E-Paper
Advertisement

Illu illaalu Pillalu Sukanya : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సుకన్య జీవితంలో కష్టాలు.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

Illu illaalu Pillalu Sukanya : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సుకన్య జీవితంలో కష్టాలు.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..
Advertisement

Illu illaalu Pillalu Sukanya : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఒకటి.. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రోజుకో ట్విస్ట్ తో జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది.. ఈ మధ్యకాలంలో ఈ సీరియల్ కి డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. స్టోరీ రోజుకో మలుపు తిరగడంతో సీరియల్ నువ్వు చూసేందుకు జనాలు ఆసక్తికనబరుస్తున్నారు.. ఇందులో ఈ మధ్యకాలంలో ఎంట్రీ ఇచ్చిన సుకన్య గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వైరల్ అవుతుంది.. ఈమె స్టోరీ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటో కాస్త వివరాలు తెలుసుకుందాం..

సుకన్య జీవితంలో కష్టాలు..

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న టాప్ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు.. ఇందులో ఇటీవల ఎంట్రీ ఇచ్చిన సుకన్య క్యారెక్టర్ కు మంచి క్రేజ్ లభించింది.. వల్లికి కజిన్ పాత్రలో వచ్చిన ఈ సుకన్య ఇంట్లోకి అడుగుపెట్టగానే అందరిని తన బుట్టలో వేసుకుంది.. అందం, చలాకితనం ఉన్న ఈ బ్యూటీ గతంలో ఎన్నో కష్టాలను అనుభవించిందని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.. రమ్య తెలుగు పిల్లే.. తెలంగాణ ఖమ్మం జిల్లాకి చెందిన ఈ అమ్మడు అతి చిన్న వయసులోనే యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో ఇంట్లో నుంచి వచ్చేసింది. ఆ తర్వాత పలు ఆడిషన్స్ కి వెళ్లి అక్కడ తను నటనతో సెలెక్ట్ అయింది. ఎన్నో ఏళ్ళు ఒంటరిగా పోరాటం చేసిన ఈమె కెరియర్ స్టార్టింగ్ లో కాస్టింగ్ కౌచ్ బారిన పడిందట. నీకు అవకాశం ఇస్తే మరి నాకేంటి? అని చాలామంది ఆమెను ఇబ్బంది పెట్టారట.. అలాంటి సవాళ్లను ఎన్నో ఎదుర్కొని ప్రస్తుతం సీరియల్స్లలో నటిస్తూ క్రేజ్ ను సంపాదించుకోవడంతో పాటుగా రెండు చేతుల సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటుంది.

Advertisement

సుకన్య సీరియల్స్ విషయానికొస్తే..

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఇటీవల ఎంట్రీ ఇచ్చిన కొత్త క్యారెక్టర్ సుకన్య. ఈమె గురించి చాలామందికి తెలియదు.. ఈ సుకన్య గతంలో అనేక సీరియస్లలో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.. అమర్ దీప్, ప్రియాంక జైన్ జంటగా నటించిన సూపర్ హిట్ సీరియల్ జానకి కలగనలేదు లో సుకన్య పనిమనిషి చికిత క్యారెక్టర్ లో నటించింది. ఆ సీరియలు ఈమెకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఇంతకీ ఈమె అసలు పేరు ఏంటంటే రమ్య. సోషల్ మీడియాలో బార్బీ రమ్య అనే పేరుతో తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తుంది. హీరోయిన్ మెటీరియల్ కల్లా ఈ అమ్మడు ఎందుకు సైడ్ క్యారెక్టర్లు చేస్తుంది అని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ వార్తలపై రమ్య ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×