E-Paper
Advertisement

Kissik Talks Promo: గుర్తింపు కోసం రెండు దశాబ్దాల పోరాటం.. హరిత జీవితంలో తీరని విషాదం!

Kissik Talks Promo: గుర్తింపు కోసం రెండు దశాబ్దాల పోరాటం.. హరిత జీవితంలో తీరని విషాదం!
Advertisement

Kissik Talks Promo: బుల్లితెర రాజమాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రముఖ సీరియల్ నటీమణి హరిత తోట (Haritha thota) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె అటు వాణిజ్య ప్రకటనలలో కనిపిస్తూ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యింది. అటు సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్ గా కూడా పేరు దక్కించుకున్న హరిత.. ఈ మధ్యకాలంలో పలు టీవీ షోలలో కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే.అందులో భాగంగానే తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్నో విషయాలను పంచుకున్న ఆమె.. తన గుర్తింపు కోసం ఏకంగా రెండు దశాబ్దాల పాటు పోరాడాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

గుర్తింపు కోసం రెండు దశాబ్దాల పోరాటం..

ఇంటర్వ్యూలో భాగంగా ..మీ అన్న, చెల్లి, మీరు అందరూ నటీనటులే కదా.. మేకప్ బాక్స్ లు పట్టుకొని తిరిగేస్తారా అని సరదాగా హోస్ట్ వర్ష (Varsha) అడగగా.. సీరియల్స్ కదా మూటలు మూటలే అంటూ తనదైన స్టైల్ లో నవ్వించింది హరిత. ఇక ఇన్ని పేర్లు ఉండగా “ఘట్టమనేని అఖిలాండేశ్వరి” పేరు మీకు బాగా ముద్ర పడిపోయింది. అని వర్షా చెప్పగా.. హరిత మాట్లాడుతూ.. 2019లో ముద్దమందారం సీరియల్ క్లైమాక్స్ అయిపోయింది. ఈరోజుకి నేను బయటకు వెళ్తే.. అఖిలాండేశ్వరి గానే పిలుస్తారు అంటూ తన గుర్తింపును గొప్పగా చెప్పుకుంది హరిత. అయితే ఇండస్ట్రీలోకి నటిగా అడుగు పెట్టాను.. నటిస్తున్నాను అని అనుకునేదాన్ని.. నాకు సక్సెస్ గురించి, ఫేమ్ గురించి పెద్దగా తెలియదు.. అనుభవం కూడా లేదు.. అయితే ఈ అఖిలాండేశ్వరి గుర్తింపు వెనుక రెండు దశాబ్దాల ప్రయాణం ఉంది అంటూ చెప్పి ఎమోషనల్ అయింది హరిత.

సక్సెస్ ఏంటో తెలియదు అంటూ హరిత ఎమోషనల్..

Advertisement

దాదాపు 20 సంవత్సరాల పాటు నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం లభించింది అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకరికి ఒకరోజు గుర్తింపు వస్తుంది.. ఒకరికి పదేళ్లకు గుర్తింపు వస్తుంది.. కానీ నా గుర్తింపుకి 20 ఏళ్లు పట్టింది. చదువుకొని రాసిన తర్వాత మార్కులు రాకపోతే కష్టపడి రాసాం కాబట్టి అడిగే హక్కు ఉంటుంది.. కానీ మనం చేసేది చదివి రాసేది కాదు కదా.. అంటూ తెలిపింది. ఇకపోతే ఈ ఒక్క గుర్తింపు కోసం ఆమె పడ్డ కష్టం చూసి అందరూ చలించిపోతున్నారు. ముద్దమందారం సీరియల్ లో అఖిలాండేశ్వరి పాత్రతో ఒదిగిపోయింది హరిత అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఇదే ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంపై, తన వైవాహిక జీవితం పై పలు విషయాలు పంచుకొని అందరిని ఆశ్చర్యపరిచింది హరిత. ఇక అలాగే నేటి సమాజంపై ఊహించని కామెంట్లు చేసిన హరిత తన కొడుకైనా.. తన చెల్లితో మాట్లాడాలంటే 10 అడుగుల దూరం పాటించాల్సిందే అంటూ కూడా చెప్పుకొచ్చింది.

 

Advertisement

also read: Rashmika mandanna: రికార్డ్ సృష్టించిన రష్మిక.. కోహ్లీ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ!

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×