E-Paper
Advertisement

Kissik Talks Promo: ప్రేమ, పెళ్లి, విడాకులు.. అమ్మాయిలు అలా ఉండకూడదు: హరిత

Kissik Talks Promo: ప్రేమ, పెళ్లి, విడాకులు.. అమ్మాయిలు అలా ఉండకూడదు: హరిత
Advertisement

Kissik Talks Promo: ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమం ఏ రేంజ్ లో గుర్తింపు సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 50 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో.. 51వ ఎపిసోడ్ కి సంబంధించిన తాజా ప్రోమోని నిర్వహకులు విడుదల చేశారు.ఇందులో బుల్లితెర ప్రముఖ నటీమనిగా గుర్తింపు తెచ్చుకొని.. ఘట్టమనేని అఖిలాండేశ్వరి పాత్రతో ఊహించని ఇమేజ్ అందుకున్న హరిత తోట గెస్ట్ గా విచ్చేశారు. ఇక ఇందులో ఎన్నో విషయాలు పంచుకున్న ఆమె ముఖ్యంగా సమాజంలో ఆడపిల్లలు ఎలా ఉండాలి? అనే విషయంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అమ్మాయిలు అంటే అలాగే ఉండాలి..

ప్రస్తుత జనరేషన్లో అప్పుడే ప్రేమ , పెళ్లి, పిల్లలు , డివోర్స్ అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి ? అని వర్షా ప్రశ్నించగా హరిత మాట్లాడుతూ..” నాకు ఇదే అలవాటు.. మా ఇంట్లో అలాగే ఉండేదాన్ని.. నేను ఇంతే.. అనే మాటలు అమ్మాయిలు మాట్లాడకూడదు. ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. గొడవ పడినా తెగేదాకా తాడు తెంపకూడదు.. మా వివాహం జరిగి ఈ ఏడాది ఆగస్టుకు 25 సంవత్సరాలవుతుంది. గొడవపడి గడపదాటిన రోజు ఏ రోజు లేదు. పైగా నా ఇంట్లో కూడా నాకు ఎవరూ సపోర్ట్ చేయలేదు. నీ ఇష్టం.. నీ ఇల్లు .. మధ్యలో నాకేంటి? అని.. ఎవరూ కూడా నాకు అండగా నిలబడలేదు. ఇక భర్త గురించి బయట తప్పుగా చెప్పినా పరువు పోయేది ఎవరిది.. భార్యదే కదా. భర్త గౌరవం ఎప్పుడూ భార్యలోనే ఉంటుంది. భర్త గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా భార్యదే.. అంటూ అమ్మాయిలు ఎక్కడ ఎలా ఉండాలో చెప్పి అందరికీ ఒక జ్ఞానోదయం కలిగించింది హరిత.

రిలేషన్షిప్ పై హరిత కామెంట్..

Advertisement

అలాగే ఈ మధ్యకాలంలో ఉన్న రిలేషన్షిప్ గురించి హరిత మాట్లాడుతూ.. భార్య అంటే ఇలాగే ఉండాలి.. గర్ల్ ఫ్రెండ్ ఎలాగైనా ఉండొచ్చు.. కానీ గర్ల్ ఫ్రెండ్ భార్యగా మారింది అంటే భార్య ఎలా ఉండాలో అలాగే ఉండాలి. నేను అప్పుడు నచ్చాను ఇప్పుడు ఎందుకు నచ్చలేదు అనే క్వశ్చన్ మాత్రం చేయకూడదు పెళ్లయ్యాక నువ్వు భార్యవి.. ఆయనకు గర్ల్ ఫ్రెండ్ కాదు కదా” అంటూ తెలిపింది.

నా కొడుకు అయినా సరే అది అడుగులు దూరం ఉండాల్సిందే..

ఇక ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల్ని ఫిజికల్ గా ఇబ్బంది పెట్టి చంపేస్తున్నారు.. ఇంటి నుంచి ఆడపిల్లల పట్ల గౌరవం మొదలవ్వాలి అనేది వాస్తవం కదా.. మీరేమంటారు అని వర్ష అడగగా..” నా ఇంట్లో నా కొడుకు అయినా సరే తన చెల్లితో మాట్లాడాలి అంటే పది అడుగుల దూరం పాటించాల్సిందే. అది గొడవ పడినా.. మాట్లాడినా సరే.. నా కూతుర్ని ముట్టుకోవాలన్నా సరే నా కొడుకు పది అడుగుల దూరం ఉండాల్సిందే.. కొట్టాలన్నంత ఆవేశం వచ్చినా సరే 10 అడుగుల దూరం ఉండాల్సిందే. ఆడపిల్ల అంటే ఎందుకూ పనికిరానిది కాదు.. నువ్వు పూజించడానికి ” అంటూ ఆడపిల్లలపై సమాజం చూస్తున్న తీరు గురించి.. చూడాల్సిన తీరు గురించి చెప్పి ఆకట్టుకున్నారు..

Advertisement

also read : Kissik Talks Promo: గుర్తింపు కోసం రెండు దశాబ్దాల పోరాటం.. హరిత జీవితంలో తీరని విషాదం!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×