E-Paper
Advertisement

నైటీ వేసుకుని షోకి రావచ్చు కదా… ఇంద్రజ పై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!

నైటీ వేసుకుని షోకి రావచ్చు కదా… ఇంద్రజ పై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!
Advertisement

Hyper Aadi: హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు .ఈయన బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం వెండితెరపై కూడా సినిమాలలో అవకాశాలను అందుకుంటూ ఆది ఎంతో బిజీగా ఉన్నారు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా బుల్లితెరకు పరిచయమైన ఆది ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరమైన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు.

కూరగాయలు అమ్ముతున్న రష్మీ..

ఈ ప్రోమో వీడియోలో భాగంగా హైపర్ ఆది మాట్లాడుతూ… ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా ఏఐ టెక్నాలజీ ద్వారా ఫోటోలను వైరల్ చేస్తున్నారు ఒకవేళ మనం కనుక ఇండస్ట్రీలోకి రాకపోయి ఉంటే ఏ ప్రొఫెషన్ లో స్థిరపడే వాళ్ళమో ఏ ఐ ద్వారా తెలుసుకుందాము అంటూ ఆ కార్యక్రమంలో పాల్గొన్న పలువురి ఫోటోలను రివిల్ చేశారు. ఇందులో భాగంగా యాంకర్ రష్మీ కూరగాయలు అమ్ముతూ జీవనం కొనసాగించేదని ఏఐ తెలిపింది ఇక ఇంద్రజ గారి గురించి అడగడంతో ఆమె వంట మనిషి గెటప్ లో కనిపించారు.

నైటీతో వంట చేస్తున్న ఇంద్రజ..

Advertisement

నైటీ వేసుకుని వంట చేస్తున్నటువంటి ఫోటో రివిల్ చేయడంతో నైటీ చాలా ఎమోషన్ అంటూ రష్మీ మాట్లాడటంతో మరి ఇంత ఎమోషనా ఏమండీ జడ్జి గారు ఒకసారి ఇలా (నైటీ వేసుకుని) మన షో కి రావచ్చు కదా అంటూ హైపర్ ఆది మాట్లాడటంతో ఒక్కసారిగా ఇంద్రజ తలదించుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అవుతుంది అయితే హైపర్ ఆది ఇంద్రజ గారి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది సానుకూలంగా స్పందిస్తూ కామెంట్లు చేయగా మరికొందరు సీనియర్ నటి అయిన ఇంద్రజను పట్టుకొని నైటీలో రావచ్చు కదా అంటూ మాట్లాడటం ఏంటి అంటూ విమర్శలు కురిపిస్తున్నారు .

Advertisement

ఇకపోతే ఈ ఏ ఐ ద్వారా హైపర్ ఆది ఒకవేళ ఇండస్ట్రీలోకి రాకపోయి ఉంటే ఏం చేసేవారు అని అడగగా ఏకంగా బాడీ మసాజ్ సెంటర్ పెట్టుకొని బ్రతికేవారు అంటూ ఏ ఐ ఫోటో రివిల్ చేశారు. ఈ ఫోటో చూసిన హైపర్ ఆది నాకు అలాంటి జాబ్ వస్తే ఇప్పుడే వెళ్లిపోతాను అంటూ కామెంట్లు చేయడం గమనార్హం. ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ కార్యక్రమంలో ఎప్పటిలాగే బుల్లితెర నటీనటులతో పాటు జబర్దస్త్ కమెడియన్లు కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. ఇక హైపర్ ఆది ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూనే మరోవైపు వెండితెర సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: సల్మాన్ ఖాన్ వంశీ పైడిపల్లి మూవీ అప్డేట్… రేపే పూజ కార్యక్రమం.. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×