E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ, ధీరజ్ ప్రేమకు రేవతి ఫిదా.. నర్మద మాస్టర్ ప్లాన్.. సాగర్ ను ఇరికించిన భాగ్యం..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ, ధీరజ్ ప్రేమకు రేవతి ఫిదా.. నర్మద మాస్టర్ ప్లాన్.. సాగర్ ను ఇరికించిన భాగ్యం..
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 13th: ప్రేమకు సేవలు చేసేందుకు ధీరజ్ తెగ హడావిడి చేస్తూ ఉంటాడు. ప్రేమ నాకు భోజనం పెట్టాలి అని అన్నా కూడా నువ్వే తిను అని ప్రేమకు తెచ్చి ప్లేట్ ఇస్తాడు. కానీ ప్రేమ మాత్రం ఇలాంటి అన్నాన్ని నేను అసలు తిననే తినను అని పక్కన పెట్టేస్తుంది. నువ్వు తినిపిస్తానని మాట ఇచ్చావు కానీ ఇప్పుడు మాట తప్పవు నేను అసలు తినను అని ప్రేమ పడుకుంటుంది. కానీ ధీరజ్ మాత్రం నేనే తినిపిస్తాను అని అనగానే ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. అదేంటి ఇందాక కష్టంగా పడుకున్నావ్.. ఇప్పుడు అంత ఈజీగా లేచావు అని అనగానే..ఆకలి అలా వేస్తుంది. కాబట్టే లేచాను నువ్వు తినిపిస్తావా లేదా అని ప్రేమ అంటుంది.. వీళ్ళిద్దరూ ప్రేమగా ఉండడం ఎపిసోడ్ కి బాగా హైలైట్ గా నిలుస్తుంది..

ధీరజ్ ప్రేమకు రేవతి ఫిదా.. 

ధీరజ్ అలా ప్రేమగా తినిపిస్తూ ఉండడం చూసినా ప్రేమ వాళ్ళ నాన్నమ్మ అలాగే వాళ్ళ అమ్మ రేవతి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు.. ఇద్దరు ఇలా సంతోషంగా ఉండడం చూస్తే మాకు కడుపు నిండిపోతుంది ఇంతకన్నా మాకు ఏం కావాలి అని అంటారు. కన్న కూతురికి బాగో లేకపోయినా కల్లారా చూసుకునే భాగ్యం నాకు లేదు అని రేవతి ఎమోషనల్ అవుతుంది.. నువ్వు ఎందుకు బాధ పడుతున్నావే నీ అల్లుడు బంగారం అని వాళ్ళ అత్తయ్య అంటుంది.. ఇకపోతే ప్రేమ ధీరజ్ లను చూసి బామ్మ చాలా సంతోషంగా ఉంటుంది.. నా భార్యను చూసుకోవడం నా అదృష్టం అని దీర్ఘ అనడంతో ఆమె ఎమోషనల్ అయిపోతుంది. మీరు ఇలాగే ఉండడం కాదు మా చేతుల్లో ఒక మనవడిన మనవరాల్లో పెట్టి మీ ప్రేమకు గుర్తుని చూపించండి అని వాళ్ళిద్దర్నీ కలిపి వెళుతుంది.. ప్రేమ మాత్రం ధీరజ్ని చెయ్యి వదలకుండా ఒక ఆట ఆడుకుంటుంది.

తిరుపతి ఫుల్ హ్యాపీ..

Advertisement

వాళ్ళ అమ్మ వదిన ఇంటికి రావడం చూసిన తిరుపతి చాలా సంతోషంగా ఉంటాడు. బెంగళూరు వెళ్లవలసిన ట్రైన్ భద్రాచలం వచ్చినట్లు మీరిద్దరూ ఇలా వచ్చారు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటాడు. ప్రేమని ఇలా చూసుకోవడం మా అదృష్టం అని భావించాలి కన్నా కూతురిని కల్లారా కూడా చూసుకోలేకపోతున్నాను అని రేవతి బాధపడుతుంది.. రామరాజు ఇంకాసేపు కూర్చొని వెళ్లండి అని అంటున్న సరే రేవతి మాత్రం దొంగచట్టుగా వచ్చి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది అన్నయ్య వెళ్తాము అని అంటుంది. ఇక వాళ్ళిద్దర్నీ తిరుపతి బయటకు తీసుకొని వస్తాడు.

మేనకోడలి కోసం భద్ర కన్నీళ్లు.. 

