E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనాకు నిజం చెప్పిన బాలు..షాక్ లో శృతి.. దొంగ దొరికినట్లే..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు నిజం చెప్పిన బాలు..షాక్ లో శృతి.. దొంగ దొరికినట్లే..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 29th: నిన్నటి ఎపిసోడ్ లో.. మౌనిక విషయం గురించి బాధపడుతున్న బాలుని మీనా ఓదారుస్తుంది. వాడన్న మాటలకి మీరు కొట్టారు అంతేకానీ మీకు వాడి మీద ప్రత్యేకమైన పగ అయితే లేదు కదా అనేసి అంటుంది.. ఈ విషయం పక్కనపెడితే నగల గురించి ఏమనుకుంటున్నారు అని మీనా అడుగుతుంది.. ఇక నగలను ఎవరు దొంగతనం చేశారో తెలుసుకోవాలని బాలు చాలానే ప్రయత్నాలు చేస్తాడు. బాలు అనుమానమే నిజమవుతుంది.. మనోజ్ ఈ నగలని కొట్టేసాడని తెలుసుకుంటాడు.. ఎలాగైనా సరే ఈ నిజాన్ని వాడి నోటితోనే బయటకు రప్పించాలని అనుకుంటాడు.. దానికోసం నా దగ్గర అదిరిపోయే ప్లాన్ ఉందని అనుకుంటాడు.. బాలు బాబా ఇచ్చిన మంత్రించిన నిమ్మకాయ అని ఇంట్లో అందరిని నమ్మిస్తాడు. మనోజ్, ప్రభావతికి షాక్.. మరి మీనా కూడా షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా వంటగదిలో ఉంటే బాలు అక్కడికి వెళ్లి నీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు.. ఇంతకీ ఏ స్వామీజీ దగ్గరకి మీరు వెళ్లారు అని మీనా అడుగుతుంది.. బాలానంద స్వామి అని అంటాడు. ఈ బాలనంద స్వామి ఎవరు ఎక్కడ ఉంటారు అని మీనా అడుగుతుంది.. నీ ఎదురుగానే ఉన్నాడు కదా అతనే ఆ స్వామి అని అంటాడు.. ఏం మాట్లాడుతున్నారండి మీరు మాట్లాడేది మీకన్నా అర్థమవుతుందా అని మీనా అడుగుతుంది. ఏ స్వామీజీ లేడు ఆ మనోజ్ గాడు భయపడి ఇప్పటికే తడిసిపోతూ ఉంటాడు. అందుకే నేనే అలా చేశాను అని మీనాకు బాలు నిజం చెప్తాడు..

Advertisement

 మనోజ్, ప్రభావతి ఇద్దరూ బోకర్ నొకరు చూసుకుంటూ భయపడిపోతూ ఉంటారు. ఇంట్లోకి నిమ్మకాయ తెచ్చిపెట్టాడు కచ్చితంగా వాడు చెప్పినట్టు జరుగుతుందేమో.. మనమే ఆ నగలని దొంగలించామని బయటపడుతుందేమో అని ఇద్దరు టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే ఒకరికొకరు ముఖంలో మార్పులు రావడం గమనించి కంగారు పడతారు. నీ మూతి ఏంటి అలా అయిపోయింది అని మనోజ్ ప్రభావతిని అడుగుతాడు. అవునమ్మా నాకు కూడా అలానే అనిపిస్తుంది అని భయపడుతూ ఉంటారు. అప్పుడే రోహిణి వచ్చి అంతా మీ భ్రమ ఎప్పుడు గుడికి వెళ్ళని బాలు ఇలాంటివన్నీ చేస్తున్నాడు అంటే నమ్ముతారా అనేసి అడుగుతుంది. అయినా మీరేమీ కంగారు పడకండి అత్తయ్య మీరు వెళ్లి పడుకోండి అని ప్రభావతితో అంటుంది.

 ఇక రోహిణి మనోజ్ ని నువ్వు పిరికి వాడివి కాబట్టే నీ గురించి తెలుసుకొని మీ తమ్ముడు ఇలా చేశాడు. నువ్వు భయపడితే నీ అంతటి నువ్వే దొరికిపోతావు అని అంటుంది. ఇక రవి శృతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. శృతి నాకు కొంచెం భయంగా ఉంది అని అంటుంది. మనమేమీ ఆ నగలను కొట్టే లేదు కదా మనకెందుకు భయం అని రవి అంటాడు. కానీ ఇంట్లో జరుగుతున్న వాటిని చూస్తుంటే నాకు కాస్త భయంగానే ఉంది అని శృతి అంటుంది. తలుపు తీయగానే ఎదురుగా మీనా ఉంటుంది. రా మీనా నీ నగల గురించే మాట్లాడుకుంటున్నాము.. అన్నయ్య చెప్పినట్లు ఆ నిమ్మకాయ చాలా పవర్ఫుల్ అనుకుంటాను కచ్చితంగా దొంగ ఎవరో దొరుకుతారు అనేసి రవి అంటాడు.. నిజంగానే ఆ స్వామీజీ అంత పవర్ఫుల్ అమ్మినా అని శృతి అడుగుతుంది..

Advertisement

Also Read :

మీనా డోర్ వేసి మరి అసలు నిజాన్ని చెప్పేస్తుంది.. అవును ఇంట్రెస్టింగ్ అని శృతి అంటుంది. ఈ నగలు దొరికితే బాగుండు అని అంటారు. ఇకపోతే మనోజ్ తనకు ఏదో జరిగిపోతుందని రోహిణి లేపుతాడు. రోహిణి అంతా నీ భ్రమే అని చివాట్లు పెడుతుంది.. మనోజ్ విసిగించడంతో కిందకు వెళ్ళిపోతాడు. దేవుడు దగ్గర ఉన్న నిమ్మకాయను చూస్తుంటాడు. ప్రభావతి కూడా అక్కడకు వస్తుంది. ఇద్దరు అనుకోకుండా గుద్దుకుంటారు. ఒకరిపై మరొకరు నిజాలు చెప్పేసుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ మనోజ్ దొరికిపోతాడా? బాలు ఏం చేస్తాడో చూడాలి.. ఏది ఏమైనా కూడా సోమవారం ఎపిసోడ్ కాస్త ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తుంది.. మనోజ్ ప్రభావతిని ఇంట్లోంచి బయటకు గేంటెస్తారా అన్నది చూడాలి.. అదే జరిగితే సీరియల్ కు శుభం కార్డు పడినట్లే…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×