E-Paper
Advertisement

Illu Illaalu pillalu prema : ప్రేమ అవుట్.. కొత్త హీరోయిన్ ఎంట్రీ.. బ్యాగ్రౌండ్ ఇదే..?

Illu Illaalu pillalu prema : ప్రేమ అవుట్.. కొత్త హీరోయిన్ ఎంట్రీ.. బ్యాగ్రౌండ్ ఇదే..?
Advertisement

Illu Illaalu pillalu prema : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఒకటి. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ జనాలని బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. అయితే ఈ మధ్య ఈ సీరియల్ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ఈ సీరియల్లో ప్రేమ క్యారక్టర్ లో నటిస్తున్న కన్నడ ముద్దుగుమ్మ ప్రెగ్నెంట్ కావడంతో సీరియల్ నుంచి తప్పకుండా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలు ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పటినుంచి ప్రేమ పాత్రలోకి రాబోతున్న కొత్త హీరోయిన్ ఎవరు అని సోషల్ మీడియాలో నెటిజెన్లు తెగ వెతికిస్తున్నారు. మరి ఇప్పుడు ప్రేమ ప్లేస్ లోకి రాబోతున్న ఆ హీరోయిన్ పేరేంటి? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

కొత్త ప్రేమ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో రామరాజు మూడవ కొడుకు ధీరజ్ భార్యగా ప్రేమ నటిస్తుంది. మిగిలిన ఇద్దరు కోడల్లా మధ్య డైలాగులు పెద్దగా పేలట్లేదు.. కానీ ప్రేమ ఈ సీరియల్ కి హైలెట్ క్యారెక్టర్ గా నిలుస్తుంది. తన అత్త ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఎలాగైతే తప్పు చేసిందో అదే బాటలో ప్రేమ కూడా నడుస్తుంది.. అనుకోని పరిస్థితులలో తన సొంత మేనత్త కొడుకుని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెడుతుంది.. అప్పటినుంచి ఆమె జీవితంలో ఎన్నో అనుకోనివీ జరుగుతాయి.. చివరికి వల్లి గురించి అసలు నిజం తెలియడంతో ధీరజ్ ప్రేమల మధ్య దూరం తగ్గిపోతుంది.

Advertisement

అయితే ఇప్పుడు ఈ ప్రేమ ఈ సీరియల్ నుంచి తప్పుకోబోతుందని టాక్.. కొత్త ప్రేమగా రాబోతున్న అమ్మాయి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె పేరు మన్విత జగదీష్. ఈమె కూడా కన్నడ ముద్దుగుమ్మనే.. తెలుగులో ఇదే తొలి సీరియల్. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌తో తెలుగు టీవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది. ఈ సీరియల్ తో ఈమె క్రేజ్ ఏ మాత్రం పెరుగుతుందో చూడాలి..

ఇల్లు ఇల్లాలు పిల్లలు స్టోరీ.. 

ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ స్టోరీ విషయానికి వస్తే.. శ్రీవల్లి ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు.. వేదవతి కొన్ని కండిషన్లు పెట్టి తన కోడల్ని మళ్లీ తన ఇంటికి తీసుకుని వస్తుంది.. కానీ భాగ్యం శ్రీవల్లి మళ్లీ ఆ ఇంట్లో పెత్తనం కోసం పోరాటం చేస్తూనే ఉంటారు. తోడికోడల్ని ఎలా తొక్కేయాలి అని భాగ్యం తన కూతురికి నూరిపోస్తుంది. వీళ్ళ మాటలు విన్న నర్మదా ప్రేమ ఇద్దరు కూడా దిమ్మ తిరిగిపోయేలా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారు. ఇవాళ ఎపిసోడ్లో శ్రీవల్లిని చంద్రుని కలిపే ప్రయత్నం చేస్తుంది వేదవతి. మరి ఇద్దరు కలుస్తారా లేదా అన్నది చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×