E-Paper
Advertisement

Chamanthi Serial : ‘చామంతి’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. హీరో అవుట్..

Chamanthi Serial : ‘చామంతి’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. హీరో అవుట్..
Advertisement

Chamanthi Serial : ప్రముఖ తెలుగు ఛానల్ జీ తెలుగులో ప్రసారం అవుతున్న సీరియల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. డిఫరెంట్ స్టోరీ తో రావడంతో పాటుగా ఎక్కువగా గ్రాఫిక్స్ కూడా ఉండడంతో జనాలు వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. ఈ ఛానల్ లో ప్రసారం పోతున్న ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంటున్నాయి. అందులో రీసెంట్ గా ప్రారంభమైన చామంతి సీరియల్ కూడా ఒకటి.. కేవలం ఈ సీరియల్ మొదలైన అతి కొద్ది రోజుల్లోనే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ సీరియల్ లో హీరోగా నటిస్తున్న ప్రేమ్ ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే ప్రేమ్ ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నాడా? అందుకు కారణం ఏంటి అన్నది ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

సీరియల్ కు ప్రేమ్ గుడ్ బై..

జీ తెలుగులో ప్రసారమవుతున్న సక్సెస్ఫుల్ సీరియల్స్లలో చామంతి సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ లో హీరోగా నటిస్తున్న ప్రేమ్ కుమార్ అసలు పేరు ఆశిష్ చక్రవర్తి. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో పలు సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు అయితే.. చామంతి సీరియల్ నుంచి ఈ హీరో తప్పుకుంటున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. త్వరలోనే బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ యాక్టర్ అప్పును పెళ్లి చేసుకోబోతున్నాడు.. ఈ క్రమంలో ఈయన సీరియల్ కి కాస్త గ్యాప్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Also Read :పవన్ కళ్యాణ్ పై రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్.. అకీరా చెయ్యి విరిగింది..

ఆశిష్ చక్రవర్తి రియల్ లైఫ్..

ఆశిష్ చక్రవర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈయన తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు.. తమిళ ఇండస్ట్రీలో పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు ఈ కుర్ర హీరో.. ఈయన సీరియల్స్ లోకి రాకముందు బాడీ బిల్డర్ గా జిమ్ ట్రైనర్ గా పని చేశారని తెలుస్తుంది.. మిస్టర్ మద్రాస్ 2018, మిస్టర్ ఇండియా చెన్నై 2017, మిస్టర్ ఇండియా బెస్ట్ స్కిన్ 2017, మిస్టర్ చెన్నై ఇంటర్నేషనల్ 2019 టైటిల్స్‌ని గెలిచాడు.. తర్వాత సీరియస్లలో నటించే అవకాశం రావడంతో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా మారడు.. జీ తెలుగులో చామంతి సీరియల్ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సీరియల్ గాను ఈయనకు రోజుకు రోజుకు 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అంతే కాదు మరోవైపు జిమ్ ని కూడా నడుపుతూ బాగానే సంపాదిస్తున్నాడు.. ఈ హీరో గనుక సీరియల్ నుంచి తప్పుకుంటే ఈయన ప్లేసులో ఏ హీరో వస్తాడో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×