్లు నీ నెత్తి మీద భర్తను చేస్తారని కూతురికి లేనిపోనివి చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన నర్మదా ప్రేమలు భాగ్యంకి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తారు.. భాగ్యం మాత్రం ఏ మాత్రం తగ్గకుండా వాళ్ళిద్దరికీ కౌంటర్లు వేస్తుంది.. ఈ వారానికి వేదవతి ఎంట్రీ హైలెట్..

చావు బతుకుల్లో ప్రేమ.. 

శ్రీవల్లి గురించి నిజం తెలుసుకున్న చందు తన అవసరం లేదని తన పుట్టినరోజు రావాలని వెళ్ళిపోతాడు. శ్రీవల్లి మాత్రం తన భర్తకు దగ్గర అవ్వాలని ఎన్ని సార్లు ప్రయత్నించినా తన చెల్లెలికి చేసిన మోసాన్ని తలుచుకొని చందు వల్లిని దగ్గరకు కూడా రానివ్వడు. కనీసం ఫోన్ లో కూడా మాట్లాడుకున్న ఉండడంతో వల్లి తన భర్తకు శాశ్వతంగా దూరమైపోయాను అని బాధ పడిపోతూ ఉంటుంది. తన భర్తకు ఎలాగైనా దగ్గర వాళ్ళని తల్లి చెప్పిన మాటని గుడ్డిగా నమ్మేస్తుంది వల్లి.. కార్యేషు దాసి కరనీసు మంత్రి అంటూ నీ భర్తకు సేవలు చేయాలి అంటే మనము ఒక ఉత్తుత్తి ఆక్సిడెంట్ ని చేయించాలి అని ప్లాన్ చేస్తుంది. మధ్యలో సేన ఎంట్రీ ఇవ్వడంతో సీన్ రివర్స్ అవుతుంది. ఆక్సిడెంట్ అవుతున్న సమయంలో చంద్రుని కాపాడబోయి ప్రేమ లారీ కింద పడిపోతుంది.

ప్రేమ కోసం ధీరజ్ ఛాలెంజ్.. 

Advertisement

ప్రేమకు యాక్సిడెంట్ అయిందని తెలుసుకున్న భద్ర కుటుంబం తట్టుకోలేక పోతుంది. ప్రేమకు ఎలా ఉందో చూడాలని అనుకుంటారు కానీ ప్రేమే రావడంతో తనకు ఏమీ కాలేదని సంతోషంగా ఉంటారు. భద్ర ఆ ఇంట్లో ఉంటే నిన్ను ఎవరు చూసుకునే వాళ్ళు లేరు కదా.. మీ అత్తయ్య వచ్చేంతవరకు ఇక్కడ ఉన్నవే అని ఎంత చెప్తున్నా సరే ప్రేమ మాత్రం వినదు. అంతేకాదు ధీరజు ప్రేమ నేను చూసుకోంటాను అని అంటాడు. ఇక భారీ డైలాగులు కొట్టిన ధీరజ్ ప్రేమని తన ఇంటికే తీసుకుని వచ్చి పెడతాడు.

నిజం తెలుసుకున్న ధీరజ్.. 

తన అన్నప్రాణాలను కాపాడిందని ప్రేమను ప్రేమగా చూసుకోవాలని అనుకుంటాడు. తనకి ఇష్టం లేకపోయినా సరే తన అన్నప్రాణాలని కాపాడింది అని ప్రేమ అడిగిన వాటికల్లా వేసుకోకుండా సేవలు చేస్తాడు ధీరజ్. అయితే ఒక సందర్భంలో ప్రేమ ఎక్కువగా విసిగించడంతో కొట్టబోతాడు. అమూల్య చేసిన విషయంలో దీన్ని నేను మర్చిపోలేక పోతున్నాను అని అనడంతో చందు అసలు నిజాన్ని బయటపెడతాడు. అమూల్యనీ ప్రేమించమని చెప్పింది ప్రేమ కాదు వల్లి అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ప్రేమని తప్పుగా అర్థం చేసుకున్నాను అని ధీరజ్ తెగ బాధ పడిపోతూ ఉంటాడు..

