E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు ధీరజ్ గోరుముద్దలు.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. మళ్ళీ పుట్టింటికి పయనం..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు ధీరజ్ గోరుముద్దలు.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. మళ్ళీ పుట్టింటికి పయనం..
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 11th: నర్మదా ప్రేమ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే భోజనం తినిపిస్తాను అని అంటుంది. ఆ మాట వినగానే ఒక్కసారిగా ప్రేమ కెవ్వు మంటుంది. ఏంటే ఒకసారి అలా అరిచావు ఏమైంది నేనేమైనా తప్పుగా అన్నానా అని నర్మదా అంటుంది. నువ్వేమీ తప్పుగా అనలేదు అక్క.. ధీరజ్ మా వాళ్ల దగ్గర ఎంతగా శబ్దాలు చేశాడో చూసావు కదా ఇప్పుడు అవన్నీ అబద్ధమే అని తేలిపోతాయి కదా అతనే తినిపిస్తాడు అని అనగానే నర్మదా అవునవును అని అంటుంది. ఇక చేసేదేమీ లేక ధీరజు ప్రేమకు ప్రేమగా అన్నం వట్టిస్తాడు. ఈ ఎపిసోడ్ కి ఈ సీన్హై లెట్ గా నిలుస్తుంది.

ప్రేమకు గోరుముద్దలు పెట్టిన ధీరజ్..

నర్మదా ప్రేమకు తినిపించడానికి భోజనం తీసుకొని వస్తే అక్క నువ్వు తినిపిస్తే మా ఆయన అన్నమాట వేస్ట్ అయిపోతుంది కదా అందుకే మా ఆయనే భోజనం తినిపించాలి అని ప్రేమ అడుగుతుంది.. ఇక ప్రేమకు ధీరజ్ గోరుముద్దలు తినిపిస్తాడు. నువ్వు మీ ఇంట్లో వాళ్లకి దగ్గరికి పంపిస్తే సంతోషంగా ఉంటావో లేదో అని అలా అన్నాను అని అనగానే అందుకేనా ప్రేమ కోసం నువ్వు హాస్పిటల్ లో కన్నీళ్లు పెట్టుకున్నావు అని ప్రేమ అడుగుతుంది. నర్మదా అనగానే ప్రేమ ఏంట్రా నాకోసం నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నావా అని అడుగుతుంది.. నాకోసం నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నావా నాకు చూడాలని ఉందిరా అనేసి ప్రేమ అంటుంది..

ప్రేమ మాటతో నర్మద షాక్..

Advertisement

నువ్వు అదృష్టవంతురాలు ప్రేమ అంత పెద్ద యాక్సిడెంట్ అయిన కూడా చిన్న గాయాలతో బయటపడ్డావు అని నర్మదా అంటుంది. నాకెందుకు దాన్ని చూస్తుంటే ఆక్సిడెంట్ లాగా అనిపించలేదు కానీ ప్రేమ అనగానే నర్మదా ఏంటి ప్రేమ నువ్వు మాట్లాడేది ఆక్సిడెంట్ కాదా అని అడుగుతుంది. కానీ ఖచ్చితంగా చందు భావ ఉన్న వైపే లారీ ఎందుకు వస్తుంది? చూస్తుంటే అది యాక్సిడెంట్ కాదు అని అనిపిస్తుంది అని ప్రేమ అనగానే ధీరజ్ నర్మదా టెన్షన్ పడతారు.. ఎందుకు బావ రోడ్డు కి పక్కన ఉన్న కూడా అతని మీదకి లారీ రావడం నేను చూశాను అని ప్రేమ అనగానే అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీవల్లి ఏంటి తెలిసిపోయిందా అని అంటుంది. ఆ మాట వినగానే అంత ఒక్కసారిగా షాక్అయిపోతారు..

అడ్డంగా ఇరుక్కున్న వల్లి.. 