రేవతి అలాగే వాళ్ళ అమ్మ ఎక్కడికో వెళ్లారు అని భద్ర కనిపెడుతుంది. అడ్డంగా దొరికిపోయామని అనుకున్నా వాళ్ళందరూ కూడా కూరగాయలకు వెళ్ళామని అబద్ధం చెప్తారు.. అరే కూరగాయలు తీసుకురాకుండా ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. ఏంటి నీ ప్రశ్నలు కూరగాయలు ఎండలు లాగా మండిపోతున్నాయి ఎలా కొనమంటావు అని వాళ్ళ అమ్మ అంటుంది. ఇక తిరుపతి కూడా వాళ్ళిద్దరికీ తోడవడంతో మీరు ఎక్కడికి వెళ్లారు నిజం చెప్తారా లేదా అని భద్ర అడుగుతుంది. మేము నిజమే చెప్తున్నాము అని ఎంత అన్న కూడా వినదు.. అవునే మనవరాలు చూడడానికి ఆ ఇంటికి వెళ్ళాము అని అనగానే… ఆ గీత దాటి ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పానా అని భద్ర సీరియస్ అవుతున్న సరే రేవతి మాత్రం కన్న కూతురిని చూసుకోవడానికి వెళ్లకూడదని అడుగుతుంది. ప్రేమ ఎలా ఉంది అని భద్ర అడుగుతుంది.. తిరుపతి ఏంటి అక్క నువ్వు కూడా వచ్చి ప్రేమను చూస్తావా అని అడుగుతాడు.

యాక్సిడెంట్ కూపి లాగుతున్న నర్మద..

Advertisement

ఇంకా నర్మదా ఆఫీసులో ఉంటూ యాక్సిడెంట్ ఎవరు చేసారు అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఒక ఫైల్ మీద సంతకం చేయకుండా తాను అలానే ఉండడంతో అక్కడికి వచ్చి నా వ్యక్తి మేడం ఇది. నా అన్ని సంతకాలు చేసి ఉన్నాయి మీరు చెక్ చేసి సంతకం పెట్టండి మేడం అని ఎంతగా అడుగుతున్నా సరే.. మీకోసం కాదండి నేను వేరే ఆలోచనలో ఉండి అలా చేశాను. ఇప్పుడే సంతకం చేస్తాను అని అంటుంది.. అయితే ప్రేమ చెప్పింది ఒకసారి ఆలోచించాలి అని ఆర్డిఓ ఆఫీస్ కి ఫోన్ చేసి ఆ లారీ వివరాలను చెపుతుంది.. ఈ యాక్సిడెంట్ నిజంగానే ఎవరైనా చేయించారేమో నేను తెలుసుకోవాలి అప్పుడు చెప్తాను వాళ్లకి అని నర్మదా అనుకుంటుంది.

సాగర్, నర్మదలను ఇరికించిన భాగ్యం..

మనము ఈ యాక్సిడెంట్ చేశామని తెలుసుకుని చాన్స్ ఎవరికీ లేదు అని భాగ్యం అంటుంది. ఎవరైనా సరే మన ముందు బలదూరే.. అసలు ఆ నర్మదకి ఆలోచించే ఛాన్స్ ఇవ్వకుండా నేను దాన్ని ఇరికిస్తాను చూడు అని భాగ్యం అంటుంది.. అయితే భాగ్యం సాగనిర్మాదలు తాకట్టు పెట్టిన ఆ నగల షాప్ కి వెళ్తారు. అన్ని నగలు తీసుకున్న తర్వాత.. డబ్బులు ఇవ్వమని అడిగితే భాగ్యం 100 రూపాయలు చేతిలో పెడుతుంది. అయితే ఏంటి తమాషా చేస్తున్నారా? అని రామరాజు చిన్నకోడలు చిన్న కొడుకు మీ దగ్గర పది లక్షలు విలువైన నగలు పెట్టి 20 లక్షలు తీసుకున్నారు కదా.. మరి వాళ్ల సంగతేంటి అని అంటుంది. మీరు ముందు వెళ్లి ఆ రామరాజును అడిగి వడ్డీ డబ్బులు తీసుకోండి లేదా ఈ విషయాన్ని అతనికి చెప్పండి అని నర్మదని ఇరికిస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: హాస్పిటల్ నుంచి రాజేశ్వరి మిస్సింగ్.. నిజం తెలుసుకున్న రాజేశ్వరి.. అవనికి దిమ్మతిరిగే షాక్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×