E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: గ్రాండ్ గా సుశీల బర్త్ డే.. బాలు ప్లాన్ సక్సెస్..బాలు, మీనాలకు స్పెషల్ గిఫ్ట్..

Gundeninda GudiGantalu Today episode: గ్రాండ్ గా సుశీల బర్త్ డే.. బాలు ప్లాన్ సక్సెస్..బాలు, మీనాలకు స్పెషల్ గిఫ్ట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు ఇంకా ఇంటికి రాలేదు కదా కేక్ కట్ చేయండి అని అంటుంది ప్రభావతి. ఇప్పుడే బాలు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి నీకు అంత సీన్ లేదు అని ఎగతాళి చేస్తాడు.. అయితే బాలు ఎక్కడికెళ్లావ్ రా నువ్వు? నీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను అని సుశీల బాధపడుతుంది. బామ్మ నీ కోసం నేను అదిరిపోయే సర్ప్రైజ్ తీసుకొచ్చాను. అందుకే లేట్ అయింది అని బాలు అంటాడు. తన చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలన్న సుశీల కోరికను బాలు తీరుస్తాడు. తన స్నేహితులను కలుసుకున్న ఆనందంలో సుశీల చాలా ఎమోషనల్ అవుతుంది. ఒక్కసారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. మిమ్మల్ని అందరిని మళ్లీ ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని సుశీల తన ఫ్రెండ్స్ తో కలిసి ఆనందంగా మాట్లాడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. అప్పటివరకు అందరూ ఇచ్చిన గిఫ్ట్ లతో పోలిస్తే బాలు చివరగా వచ్చి చిన్న గిఫ్ట్ కి సుశీల సంతోష పడడమే కాదు తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటుంది. తన స్నేహితులతో కలిసి తిరిగిన ఊరిని పాఠశాలని, వాళ్ల నలుగురు కలిసి చేసిన అల్లరి గుర్తు చేసుకుంటూ అందరూ చాలా సంతోషంగా ఉంటారు.. గతంలో ఎన్నడు లేని విధంగా సుశీల సంతోషంగా ఉండడం చేసిన సత్యం మా అమ్మ సంతోషాన్ని కారణమైన బాలుకి థాంక్స్ చెప్పాల్సిందే అని అంటాడు.

Advertisement

అసలు వీళ్ళ గురించి నీకు ఎవరు చెప్పారు రా అని సుశీల బాలుని అడుగుతుంది. మీనా చెప్పింది అని బాలు. పొద్దున మీరు చెప్పినప్పుడు నేను వీడియో తీసాను కదా అది ఆయనకు పంపించాను. మీ కోరికను ఎలాగైనా తీర్చాలని ఆయన ఇంత కష్టపడ్డాడు ఇంత ఆలస్యంగా వచ్చాడు అని మీనా అంటుంది. అలా బాలు బామ్మ చివరి కోరికను నెరవేర్చి పుట్టినరోజు నాడు ఎవరు ఊహించలేని విధంగా గిఫ్ట్ ఇస్తాడు. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా చోటు చేసుకుంటుంది. బామ్మ స్నేహితురాలైన సత్య కూడా ఎవరు ఊహించని విధంగా ఓ ట్విస్ట్ ఇస్తుంది. బామ్మ లవర్ గోపాలం ను బర్త్డే పార్టీకి తీసుకువస్తుంది..

అతని చూసిన సుశీల ఒకటే సిగ్గుపడుతుంది. ఇక ఆ గోపాలం కూడా ఏమైనా చూసి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సిగ్గు పడిపోతాడు. వీళ్ళ ఇద్దరిని చూసిన మిగతా వాళ్ళందరూ కూడా మీ వయసులో కూడా మీరు ఇంతగా మెలికలు తిరుగుతున్నారా అని అంటారు.. ప్రభావతి మాత్రం ఏంట్రా బాబు ఇది ఈ వయసులో ఈ సిగ్గేంటి ఇదేంటి అని అంటుంది. కేక్ కట్టింగ్ టైం అయింది పదండి కేక్ కట్ చేద్దాం అని రవి అంటాడు.. పద పద ముందు కేక్ కట్ చేసి ఆ తర్వాత మళ్లీ కాసేపు సరదాగా మాటలు మాట్లాడుకుందామని సుశీల ఫ్రెండ్స్ అంటారు.

Advertisement

Also Read : శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. ధీరజ్ గిఫ్ట్ కు ప్రేమ ఫిదా..విశ్వం ట్రాప్ లో అమూల్య..

తన చిన్ననాటి ఫ్రెండ్స్ ని కలుసుకున్న ఆనందంలో సుశీల చాలా సంతోషంగా కేక్ కట్ చేయడానికి వెళుతుంది. అయితే అక్కే కట్ చేసి అందరికీ పెట్టిన తర్వాత అత్తయ్య గారు మీరు ఇప్పుడు కేక్ కట్ చేసేసారు కదా పుట్టినరోజు వేడుకలు అయిపోయాయి కదా ఆ గిఫ్ట్ మీరు ఎవరికి ఇస్తున్నారు అని ప్రభావతి అడుగుతుంది. నా మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చిన బాలుకే నేను ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అని అంటుంది. నా చిన్ననాటి స్నేహితులందరినీ నా దగ్గరికి తీసుకొచ్చాడు నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే కారణం వాడే ఇది బాలు మీనాకే చెందుతుంది అని ఒక నెక్లెస్ బాక్స్ ఇస్తుంది. సత్యం అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే నువ్వు ఇవ్వాలనుకునే గిఫ్ట్ బాలుకి మాత్రమే చెందుతుంది అని అంటాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×