E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today Episode: మనోజ్ జాబ్ గురించి నిజం తెలుసుకున్న రోహిణి.. శృతితో రవి పెళ్లి?

Gundeninda GudiGantalu Today Episode: మనోజ్ జాబ్ గురించి నిజం తెలుసుకున్న రోహిణి.. శృతితో రవి పెళ్లి?
Advertisement

Gundeninda GudiGantalu Today Episode: నిన్నటి ఎపిసోడ్ లో రవి పనిచేస్తున్న రెస్టారెంట్ కు శృతి వెళ్తుంది. రవిని నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అని నిలదీస్తుంది. చేస్తున్నానని రవి ఆమెకు బదులిస్తాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని శృతి అంటుంది. నువ్వు డిసైడ్ అయ్యావా లేదా అని రవిని అడుగుతుంది.. రేపటి వరకు నీకు టైమ్ ఇస్తున్నాను. అప్పటిలోగా నువ్వు సమాధానం చెప్పకపోతే నేను తీసుకునే నిర్ణయానికి నువ్వు జీవితాంతం బాధపడతావని రవికి డెడ్‌లైన్ ఇచ్చి శృతి వెళ్లిపోతుంది.. ఇక మనోజ్ ఇంటికి వచ్చి కుపన్స్ అని చెబుతాడు. జాబ్‌లేకుండా కూపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయని కొడుకును పక్కకు తీసుకెళ్లి నిలదీస్తుంది. ఓ జాబ్‌ ఇంటర్వ్యూకు వెళ్లానని వారు కూపన్స్ ఇచ్చారని తల్లి దగ్గర మనోజ్‌ అబద్దం ఆడతాడు. మనోజ్ మాటలను బాలు వింటాడు. ఈ ఉద్యోగం కూడా రాలేదా అని మనోజ్‌పై సెటైర్స్ వేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి. మనోజ్ ఉద్యోగం గురించి రోహిణికి తెలిసిపోతుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. మనోజ్ జాబ్ చేస్తున్నట్లుగా భార్యను నమ్మించడానికి పార్క్‌లో దొరికిన కూపన్స్‌ను రోహిణికి చూపిస్తాడు. ఏంటండీ ఇంతకన్నా బెటర్ జాబ్ వచ్చిందా అని అంటుంది. షాపింగ్ చేసుకోవడానికి కుపన్స్ ఇచ్చారు అంటాడు. అప్పుడే అక్కడికి ప్రభావతి వస్తుంది. మనోజ్‌ అబద్ధాన్ని ప్రభావతి కనిపెడుతుంది. రోహిణిని పక్కకు పంపించి జాబ్ లేకుండా కూపన్స్ఎక్కడి నుంచి తెచ్చావని కొడుకును నిలదీస్తుంది. ఓ జాబ్ ఇంటర్వ్యూకు వెళ్లానని, తనకు నాలుగు డిగ్రీలు ఉండటంతో జాబ్ ఇవ్వలేమని చెప్పి ఈ కూపన్స్ ఇచ్చారని తల్లికి కూడా అబద్ధం చెబుతాడు మనోజ్. అప్పుడే అక్కడకు బాలు వస్తాడు. ఏంట్రా ఈ జాబ్ కూడా రాలేదా అని సెటైర్ వేస్తాడు. ఇంతకన్నా బెస్ట్ ది వస్తుందని కవర్ చేస్తారు.. తల్లీ కొడుకులు.. జాబ్ పోలేదని, ఇంతకంటే బెటర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నానని కవర్ చేస్తాడు మనోజ్. ఇంతకంటే బెటర్ జాబ్ అంటే గుడి ముందు కూర్చొని అడుక్కోవడమే అంటూ మనోజ్‌పై సెటైర్లు వేస్తాడు బాలు..

Advertisement

దానికి ప్రభావతి నువ్వు జీవితాంతం చక్రాలు తిప్పుతూ డ్రైవర్ గానే ఉండాలి అంటుంది. మనోజ్ తల్చుకుంటే నీ కంటే పెద్ద కారు కొనగలడని కొడుకును మనోజ్‌ను సపోర్ట్ చేస్తుంది ప్రభావతి. కష్టపడి మనోజ్‌ ఈ కూపన్స్ తెచ్చుకున్నాడని రోహిణి కూడా అంటుంది. ఆ కూపన్స్‌తో ఇంటిల్లిపాది అందరం బట్టలు కొందామని సత్యం అంటాడు. బాలు, మీనాకు ఎందుకు అంటుంది ప్రభావతి.. దానికి సత్యం వాడి కష్టంతోనే ఇంటిల్లి పాది తినట్లేదు అంటాడు. ఇకపోతే రేపు షాపింగ్‌కు రమ్మంటే రవి రానని అంటాడు. శృతి చెప్పిన మాటల గురించే ఆలోచిస్తుంటాడు. అన్నయ్య ఇచ్చిన వార్నింగ్‌కు భయపడి శృతి ఎన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయడు. దాంతో లవ్ చేసేటప్పుడు ఉన్న ధైర్యం సమస్య వచ్చినప్పుడు ఎందుకు లేదని, పెళ్లి చేసుకునేంత ధైర్యం లేనప్పుడు తనను ఎందుకు ప్రేమించావని రవికి మెసేజ్ పెడుతుంది శృతి..

ఇక శృతి, సంజు కారులో షాపింగ్ కు వెళ్తారు. ప్రభావతి ఫ్యామిలీ మొత్తం షాపింగ్‌కు బయలుదేరుతారు. బాలు కారు షేర్ ఆటోలా ఉందని ప్రభావతి సెటైర్లు వేస్తుంది. ఇంతకుముందు మనోజ్ కారు చాలా పెద్దగా ఉండేదని అంటుంది. ఇప్పుడు ఆ కారు ఏమైందో చెప్పాలని బాలు పట్టుపట్టడంతో ప్రభావతి, మనోజ్ కంగారుపడతారు. మనోజ్‌కు కలర్ కలిసిరాకపోవడంతో అమ్మేశాడని ప్రభావతి అబద్ధం ఆడుతుంది. డబ్బావతి అసలు నిజం ఏంటని పార్లర్ అమ్మ అడుగుతుంది అని చెబుతాడు బాలు.. ఏదో కవర్ చేసి లోపలికి వెళ్తారు. ఇక అప్పుడే శృతి, సంజు తో పాటు రవి వెళ్తాడు.

Advertisement

అందరు చీరలను చూస్తారు. చీరల సెలెక్షన్‌లో మీనాపై ప్రభావతి వివక్ష చూపించడం బాలు సహించలేకపోతాడు. ఇద్దరు కోడళ్లకు ఒకే రకమైన చీరలు సెలెక్ట్ చేస్తే బాగుంటుందని అంటాడు. షాపింగ్ మాల్‌లో ప్రభావతితో బాలు ఆర్గ్యూ చేయడం రోహిణి సహించలేకపోతుంది. దానికి బాలు సెటైర్ వేస్తాడు. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలియని అడివి మనుషులు అంటూ బాలు, మీనాలను రోహిణి అవమానిస్తుంది. నా భర్త కష్టంతోనే షాపింగ్ చేస్తున్నట్లు, ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే రకం మేము కాదని రోహిణికి సమాధానమిస్తుంది మీనా. ఇక బాలు రవి వెళ్తుంటే ఏ నల్లభీమా ఎక్కడికి వెళ్తున్నావ్ అంటాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×