E-Paper
Advertisement

Illu illaalu Pillalu Narmada : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. నర్మద అవుట్..

Illu illaalu Pillalu Narmada : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. నర్మద అవుట్..
Advertisement

Illu illaalu Pillalu Narmada : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న టాప్ రేటింగ్ సీరియస్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొన్ని ఎపిసోడ్ల నుంచి అదిరిపోయే ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ఈమధ్య శ్రీవల్లి గురించి రోజుకో వార్త బయటపడడంతో సీరియల్ ఎపిసోడ్లు ఆసక్తికరంగా మారుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో శ్రీవల్లి బండారం మొత్తం తన భర్త అయిన చందు కి తెలుసుకోవడంతో ఆమెను తన పుట్టింట్లో వదిలి పెట్టేసి వస్తాడు. మరి మళ్లీ తనని తీసుకొని వస్తాడా లేదా అన్నది ఇప్పుడు జనాల్లో ఆసక్తిగా మారింది.

ఏది ఏమైనా కూడా ఇంట్లో పుల్లలు పెట్టి గొడవలు పెట్టే క్యారెక్టర్ ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్లిపోవడంతో సీరియల్ కాస్త డల్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సీరియల్ లవర్స్ కి ఓ బ్యాడ్ న్యూస్.. ప్రస్తుతం టాప్ రేటింగ్ లో కొనసాగుతున్న ఈ సీరియల్ కు దయనీయంగా మారే పరిస్థితి వచ్చిందని ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అసలు ఏం జరిగింది అంటే సీరియల్ నుంచి నర్మదా బయటకు వెళ్ళిపోతుంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. మరి ఈమె నిజంగానే వెళ్ళిపోతుందా? ఎందుకు వెళ్ళిపోతుంది? అన్నది ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

నర్మద అవుట్..?

Advertisement

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కి హీరోయిన్ ప్రేమ పాత్ర ఎంత ముఖ్యమో నర్మదా పాత్ర కూడా అంతే ముఖ్యము. గవర్నమెంట్ కోడలు పాత్రలో ఈమె ఇందులో నటిస్తుంది. తెలివైన కోడలు పిల్లగా అత్తమ్మ పొందుతూ అందరిని తన మాటతనంతో, ఏదైనా సమస్య వస్తే ఎంతో తెలివిగా ప్రదర్శించి అందరి మనసుని దోచుకుంది. తెలివైన కోడలు అని నిరూపించుకుంటూ వస్తుంది. శ్రీవల్లి పథకాలకు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ.. తన నిజాయితీని మరోవైపు నిరూపించుకుంటూ ఉత్తమ కోడలుగా నటిస్తుంది. ఈ ఉత్తమ కోడలు పాత్రలో నటించిన ముద్దుగుమ్మ అన్షు రెడ్డి. ఈమధ్య ఈమె ఢీ డాన్స్ షోలోకి కూడా వెళ్లిన విషయం తెలిసిందే.. అందులో తన డాన్స్ తో తెలుగు ఆడియన్స్ ను ఔరా అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఏమయి సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం డాన్స్ షోలో బిజీగా ఉండటమే అని తెలుస్తుంది. ఇన్నాళ్లకు తన టాలెంట్ ని బయటపెట్టే అవకాశం రావడంతో ఆమె ఈ షో కి కంప్లీట్ గా తన ఎఫర్ట్ పెట్టాలని అనుకుంటుందట.. దాంతో ఈమె సీరియల్ కి గుడ్ బై చెప్పబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే అన్షు రెడ్డి క్లారిటీ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే..

యూట్యూబ్ ద్వారా లక్షల సంపాదిస్తున్న అన్షు.. 

ఈమధ్య తెలుగులో నటిస్తున్న సీరియల్ యాక్టర్స్ చాలా వరకు సోషల్ మీడియాలో బిజీగా ఉండడంతో పాటుగా సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ని రన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ అనుష రెడ్డి కూడా సొంతంగా యూట్యూబ్ ఛానల్ ని నడుపుతున్న విషయం తెలిసిందే. చేతినిండా సీరియల్స్ తో బిజీగా ఉన్నా కూడా తన యూట్యూబ్ ఛానల్ లో మాత్రం వీడియోలు చేస్తూనే ఉంటుంది. ఆమె నెలకు యూట్యూబ్ ద్వారా లక్షల్లో సంపాదిస్తుందని తెలుస్తుంది. మరోవైపు సీరియస్ లో కూడా నటిస్తూ బాగానే సంపాదిస్తుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×