E-Paper
Advertisement

ఆ టీవీ షోతో సీరియల్ ఛాన్స్ కొట్టేసిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటి నర్మద!

ఆ టీవీ షోతో సీరియల్ ఛాన్స్ కొట్టేసిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటి నర్మద!
Advertisement

Tv Actress Anshu Reddy: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అన్షు రెడ్డి(Anshu Reddy) ఒకరు. ప్రస్తుతం ఈమె స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu Illaalu pillalu) అనే సీరియల్ లో నర్మదా పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర ద్వారా అన్షు రెడ్డికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు రావడమే కాకుండా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ద్వారా మరింత మంది ప్రేక్షకులకు దగ్గరైన అన్షు రెడ్డి ఇటీవల ఒక సందర్భంలో తనకు సీరియల్ అవకాశాలు రావడం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్టార్ మహిళ షో ద్వారా అవకాశం…

తనకు మొట్టమొదట సీరియల్ లో అవకాశం ఒక టీవీ షో ద్వారా వచ్చిందని తెలిపారు.. ఈమె కాలేజీ చదువుతున్న సమయంలో ఈటీవీలో సుమ (Suma) వ్యాఖ్యతగా వ్యవహరించిన స్టార్ మహిళ కార్యక్రమం(Star Mahila) ఎలాంటి ఆదరణను పొందినదో అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం దాదాపు 12 సంవత్సరాల పాటు ప్రసారమవుతూ రికార్డులను సృష్టించింది. అయితే ఈ కార్యక్రమానికి తాను ఒక ఆడియన్ గా వెళ్లాననీ, ఆ సమయంలో ఈటీవీ మేనేజ్మెంట్ తనని చూసి భార్యామణి సీరియల్ ఆడిషన్ కు పిలిపించారని ఈమె తెలిపారు.

యాక్టర్ మాత్రమే కాదు మంచి డాన్సర్..

Advertisement

ఈ సీరియల్ కు తాను ఎంపిక అయ్యానని అనంతరం ఇద్దరు అమ్మాయిలు, సూర్యవంశం, గోకులంలో సీత వంటి తదితర సీరియల్స్ లో చేసే అవకాశం వచ్చిందని తెలిపారు. ఇక ప్రస్తుతం అన్షు రెడ్డి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈమె కేవలం తెలుగు సీరియల్స్ మాత్రమే కాకుండా తమిళ సీరియల్స్ కూడా చేశారు. ఇలా ఒకవైపు బుల్లితెర నటిగా వరుస సీరియల్స్ చేస్తూనే మరోవైపు ఈటీవీలో ప్రసారమైన ఢీ 20 కార్యక్రమంలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న అన్షు రెడ్డి మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు.

నిశ్చితార్థం రద్దు చేసుకున్న అన్షు రెడ్డి..

Advertisement

యూట్యూబ్ ఛానల్ , సీరియల్స్, ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా కెరియర్ పరంగా ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు .ఇక అన్షు రెడ్డి వ్యక్తిగత విషయానికి వస్తే తెలంగాణలోని సిద్దిపేట్ కు చెందిన ఈమె టీవీ సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం అన్షు రెడ్డి సింగిల్ గా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఈమె నిశ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది కొన్ని కారణాల వల్ల ఈమె తన నిశ్చితార్థం రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.

Also Read: ఫైనల్లీ విడుదలకు సిద్ధమైన విశ్వంభర.. రిలీజ్ డేట్ ఫిక్స్? 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×