E-Paper
Advertisement

Horoscope  Today March 20th: ఆ రాశి వారికి మొండి బాకీలు వసూలు అవుతాయి – సంఘంలో ప్రముఖులతో పరిచయాలు   

Horoscope  Today March 20th: ఆ రాశి వారికి మొండి బాకీలు వసూలు అవుతాయి – సంఘంలో ప్రముఖులతో పరిచయాలు   
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మార్చి 20న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఇంట్లో సంతాన శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

Advertisement

వృషభం: ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. జీవిత భాగస్వామితో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో భాగస్థుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

మిధునం: ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

Advertisement

కర్కాటకం: విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధు మిత్రుల నుండి నూతన విషయాలు సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.

సింహం: వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు అధికారులతో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయట కొద్దిపాటి సమస్యలు తప్పవు.

కన్య: కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు చెయ్యడం మంచిది. ఇతరులకు ధన పరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు.

తుల: మొండి బాకీలు వసూలవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు  విస్తృతమవుతాయి. సన్నిహితులతో విందు, వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి. పాత రుణాలు కొన్ని తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృశ్చికం: కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు కొంత ఆశ్చర్య పరుస్తాయి. చాలకాలంగా పూర్తికానీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ధనస్సు: సన్నిహితులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వృత్తి, వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలున్నవి.

మకరం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడుతాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు పెరుగుతాయి. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందక ఇబ్బంది పడతారు.

కుంభం: చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. బంధు మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.

మీనం: కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో  పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×