E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Arun : ‘ గుండెనిండా గుడిగంటలు’ అరుణ్ రియల్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Gundeninda Gudigantalu Arun : ‘ గుండెనిండా గుడిగంటలు’ అరుణ్ రియల్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
Advertisement

Gundeninda Gudigantalu Arun : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముందు వరుసలో ఉంది. ఈ సీరియల్ గురించి ఇందులో నటిస్తున్న హీరో హీరోయిన్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.. ప్రతిరోజు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే స్టార్ మాలో ప్రసారం అవుతుంది.. ఈ సీరియల్లో ఇప్పటికే ఎంతోమంది కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్ గా హీరోయిన్ మీనాకు చెల్లెలుగా నటిస్తున్న సుమతికి జోడి కోసం అరుణ్ క్యారెక్టర్ ఎంటర్ అయింది.. ట్రాఫిక్ కానిస్టేబుల్ గా బాలు తో గొడవ పెట్టుకుంటున్న అరుణ్ గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.. మరి ఈ అరుణ్ ఎవరు? ఈయన గతంలో ఏ సీరియల్స్లలో నటించారు? ప్రస్తుతం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

అరుణ్ రియల్ లైఫ్..

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో రీసెంట్గా కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ పాత్రలో ఒక నటుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. సీరియల్ లో హీరోగా నటిస్తున్న బాలు కి ప్రత్యర్థి పాత్రలో కనిపిస్తాడు. బాలు పై రివెంజ్ తీసుకునేలా ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో బాలు తో గొడవ కూడా పడతాడు.. అలాంటి అరుణ్ రియల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. నిజానికి ఈ అరుణ్ అసలు పేరు వెంకట్ భూమి రెడ్డి. ఈయన తెలుగు నటుడే. గతంలో అనేక సీరియస్లలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఒక్కో సీరియల్ తో తన టాలెంట్ నిరూపించుకుంటూ వచ్చిన ఈ అరుణ్ ఇప్పుడు గుండె నిండా గుడి గంటలు సీరియల్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరిస్తున్నాడు..

వెంకట్ భూమి రెడ్డి ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Advertisement

సీరియల్ నటుడు అరుణ్ రియల్ లైఫ్ విషయానికి వస్తే.. ఈయన రాయలసీమ కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఈయన చదువు మొత్తం హైదరాబాదులోనే పూర్తి చేశాడు.. గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసిన వెంకట్ నటనపై ఆసక్తితో అటుగా అడుగులు వేశాడు. మొదట షార్ట్ ఫిలింలో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమైన నా పేరు మీనాక్షి అనే సీరియల్ తో ప్రేక్షకులకు నటుడిగా పరిచయం అయ్యాడు. ఒక్కో సీరియల్ తో తన టాలెంట్ నిరూపించుకుంటూ.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.. పలు సీరియల్స్ లో నటించిన ఈయన ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో నటిస్తున్నాడు. ఈ సీరియల్ లో నటించినందుకు గాను ఒక్క రోజుకి దాదాపు 25 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ లెక్కన ఈయన నెలకు లక్షల్లోనే సంపాదిస్తున్నాడు.. సీరియల్ తో పాటుగా మరికొన్ని సీరియల్స్ వాళ్ళు కూడా నటిస్తున్నాడు వెంకట్.. అంతేకాదు సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×