E-Paper
Advertisement

Hyper Aadi: హైపర్ ఆది లవ్ స్టోరీ విన్నారా.. ఆ ఒక్క కారణంతోనే బ్రేకప్?

Hyper Aadi: హైపర్ ఆది లవ్ స్టోరీ విన్నారా.. ఆ ఒక్క కారణంతోనే బ్రేకప్?
Advertisement

Hyper Aadi : హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ షో(Jabardasth Show)లో కమెడియన్ గా కొనసాగుతూ అనంతరం టీం లీడర్ గా మారి తన కామెడీ పంచ్ డైలాగులు ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. జబర్దస్త్ కమెడియన్ గా కొనసాగుతూ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న ఆది ప్రస్తుతం జబర్దస్త్ కు దూరమైన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంతో పాటు ఢీ కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇక బుల్లితెర కార్యక్రమాలలో కూడా ఆది పాల్గొంటూ తనదైన శైలిలోనే వినోదాన్ని అందిస్తున్నారు.

బీటెక్ లవ్ స్టోరీ..

ఇదిలా ఉండగా తాజాగా హైపర్ ఆది ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజాగా ఇంటర్వ్యూకి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు. ఇందులో భాగంగా హైపర్ ఆది తన లవ్ స్టోరీ గురించి పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడారు.. ఈ సందర్భంగా హైపర్ ఆది లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ తనకు కూడా ఒక లవ్ స్టోరీ ఉందని తెలియజేశారు. బీటెక్ చదువుతున్న సమయంలో తాను ఒక అమ్మాయిని ప్రేమించానని, అయితే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాను కాకపోతే బీటెక్ అయిపోగానే ఆ అమ్మాయికి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసి పంపించారు. ప్రస్తుతం ఆ అమ్మాయి విదేశాలలో తన భర్త పిల్లలతో చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

జాబ్ లేకపోవటమే కారణమా..

Advertisement

అమ్మాయికి బీటెక్ అయిపోగానే పెళ్లి చేశారు ఆ సమయంలో నాకు ఎలాంటి జాబ్ లేకపోవటం వల్లే మేమిద్దరం పెళ్లి చేసుకోలేకపోయాము అంటూ ఆది ఈ సందర్భంగా తన లవ్ స్టోరీ గురించి తెలియజేశారు. అయితే అమ్మాయి ఎవరు ఏంటి అనే విషయాలు తెలియాలి అంటే పూర్తి ఇంటర్వ్యూ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక రాజకీయాల పరంగా కూడా ఆది ఎంతో యాక్టివ్ గా ఉంటూ అవకాశం దొరికిన ప్రతిసారి రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రాజకీయాల గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.

రాజకీయం అంటే పవన్ కళ్యాణ్..

Advertisement

రాజకీయాల గురించి హైపర్ ఆది మాట్లాడుతూ నాకు తెలిసిన రాజకీయం అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని తెలియజేశారు. హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే సంగతి మనకు తెలిసిందే. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కోసం హైపర్ ఆది పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. ఒకానొక దశలో ఈయన కూడా రాజకీయాలలోకి వెళ్తారని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని వార్తలు కూడా బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఆది రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ సినిమాలలోను బుల్లితెర కార్యక్రమాలలోనూ కమెడియన్ గా కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక హైపర్ ఆది కామెడీకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: Bigg Boss 9 Telugu promo: రీతూ లేకపోవడంతో హ్యాపీగా పవన్.. గేమ్ కోసమే రీతూతో క్లోజ్?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×