E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: దొంగను పట్టుకొనేందుకు బాలు వేట.. నిజం చెప్పిన కల్పన.. బాలు దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Gundeninda GudiGantalu Today episode: దొంగను పట్టుకొనేందుకు బాలు వేట.. నిజం చెప్పిన కల్పన.. బాలు దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode May7th: విల్లా ఓనర్ వచ్చి మీరు మోసపోయారు అని తెలిసి కూడా ఇక్కడినుంచి బయటికి వెళ్లిపోండి.  ఇది నా ఇల్లు పోలీసులు కూడా వచ్చేసారు అని అతను చెప్పగానే పోలీసులు అప్పుడే ఎంట్రీ ఇస్తారు. చూడండి ఎస్ఐ గారు నా ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు వీళ్ళని మోసం చేశారట.. ఖాళీ చేయించమని చెప్పండి అని అతను చెప్పగానే పోలీసులు చెప్పిన మాట విని అందరూ కూడా ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతారు.. 30 లక్షలు అనవసరంగా పోగొట్టుకున్నామే అని బాధపడిపోతూ ఉంటారు.. సత్యం నీకు ఇంకా బుద్ధి రాదా రా ఎందుకు ఇలా చేస్తున్నావు అని మనోజ్ నీకు కొట్టబోతాడు.. కానీ రోహిణి వచ్చి అతని కొడితే అతనికి బుద్ధి వస్తుందా అని ఆపుతుంది.

దొంగల కోసం బాలు వేట..

మోసపోతున్నామని తెలిసి మళ్ళీ మోసపోతూనే ఉంటాడు. కొట్టిన కూడా బుద్ధి రాదు అని మనోజ్ తిడతాడు.. దాంతో బాలు నువ్వు అనవసరంగా తిట్టదు అని రోహిణి మధ్యలో సపోర్ట్ చేస్తుంది.. ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు ఆల్రెడీ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాము అని రోహిణి అంటుంది.. పోలీసులకి కంప్లైంట్ ఇస్తే అసలు కుదరదు ఆ మణికంఠను పట్టుకొని వాళ్ళు ఎవరో నేను కనుక్కుంటాను అని బాలు వెళ్లిపోతాడు.. మణికంఠ బాలు ఇద్దరు కలిసి ఊరంతా జల్లెడ పట్టి వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు.. మణికంఠ ని బాలు ఒక ఆట ఆడుకుంటాడు. కానీ ఆ బిల్లా ఉన్న ఏరియాలో కొబ్బరిబోండం షాపు దగ్గర ఆపి కొన్ని నిజాలను తెలుసుకుంటాడు.

మీనా కోసం వెళ్లిన బాలు..

Advertisement

బాలు మీనా కి ఫోన్ చేసి ఎక్కడున్నా మీనా అని తనని కలవడానికి అని అక్కడికి వెళ్తాడు.. బాలు స్టైల్ చూసి సుమతి బావ బాగా స్టైల్ గా మారిపోయాడు అని మురిసిపోతూ ఉంటుంది.. నా ఒక్కడికే కాదు నీక్కూడా ఇచ్చింది అని అనగానే ఏంటి ఇచ్చిందా? ఎవరు ఆవిడ అని మీనా సుమతి ఇద్దరు కూడా అడుగుతారు. సరే ఈ గ్లాసెస్ పెట్టుకో మనం సెల్ఫీ దిగుదామని బాలు అంటాడు. మీనా గ్లాసెస్ పెట్టుకోగానే అందరూ కలిసి సెల్ఫీ దిగుతుండగా ఆ ఫోన్లో ఉన్న ఫోటోలు చూసి సుమతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ అమ్మాయి నాకు బాగా గుర్తుంది.. మీ అన్నయ్య లేచిపోయింది ఈ అమ్మాయి తోనే అని మీనా సుమతి ఇద్దరు అనగానే బాలు నాకు కూడా అదే అనుమానంగా ఉంది అని అంటాడు..

నిజం కక్కేసిన కల్పన..

సుమతి చెప్పిన తర్వాత గుర్తు తెచ్చుకున్న బాలు వెంటనే ఈ విషయాన్ని కల్పన దగ్గరికి వెళ్లి అడగాలని అనుకుంటాడు. కల్పన వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడుతాడు.. కల్పన ఏంటి మర్యాద మారింది పిలుపు మారింది అని అడుగుతుంది. బాలు నువ్వు ఎదవని ప్రేమించావు కదా వాడు గుర్తున్నాడా అని అడుగుతాడు. ఇక మొత్తం స్టోరీ చెప్పగానే కల్పనాకు బల్బు వెలుగుతుంది. ఒక వ్యక్తి చెమట వచ్చి జీవితాంతం కష్టపడిన డబ్బులను నువ్వు కొట్టేశావు.. ఇప్పటికీ మేము బాధపడుతూనే ఉన్నాము అని అనగానే ఇప్పటికీ ఏంటి నేను ఎప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసాను కదా అని కల్పన నిజం బయటపడుతుంది. మీ అన్నయ్యకి ఎప్పుడూ నేను ఆ డబ్బులు ఇచ్చేశాను అని కల్పన చెప్పగానే బాలు ఫీజులు ఎగిరిపోతాయి..

బాలుకు సపోర్ట్ గా కల్పన..

Advertisement

డబ్బులు ఇచ్చేసావా ఎప్పుడు ఇచ్చేసావు.. ఎంత ఇచ్చావు అని బాలు అడుగుతాడు.. కల్పన పోయినసారి వచ్చినప్పుడే ఆ డబ్బులు ఇచ్చేశాను అందుకే రిజిస్ట్రేషన్ లేట్ అయింది. నువ్వు సాక్షి సంతకం పెట్టావు కదా అప్పుడు అక్కడే ఉన్నాను అని బాలు తో కల్పనా నిజం చెప్తుంది.. వదిన మామూలుది కాదు వడ్డీతో సహా వసూలు చేసింది.. దీని గురించి నువ్వు మా ఇంటికి వచ్చి చెప్తావా నాకు ఆ కాపీ ఒకటి కావాలి అని బాలు అడుగుతాడు. ఎప్పటినుంచో ఆ ఇద్దరు మీద రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటున్నాను.. కచ్చితంగా నేను మీ ఇంటికి వచ్చి నిజం చెప్తాను అని కల్పనా బాలుకి సపోర్ట్ గా నిలుస్తుంది.

కోర్టు బోనులోకి మనోజ్..

ఇంటికొచ్చిన బాలు మొత్తం హడావిడి చేసి కోర్టు బోను ని ఏర్పాటు చేస్తాడు.. అందులో మనోజ్ ని నిలుచోబెట్టి. ఈయన గారు ప్రేమించిన అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నాడు అన్న విషయం ఎవరికీ చెప్పలేదు అని అంటాడు. మాట వినగానే ప్రభావతి సత్యం ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈయన ఏం మాట్లాడుతున్నారండి మీరు డబ్బులు తీసుకున్నాడా అని అడుగుతుంది. అదేవిధంగా రోహిణి కూడా ఇందులో బాగా ఉంది అని చెప్పగానే దిమ్మతిరిగిపోయే షాక్ అవుతుంది. రోహిణి ఇద్దరు కూడా ఈ విషయం వీడికి ఎలా తెలుసు అని ఆలోచిస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read:Podarillu Today Episode : నడుం విరగొట్టుకున్న చక్రీ.. కేశవ, చక్రీకి మహా వార్నింగ్..కన్నీళ్లు తెప్పించే సీన్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×