E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: చందు సీరియస్.. భాగ్యం, శ్రీవల్లి ప్లాన్ ఫెయిల్.. ధీరజ్ కు దొరికిపోయిన లారీ డ్రైవర్..

Illu Illalu Pillalu Today Episode: చందు సీరియస్.. భాగ్యం, శ్రీవల్లి ప్లాన్ ఫెయిల్.. ధీరజ్ కు దొరికిపోయిన లారీ డ్రైవర్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 22nd: వల్లి భాగ్యం వేసిన వశీకరణ ప్లాన్ దారుణంగా ఫెయిల్ అవుతుంది. ఇకపోతే రాత్రి రైస్ మిల్లుకు వెళ్లిన చందు ఇంటికి రాగానే నర్మదా ప్రేమలు ఒక్కసారిగా చందు బావ చాలా బాధపడుతున్నాడు అని అనుకుంటారు.. వల్లి కూడా తన భర్త కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది కదా వీరిద్దరిని కలిపే ప్రయత్నం చేద్దాం అని నర్మద ప్రేమలు అనుకుంటారు.. చందు ఇచ్చిన కాఫీ ప్లాన్ ని అమలు చేస్తారు కానీ చందు చాలా ఫీల్ అయిపోతాడు..

చందు సీరియస్..

చందు ఇంటికి రాగానే ఒంటరిగా అక్కడ కూర్చుంటాడు.. ధీరజ్ ఎలాగైనా సరే వల్లి వదినని ఇంటికి తీసుకొని వస్తేనే అన్నయ్య మళ్లీ మారిపోతాడు అని అనుకుంటారు. అయితే వాళ్లకి వెళ్లి కాఫీ తీసుకురమ్మని ప్రేమ నర్మదలకు చెప్తాడు.. వాళ్ళిద్దరూ కాఫీ తీసుకొని వచ్చి చందు దగ్గరకు వస్తారు. కాఫీ ఎలా ఉంది బావగారు అని నర్మదా అడుగుతుంది. చాలా బాగుందమ్మా అని చందు అంటాడు.. వల్లి అక్క అయితే ఇంకా బాగా కాఫీ పెడుతుంది కదా అని ప్రేమ అనగానే చందు సిగ్గు పడిపోతూ ఉంటాడు. కానీ అమూల్య విషయంలో వల్లి చేసింది తలుచుకుని ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. తన పేరును కూడా నా దగ్గర తీయద్దు అని చందు అనగానే అందరూ షాక్ అవుతారు.

చందును ట్రాఫ్ చేసేందుకు భాగ్యం ప్లాన్..

Advertisement

చందు ఎలాగైనా సరే వల్లిని తీసుకొని వెళ్లేలా చేయాలి అని భాగ్యం చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఆఖరికి ఒక హోటల్లో కాఫీ కప్పులను కడగడానికి వల్లిని పెడుతుంది. నేనేంటమ్మా ఇలా కాఫీ కప్పులు కడగడం ఏంటి అని వల్లి ఎంత చెప్తున్నా సరే నువ్వు ఇలా చేస్తేనే మీ అత్తింటికి వెళ్తావు లేదంటే మాత్రం ఇక్కడే ఉండిపోతావు అని బలవంతంగా ప్లాన్ చేసి మరి చందు దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని వల్లి అనుకుంటుంది. ఇక వాళ్ళు ప్లాన్ ప్రకారం చందు వచ్చే టయానికి వల్లి అక్కడ కాఫీ కప్పులు కడుగుతూ కనిపిస్తుంది. వల్లితో పాటు భాగ్యం ఆనందరావు కూడా అక్కడ ఉండడం గమనించిన నర్మదా వాళ్ళ ప్లానేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది..

చందుకు దొరికిపోయిన వల్లి..

చందు టీ తాగడానికని అక్కడికి రాగానే అక్కడ కాఫీ కప్పులు కడుగుతూ వల్లిని చూస్తాడు. ఏంటి నువ్విక్కడ ఇలా చేస్తున్నావు అని చందు వల్లి పై సీరియస్ అవుతాడు. నువ్విక్కడ కాఫీ కప్పులు కడుపుతో మా ఇంటి పరువు తీయాలని అనుకుంటున్నావా అని అనగానే అక్కడికి భాగ్యం ఆనందరావు ఎంట్రీ ఇస్తారు. పుట్టింట్లో ఉంటే ఇలాంటి పరిస్థితి ఉంటుంది బాబు అత్తింట్లో ఉంటే చాలా సంతోషంగా ఉండేది అని భాగ్యం అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన నర్మదా ధీరజ్లు మీ ప్లాన్ చాలా బాగుంది ఇలాంటి ప్లాన్ వేస్తూ ఇంకా ఎన్ని రోజులు మమ్మల్ని మోసం చేస్తారు అని అనగానే చందు షాక్ అవుతాడు.. భాగ్యం వల్లీల ప్లాన్ ని చందు వచ్చి చెడగొట్టేస్తాడు. ఇంకా నిజంగానే బాధలో ఉన్నావని అనుకున్నాను కానీ ఇలా చేస్తావని అసలు ఊహించలేదు అని చందు మళ్ళీ శ్రీవల్లిని చీకొట్టి వెళ్ళిపోతాడు..

డ్రైవర్ దొరికిపోతాడా..? 

Advertisement

ప్రేమకు యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ టీ తాగడానికి అని ఆ కొట్టుకు వస్తాడు. అతని చూసిన నర్మదా ధీరజ్ లారీ డ్రైవర్ వచ్చేసాడు అని అంటుంది. ఇద్దరూ కలిసి ఆ లారీ డ్రైవర్ ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ వాడు పారిపోతాడు. రోజు ఎలాగైనా సరే వాడి చేత నిజం కక్కించాలి అని ధీరజ్ నర్మద ఇద్దరు కూడా వాడిని వెంబడిస్తారు. చివరికి ధీరజ్ నర్మదాలు ఇద్దరూ చిరువైపు వెళ్లి ఆ డ్రైవర్ని పట్టుకుంటారు. మా అన్నయ్యని యాక్షన్ చేయమని ఎవరు చెప్పారు చెప్పు లేదంటే నేను చంపేస్తాను అని ధీరజ్ వాడిని దారుణంగా కొడతాడు. మొత్తానికి అతను నిజం చెప్పేస్తాను అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ధీరజ్ వల్లి గురించి నిజం చెప్తాడు ఏమో చూడాలి.. ఏం జరుగుతుందో మిస్ అవ్వకుండా చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు సపోర్ట్ గా చక్రధర్.. భరత్ కు షాకిచ్చిన పల్లవి.. రాజేశ్వరి సర్ప్రైజ్ గిఫ్ట్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×