E-Paper
Advertisement

Hyper Aadi: “ఐడియల్ భర్త”.. అలాంటి లక్షణాలు కావాలంటున్న హైపర్ ఆది!

Hyper Aadi: “ఐడియల్ భర్త”.. అలాంటి లక్షణాలు కావాలంటున్న హైపర్ ఆది!
Advertisement

Hyper Aadi: కామెడీకి మాత్రమే కాదు పంచ్ డైలాగ్ లకు కేరాఫ్ అడ్రస్ హైపర్ ఆది(Hyper aadi). ఎదురుగా ఉన్నది ఎంత పెద్ద స్టార్ అయినా సరే పట్టించుకోకుండా తన మాటలతో పంచులు విసురుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అంతేకాదు అప్పుడప్పుడు ఆయన చేసే కామెంట్ల వల్ల ఇబ్బందుల్లో కూడా పడుతున్న విషయం తెలిసిందే. అలాంటి హైపర్ ఆది బుల్లితెర నుంచి వెండితెర వరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం వరుస టీవీ షోలు, సినిమాలతో బిజీగా మారిన ఈయన తాజాగా యాంకర్ వర్ష హోస్టింగ్ చేస్తున్న “కిస్సిక్ టాక్స్” కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇందులో భాగంగానే వ్యక్తిగత జీవితం, కుటుంబం, ప్రేమ, పెళ్లిపై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

అది చాలా స్వచ్ఛమైన ప్రేమ..

ఇంటర్వ్యూలో భాగంగా ప్రేమ గురించి మాట్లాడుతూ.. “ఇప్పుడు ఉన్న ప్రేమలు ఏంటో ఎవరికి అర్థం కాదు. ముఖ్యంగా నాకైతే అసలుకే అర్థం కాదు. మేము స్కూల్ డేస్ లో చదువుకునేటప్పుడు ప్రేమ అంటే కేవలం చూపుల్లో మాత్రమే ఉండేది. ఒక అమ్మాయి మనల్ని చూస్తోందా లేదా అని చూసుకోవడం.. మరుసటి రోజు ఇంకో చోట కూడా అదే అమ్మాయి మన వైపే చూస్తోందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడం.. ఇక అంతే. అదే ప్రేమ. మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు.. ఒక రకంగా చెప్పాలి అంటే అది చాలా స్వచ్ఛమైన ప్రేమ” అంటూ ప్రేమపై తనకున్న అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.

ఐడియల్ భర్త లక్షణాలు ఉన్నప్పుడే పెళ్లి..

Advertisement

ఇదే ఇంటర్వ్యూలో ఆయన పెళ్లి గురించి మాట్లాడుతూ..” ఈ మధ్యకాలంలో జరుగుతున్న విషయాలు చూస్తే.. పెళ్లి అంటేనే భయం వేస్తోంది. పెళ్లి అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు కలవడం కాదు.. చాలా బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిలు కోరుకునే ఐడియల్ భర్త లక్షణాలను నేను కలిగి ఉన్నప్పుడే వివాహం గురించి ఆలోచిస్తాను అంటూ తెలిపారు. ఆది మాట్లాడుతూ..” కోపాన్ని కంట్రోల్ చేసుకునేవాడు.. బయట టెన్షన్ లను ఇంట్లోకి తీసుకురానివాడు.. డబ్బు విషయంపై అత్తమామలపై ఆధారపడని వాడు.. ఓపికగా ఉండేవాడు.. తానే సంపాదించేవాడు.. అమ్మానాన్నలను వదిలి నీతో జీవించడానికి వచ్చిన అమ్మాయికి తల్లిదండ్రుల ప్రేమ ఇచ్చేవాడు.. భార్య ఏం చేసినా సరే భరించే వ్యక్తి మాత్రమే పెళ్లి చేసుకోవాలి” అంటూ తనకు ప్రస్తుతం ఆ లక్షణాలు లేవని ఆ లక్షణాలు వచ్చినప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తానని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హైపర్ ఆది.

పెళ్లికి విలువ లేకుండా పోతోంది..

ముందు చేసుకున్న వ్యక్తితోనే జీవితాంతం ఉండాలనే భావన ఒకప్పుడు ఉండేది.. అయితే ఇప్పుడు ఈ జనరేషన్లో పెళ్లికి విలువ లేకుండా పోతోంది. చిన్న విషయానికి కూడా విడాకులు తీసుకుంటున్నారు. అందుకే పెళ్లి విషయంలో చాలా జాగ్రత్త పడాలి అంటూ తెలిపారు.

Advertisement

also read:Harsha Vardhan: మందుబాబులకు హర్షవర్ధన్ అలెర్ట్.. ఏం చెబుతున్నారంటే?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×