E-Paper
Advertisement

GundeNinda GudiGantalu Today Episode : రవిని బాలు కొట్టిన విషయం తెలుసుకున్న శృతి.. మీనా కోసం టెన్షన్ పడుతున్న బాలు..

GundeNinda GudiGantalu Today Episode :  రవిని బాలు కొట్టిన విషయం తెలుసుకున్న శృతి.. మీనా కోసం టెన్షన్ పడుతున్న బాలు..
Advertisement

Gundeninda GudiGantalu Today Episode 25th :  నిన్నటి ఎపిసోడ్ లో.. శృతి తండ్రి వల్లే తాను తన కుటుంబానికి దూరమైనట్లు రవి ఆరోపిస్తాడు. పెళ్లి విషయంలో తొందరపడ్డామని అంటాడు. ఇక శృతి కూడా తగ్గేదేలే అని తన పేరెంట్స్ ను వెనకేసుకొని వస్తుంది. ఇక ఇద్దరు గొడవ పడతారు. శృతికి డబ్బింగ్ చెప్పడానికి అని బయటకు వెళ్తుంది. రవిని శృతితో పాటు చూసి సంజు షాకవుతాడు. ఇద్దరు కలిసే తనను జోకర్‌ను చేశారని అర్థం చేసుకుంటాడు. బకరాను చేసారు అని కోపంతో రగిలిపోతాడు. ఇక మీ ఇద్దరు ఎలా సంతోషంగా ఉంటారో చూస్తాను అని వారిద్దరినీ విడగొట్టే ప్రయత్నం చేస్తాడు.. బాలు మాట్లాడిన మాటలను మీనా వింటుంది. నేను చనిపోయిన తర్వాత అయినా మీరు నన్ను అర్థం చేసుకుంటారని నమ్ముతున్నానని బాలుతో అంటుంది మీనా.. ఇక రవిని బాలు రెస్టారెంట్ కు వచ్చిన విషయం తెలుసుకొని అక్కడకు వచ్చి బాలు రవిని కొడతాడు దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. మీనా, రవి ల వల్ల తన తండ్రి జైలుకు వెళ్లాడని బాలు ఫీల్ అవుతాడు. ఇక రాజేష్ తో కలిసి బార్ కు వెళ్తాడు. అక్కడ మందు తాగుతుంటే ఒక అతను తాను తిట్టినందుకు భార్య చనిపోయిందని ఫీల్ అవుతాడు. తన వల్ల భార్య ఉరివేసుకిందని చెప్తాడు. మై డియర్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోకండి. చేసుకున్నా పెళ్ళాలను తిట్టకండి అని అంటాడు. తిడితే చనిపోతారు. ఇందుమూలంగా నేను చెప్పేది ఏంటంటే భార్యలకు కోపం వచ్చినా మనమే తగ్గాలి మనకు కోపం వచ్చినా మనమే తగ్గాలి అంటాడు. అతని పక్కన ఉన్న అతను జోకులు వేస్తాడు. ఇక మీనాకు ఏమైందో అని టెన్షన్ పడతాడు. దానికి బాలు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అని రాజేష్ తో చెబుతాడు. మనిద్దరం తాగి ఉన్నాం కదా ఎవరు తీసుకెళ్తారు అంటే కార్తిక్ గాడి ఇల్లు పక్కనే తీసుకొని వెళదామని వెళ్తాడు.

Advertisement

తన ప్రేమ పెళ్లి కారణంగా తండ్రి సత్యంతో పాటు తన కుటుంబానికి ఎదురైన అవమానాలు, పడిన బాధలు గుర్తుచేసుకుంటూ రవి ఎమోషనల్ అవుతాడు. ఈ రోజు నుంచి నువ్వు ఎవరో…మేము ఎవరో అంటూ బాలు అన్న మాటలు అతడి మనసును మరింత బాధపెడతాయి. అప్పుడే డబ్బింగ్ స్టూడియో నుంచి ఇంటికొస్తుంది శృతి. వచ్చిరావడంతోనే రవిపై మాటలతో విరుచుకుపడుతుంది. తాను అలిగి స్టూడియోకు వెళ్లిపోయిన ఒక్క ఫోన్‌, మెసేజ్ కూడా చేయలేదు ఎందుకని రవిని అడుగుతుంది. కోపం తగ్గిన తర్వాత అయినా డబ్బింగ్ స్టూడియోకు వస్తావని నీ కోసం ఎదురుచూశానని అంటుంది. పెళ్లయితే ప్రేమ ఉండదని కోపంగా అంటుంది. ఇక రవి ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్లి ఫుడ్ తీసుకొస్తానని చెప్పి వెళ్తాడు. రెస్టారెంట్ లో అతను బాలు రవిని కొట్టిన విషయం తెలుసుకొని ఫీల్ అవుతుంది. ఇక మన దారి మనది అంటూ ఇద్దరు ఎమోషనల్ అవుతారు..

ఇక కారులో ఎక్కగానే ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు.. రాజేష్, బాలును కార్తిక్ తిడతాడు. నిద్రపోయిన బాలు..మీనా అంటూ కలవరిస్తాడు.మీనా ఎక్కడుందో, క్షేమంగా ఉందో లేదో తెలుసుకోవాలని అనుకుంటాడు. తాను ఫోన్ చేస్తే మీనా లిఫ్ట్ చేయదని భావిస్తాడు. తన స్నేహితుడు రాజేష్‌ను మీనాకు ఫోన్ చేయమని అంటాడు. ఇందాక బార్‌లో మాట్లాడిన వ్యక్తి మాటల్ని వింటుంటే ఏదో తేడా కొడుకుతుందని బాలు తన స్నేహితుడితో అంటాడు. బాలు టార్చర్ భరించలేక మీనాకు ఫోన్ చేస్తాడు రాజేష్‌. తాగిన మత్తులో ఏదేదో మాట్లాడుతాడు. అతడి చెంపపై గట్టిగా ఒక్కటి కొడతాడు బాలు. బాలు చెప్పినట్లు రాజేష్ ఫోన్ చేస్తాడు. ఇక మీనాకు ఫోన్ చేసి రివర్స్ గా మాట్లాడతాడు. మీనా మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తుంది. మీనా ఇంటికి తన ఫ్రెండ్స్ తో బాలు వెళ్తాడు.. వీరిందరి డైలాగులు కామెడీగా ఉంటాయి.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో బాలు తాగొచ్చిన విషయం సత్యం ఆడుతాడు. రవిని కొట్టి తాగానని చెబుతాడు. మనోజ్, రోహిణిని దారుణంగా కొడతాడు. సత్యం కు గుండెపోటు వస్తుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×