వల్లిని చూసిన అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. ఏంటి తెలిసిపోయిందని అన్నావు అని నర్మదా అంటుంది.. తెలిసిపోయింది కాదు పెద్ద యాక్సిడెంట్ జరిగింది అని తెలిసింది అని అంటున్నాను అని వల్లి అంటుంది.. బావ మీకు అంత పెద్ద ప్రమాదం జరిగింది కదా.. ఇప్పుడు ఎలా ఉంది బాబా నా మాంగల్యం గట్టిది.. కాబట్టి మీరు అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు అని వల్లి ఓవరాక్షన్ చేస్తుంది.. నువ్వు చేసిన ఓవరాక్షన్ చాలు ఇంకా ఆపు అని చందు అంటాడు.. అవునమ్మా పెద్ద ప్రమాదం నుంచి మేమందరం బయటపడ్డారు. ప్రేమ ప్రాణాలకు తెగించి చందు ని కాపాడింది అని అనగానే అవును నా చెల్లి చాలా మంచిది అని శ్రీవల్లి నాటకం మొదలుపెడుతుంది.

చందు బయటకు వెళ్ళమంటాడు..

Advertisement

నా మాంగల్యాన్ని కాపాడిన ప్రేమకి ఇలా జరిగిందని తెలిసి నా ప్రాణం జివ్వుమంది.. ప్రేమని సొంత చెల్లెలు లాగా కాకుండా నాకు కన్న బిడ్డ లాగా నేను చూసుకుంటాను అని శ్రీవల్లి అంటుంది. కానీ ప్రేమకేం కాలేదు బాగానే ఉంది నువ్వు బయలుదేరు అని చందు అంటాడు.. ఆ మాట వినగానే అదేంటి బావ నన్ను వెళ్లిపో అంటావు ప్రేమకు ఇలా జరిగిన తర్వాత కూడా అని చందు ని అడుగుతుంది. అదేంట్రా తనని వస్తే వెళ్ళిపో అంటావ్ ఏంటి అని రామరాజు అడుగుతాడు.. అమ్మకి బాగాలేదు కదా నాన్న అందుకే వెళ్ళమని చెప్తున్నాను ఇక్కడ మేమందరం ఉన్నాం కదా ప్రేమను చూసుకోవడానికి అని చందు అంటాడు.

శ్రీవల్లి నోటి దూల.. 

అవునమ్మా మీ అమ్మకి కాలు దెబ్బ తగిలిందని అక్కడికి వెళ్లావు కదా.. ఇప్పుడు ఎలా ఉంది అని రామరాజు అడుగుతాడు. మా యమ్మ కు ఏమైంది గుండ్రాయి లాగా ఉంది అని అనగానే అందరూ షాక్ అవుతారు.. అమ్మకి కాలు దెబ్బ తగిలిందనే కదా మనం అక్కడికి వెళ్లావు. అవును మావయ్య గారు మా అమ్మకి జరిగింది కాలికి మాత్రమే కదా మిగతాది గుండ్రాయి లాగా ఉంది అని అంటుంది. మా అమ్మకి ఏం కాదు ఎలాగోలాగా చేసుకుంటుంది నేను ఇక్కడే ఉండి ప్రేమకి సేవలు చేస్తాను అని అంటుంది. మీ అమ్మకి అక్కడ ఉండడమే నువ్వు చాలా ఇంపార్టెంట్ నాకేం పర్లేదు కానీ ప్రేమ అనగానే శ్రీవల్లి షాక్ అవుతుంది.

అయ్యో.. శ్రీవల్లి మళ్ళీ పుట్టింటికే.. 

చందు శ్రీవల్లిని పద వదిలిపెడతాను అని అంటాడు.. ఇక అందరూ ఎవరి పనులకు వాళ్లకు వెళ్ళగానే.. నర్మదా ప్రేమలు వల్లి దగ్గరికి వచ్చి మీ అమ్మ మేల తాళాలతో ఈ ఇంటికి పంపిస్తాను అంది కానీ ఇలా చేపల పులుసు పంపించి ఇంట్లో కాలు పెట్టాలని చెప్పిందా అని అడుగుతుంది.. నువ్వు అక్కడ ఉండడమే మంచిది ఎలా ఇక్కడికి వస్తావో మేము చూస్తాము అని నర్మదా ప్రేమలు వల్లికి వార్నింగ్ ఇస్తారు. ఇంకా భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేయడానికి కూర్చుంటారు.. చందు నువ్వు వస్తే వదిలి పెట్టేసి నేను మళ్లీ వెళ్లి నిద్రపోవాలి అనేసి అంటాడు.. మళ్లీ మళ్లీ ఇంటికి రావడంతో భాగ్యం షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: రాజేశ్వరికి నిజం చెప్పేసిన అవని.. చక్రధర్ కు పల్లవి వార్నింగ్..భరత్ మాటతో మీనాక్షి కన్నీళ్లు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×