ప్రేమకు దగ్గరైన ధీరజ్.. 

Advertisement

ఇన్ని రోజులు ప్రేమను దూరం పెట్టాను అని ధీరస్ చాలా ఇన్ని రోజులు ప్రేమను దూరం పెట్టాను అని ధీరజ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. అయితే ప్రేమ ఇచ్చిన గిఫ్ట్ ని మళ్లీ నీటుగా రెడీ చేసి సర్ప్రైజ్ ఇస్తాడు. నీలాంటి భార్య నాకు దొరకడం చాలా అదృష్టం. నా కుటుంబాన్ని కూడా నువ్వు కాపాడాలి అనుకుంటున్నావు నీకు ఎంత చేసినా తక్కువే అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా మళ్ళీ ఒక్కటైపోతారు.. వల్లి వాళ్ల గురించి నిజం తెలుసుకున్న ధీరజ్ ఎలాగైనా సరే వాళ్ళకి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. ప్రేమకు అలా కావడానికి కారణమైన ఆ లారీ డ్రైవర్ ని ఎలాగైనా సరే పట్టుకోవాలి అని పక్క ప్లాన్ చేసి పట్టుకుంటాడు.

వల్లి గుడ్ న్యూస్.. వేదవతి వార్నింగ్.. 

తన భర్తకి ఎలాగైనా దగ్గర అవ్వాలని వల్లి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది. లారీ డ్రైవర్ తో యాక్సిడెంట్ చేయించాలి అని అనుకున్నది వల్లి భాగ్యం అని తెలుసుకున్న ప్రేమా నర్మదా ధీరజులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. కట్టుకున్న భర్తని చంపాలని చూస్తావా..? నువ్వు అసలు ఆడదానివేనా అని నర్మదా అడుగుతుంది.. ఈ జన్మలో నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్లే ప్రసక్తే లేదు అని నర్మదా వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఇక ఆ టెన్షన్లో వల్లి కింద పడిపోతుంది. కట్ చేస్తే హాస్పిటల్ కి తీసుకెళ్లిన వల్లికి చెక్ చేసిన డాక్టర్ ఆమె ప్రెగ్నెంట్ అని గుడ్ న్యూస్ అని చెప్తుంది.. తన చెల్లి జీవితాన్ని నాశనం చేయాలనుకున్న ఆవిడతో నేను కాపురం చేయను అని చెందు ఫిక్స్ అవుతాడు..

వేదవతి దెబ్బకు భాగ్యం షాక్.. 

నర్మదా శ్రీవల్లి ప్రెగ్నెంట్ అని చెప్పడంతో అక్కడికి వెళ్లి తీసుకురావడానికి వెళ్తుంది.. అక్కడికి వెళ్లిన తర్వాత శ్రీవల్లి బాగోతం గురించి వేదవతి బయటపెట్టి భాగ్యంకి శ్రీవల్లికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఇంటికి తీసుకొని వస్తుంది. ఇన్ని రోజులు వేదవతి రాదు అని అనుకున్న ప్రేక్షకులు ఒక్కసారిగా సడన్ ఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాక్ అయిపోతారు.. వల్లి కడుపుతోందని తెలుసుకున్న రామరాజు చాలా సంతోషంగా ఉంటాడు. చందు నిజం చెప్పకపోతే వేదవతి ఆపుతుంది. ఈవారం హైలెట్ ఎపిసోడ్ అంటే వేదవతి ఎంట్రీనే.. ఇకముందు శ్రీవల్లి ఎలాంటి ప్లాన్ వేస్తుంది లేదంటే వేదవతి చెప్పినట్టు వింటుందా లేదా అన్నది ముందు ముందు ఎపిసోడ్లలో చూడాలి…

Also Read :Gundeninda GudiGantalu Today episode: బాలుకు నిజం చెప్పిన మీనా.. దిష్టి ఫోటోను చూసి మనోజ్ షాక్.. రచ్చ చేసిన ప్రభా..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×