E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: సుశీలకు బిగ్ సర్ప్రైజ్.. గోపాలం ఎంట్రీతో సిగ్గు.. బాలు గిఫ్ట్ కు షీలా ఫిదా..

Gundeninda GudiGantalu Today episode: సుశీలకు బిగ్ సర్ప్రైజ్.. గోపాలం ఎంట్రీతో సిగ్గు.. బాలు గిఫ్ట్ కు షీలా ఫిదా..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. మౌనిక నిజంగానే గుడికి వెళ్లిందా అయితే ఏ గుడికి వెళ్ళింది అని అడుగుతాను అడుగుతాడు.. పూజలో ఉండి ఉంటుంది లేరా వస్తుందిలే అని ఎంత చెప్పినా సరే సంజయ్ మాత్రం ఏదో జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. మొత్తానికి స్వరాజ్యం సంజయ్ ని ఏదో ఒకటి కవర్ చేసి పంపిస్తుంది. ఇక మౌనిక సంజయ్ ఫోన్ చేయడం చూసి నేను వెళ్తాను మా ఆయన నేను భోజనం పెట్టకపోతే తినడు అని అంటుంది. ఇక మౌనిక నేను వెళ్తాను అని అంటే మీనా ఆపుతుంది.. అందరూ వెయిట్ చేస్తున్నారు మీరు కేక్ కటింగ్ చేయండి అని ప్రభావతి అంటుంది. నా ప్రతి ఒక్క పుట్టినరోజుకి బాలు ఉంటాడు ఈ పుట్టినరోజు కూడా వాడు లేకుండా నేను ఎలా చేసుకుంటానని అనుకుంటున్నారు అని సుశీల అంటుంది.

ప్రభావతి వాడిక వచ్చినట్టే తాగేసి ఎక్కడ పడుకున్నాడో ఏంటో అని అంటుంది. ఆ మాట వినగానే మీనా మీకు తెలుసా ఆయన తాగేసి పడుకున్నాడని మీకు తెలుసా అని అంటుంది. మీ గురించి నేను బయట పెడితే మీ తల ఎక్కడ పెట్టుకుంటారు అని మీనా ఆపేస్తుంది. అందరు సుశీల కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు ఇంకా రాలేదు కదా కేక్ కట్ చేయండి అని అంటుంది ప్రభావతి. ఇప్పుడే బాలు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి నీకు అంత సీన్ లేదు అని ఎగతాళి చేస్తాడు.. అయితే బాలు ఎక్కడికెళ్లావ్ రా నువ్వు? నీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను అని సుశీల బాధపడుతుంది. బామ్మ నీ కోసం నేను అదిరిపోయే సర్ప్రైజ్ తీసుకొచ్చాను. అందుకే లేట్ అయింది అని బాలు అంటాడు. తన చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలన్న సుశీల కోరికను బాలు తీరుస్తాడు. తన స్నేహితులను కలుసుకున్న ఆనందంలో సుశీల చాలా ఎమోషనల్ అవుతుంది. ఒక్కసారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. మిమ్మల్ని అందరిని మళ్లీ ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని సుశీల తన ఫ్రెండ్స్ తో కలిసి ఆనందంగా మాట్లాడుతుంది.

అసలు వీళ్ళ గురించి నీకు ఎవరు చెప్పారు రా అని సుశీల బాలుని అడుగుతుంది. మీనా చెప్పింది అని బాలు. పొద్దున మీరు చెప్పినప్పుడు నేను వీడియో తీసాను కదా అది ఆయనకు పంపించాను. మీ కోరికను ఎలాగైనా తీర్చాలని ఆయన ఇంత కష్టపడ్డాడు ఇంత ఆలస్యంగా వచ్చాడు అని మీనా అంటుంది. అలా బాలు బామ్మ చివరి కోరికను నెరవేర్చి పుట్టినరోజు నాడు ఎవరు ఊహించలేని విధంగా గిఫ్ట్ ఇస్తాడు. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా చోటు చేసుకుంటుంది. బామ్మ స్నేహితురాలైన సత్య కూడా ఎవరు ఊహించని విధంగా ఓ ట్విస్ట్ ఇస్తుంది. బామ్మ లవర్ గోపాలం ను బర్త్డే పార్టీకి తీసుకువస్తుంది..

Advertisement

సుశీల గోపాల మధ్య జరిగిన లవ్ స్టోరీ గురించి ఒకసారి గుర్తు చేసుకుని తెగ మురిసిపోతుంది. సత్యకు బావ అయినా గోపాలం సుశీలకు లైన్ వేసిన విషయాన్ని ఆ పార్టీలో బయటపెట్టి పార్టీ అంతా కలకలలాడేలా చేశారు. చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ ఆ లవ్ స్టోరీని కూడా సుశీల బయటపెట్టింది. ఇక అందరూ కూడా మీకు లవ్ స్టోరీ కూడా ఉందా బామ్మగారు అంటూ అనడంతో నాకు సిగ్గేస్తుంది అని సుశీల సిగ్గుపడుతుంది. ఇది కాస్త ఎపిసోడ్ కు హైలెట్ గా నిలుస్తుంది..

Also Read : గెటప్ శ్రీను, చంద్ర నిజ స్వరూపం ఇదే..జబర్దస్త్ లో నమ్మలేని నిజాలు..

మనందరం ఇలా కలుసుకోవాలని నువ్వు మా గురించి తలుచుకొని చాలా బాధపడుతున్నావని నీ మనవడు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మరి తీసుకొని వచ్చాడు. నీకోసమేమీ రాలేదు నీ మనవడు చాలా కష్టపడి మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు కాబట్టి వచ్చాము అని అందరూ అంటారు. అంటే మీరందరూ నాకోసం రాలేదన్నమాట అని అనగానే ఊరుకోవే సరదాగా అన్నామని ముగ్గురు స్నేహితులు కలిసి ఆట పట్టిస్తారు. మొత్తానికి సుశీల కోరికను బాలు తన పుట్టినరోజు నాడు తీర్చడంతో చాలా సంతోషంగా ఉంటుంది. బామ్మ సంతోషాన్ని చూసి ఇంట్లోని వాళ్ళందరూ కూడా సంతోషపడతారు.. ఇక అందరూ కలిసి సుశీల పుట్టినరోజు వేడుకను గ్రాండ్ గా చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×