E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు మరోసారి దరిద్రం.. ఇంట్లో నిజం చెప్పేసిన బాలు.. రోహిణి మాటతో షాక్..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు మరోసారి దరిద్రం.. ఇంట్లో నిజం చెప్పేసిన బాలు.. రోహిణి మాటతో షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode May22nd: విల్లా విజయ్ కోసం మీనా బాలు లాంగ్ డ్రైవ్ కు వెళ్తారు. ఇద్దరు కలిసి ధవలేశ్వరం వెళ్లి ఆ విజయ్ గాని వెతకాలని అనుకుంటారు. ప్రభావతి ఫోన్ చేయగానే బాలు మీరు మాట్లాడాలనుకుంటున్న వ్యక్తి రెండు గంటల వరకు అందుబాటులో ఉండరు అని అనడంతో ప్రభావతి ఫీల్ అవుతుంది.. ఇంటికి వచ్చిన తర్వాత వాడి సంగతి ఏంటో చెప్తాను అని ప్రభావతి అనుకుంటుంది.. ఇక బాలు మీద ఇద్దరు ఆ ఊరిలో జల్లెడ పట్టి విజయ్ అనే వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటారు.. చేపలు అమ్ముతూ కనిపించిన వాళ్ళని చూసి మీనా బాలు ఇద్దరు కూడా దొరికారు అని అనుకుంటారు.. అయితే బాలు మీన వాళ్ళని పట్టుకొని చితగ్గొట్టేస్తారు మనోజ్ వల్ల మళ్ళీ చేయి జారిపోతారు.

మనోజ్ పై ప్రభావతి సీరియస్..

మీనా ఇంకా వంట చేయలేదు అని ప్రభావతి తెగ కోపంగా ఫీల్ అవుతూ ఉంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన మనోజ్ తన ఫ్రెండ్ మణికంఠను తీసుకొని ఇంట్లోకి రావడంతో ప్రభావతి కుక్కల్ని ఇంట్లోకి తీసుకొని మాట్లాడుతుంది. అయితే రోహిణి వంట అయిందా అని కిందికి రావడంతో ప్రభావతి ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ అని సీరియస్ అవుతుంది.. మనోజ్ ను కూడా ప్రభావతి నీ పెళ్ళాం ఏం మాట్లాడుతుంది రా ఏంటి వంట చేయలేదని నేను ఏడుస్తూ ఉంటే ఏం మాట్లాడుతుంది అని ప్రభావతి మనోజ్ పై కోపంతో రగిలిపోతుంది.. మీనా ఇంకా వంట చేయలేదు అని సీరియస్ అవుతుంది.. సత్యం వచ్చి నాకు ఆకలేస్తుంది ఇంకా వంట చేయలేదా అని అడుగుతాడు.. అయితే మీనా ఇంకా వంట చేయలేదు అని ప్రభావతి అనగానే ఇద్దరు ఆడవాళ్లు ఉన్నారు మీరు చేయలేరా వంట అని సత్యం అంటాడు.. నన్ను మాత్రం ఇలాంటి వాటిలో నేను వంట చేయనా అని రోహిణి అడుగుతుంది.

వంటగదికి నువ్వు దూరంగా ఉండు..

Advertisement

ఏంటి మళ్లీ అదే మైదా పచ్చడి చేస్తావా ఏంటి అని రోహిణి నీ ప్రభావతి అడుగుతుంది… నువ్వు వంటగదికి ఎంత దూరంగా ఉంటే మా ఆరోగ్యం అంత బాగుంటుంది అని రోహిణిణి తిడుతుంది ప్రభావతి.. ఎవరికోసమో నువ్వేం చేస్తున్నావ్ మీనా ఏదో బయటికి వెళ్లింది కదా.. అర్జెంటు పని ఉండడంవల్ల రాలేదేమో.. నువ్వు వంట చేయొచ్చు కదా వంటగది నీకెప్పుడూ తెలియదా ఏంటి నాకు కమ్మగా వంట చేసి పెట్టు ఆకలేస్తుంది అని తెలుసు కదా అని సత్యం ప్రభావతికి ఆర్డర్ వేస్తాడు. అయితే ప్రభావతి మాత్రం నేను వంట చేయాలా అని అడుగుతుంది. నువ్వే వంట చేసి ఉప్పు కారం తక్కువ వేసి నాకు మంచి వంటని చేసి పెట్టు అని సత్యం అంటాడు.. అప్పుడే బాలు మినా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు.

మీనా దెబ్బకు ప్రభావతి షాక్..

ఎక్కడికి వెళ్ళావే? ఊర్లో పెత్తనాలు చేసి వస్తున్నావా? ఇంట్లో వంట కూడా చేయకుండా ఏం చేయడానికి వెళ్ళావే? ఎక్కడికి వెళ్లావే అసలు నువ్వు అని ప్రభావతి మీనా ఇంట్లోకి రాగానే కస్సుమని అరుస్తుంది.. ఇంట్లో ఇద్దరూ ఉన్నారు కనీసం వంట గదిలో వంట చేశానో లేదా అని కూడా చూడకుండానే వంట చేయలేదని ఎలా అంటారు.. అని మీనా అనగానే ఏంటి నువ్వు వంట చేసావా అమ్మ అని సత్యము అడుగుతాడు.. అయితే నేను వంట చేసి వెళ్లాను మావయ్య రావడానికి లేట్ అవుతుందేమో అని ఉదయమే అందరికీ వంట చేసి పెట్టి వెళ్లాను అని మీనా అనగానే ప్రభావతి షాక్ అవుతుంది..

మనోజ్ పై బాలు కౌంటర్స్..

Advertisement

అసలు ఎక్కడికి వెళ్లారు అని సత్యం అడుగుతాడు.. అయితే ఈ రెండోసారి లక్షలు మింగినోడి దగ్గర నుంచి 30 లక్షలు కొట్టేసిన ఫ్రాడ్ గాన్ని పట్టుకోడానికి మేము ఊరంతా తిరుగుతున్నాము.. అయితే ఒక టీవీ యాక్టర్ దగ్గరికి వెళ్తే వాడి గురించి నిజం తెలిసింది. జీవితాన్ని వాడు ధవలేశ్వరంలో ఉంటాడని చెప్పగానే మేము అక్కడికి వెళ్లి ఎండలో వెతికాము.. మన ఊరంతా వెతికినా కూడా వాడు దొరకలేదు చివరికి ఇవన్నీ వెతికి పట్టుకున్నప్పుడు వీడు 30 రూపాయల కోసం ఫోన్లు మీద ఫోన్లు చేసి వాడిని పారిపోయేలా చేసాడు అని అని బాలు మనోజ్ ని దిమ్మ తిరిగేలా తిడతాడు.. ఏంటి వాడు దొరికాడా మరి 30 లక్షలు ఇచ్చాడా ఏంటి అని మనోజ్ ఎంతో ఆత్రుతగా అడుగుతాడు.. పారిపోయాడు అని చెప్పగానే షాక్ అయిపోతాడు..

నువ్వు మాకోసం ఏం చెయ్యొద్దు..

అయితే రోహిణి నువ్వు మా కోసం ఏమి కష్టపడద్దు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు. నువ్వు ఏం కడుపుకి అన్నం తింటున్నావా ఇంకేదైనా తింటున్నావా అని మీనా రోహిణికి గడ్డి పెడుతుంది. అవును నిజమే మీరు మా కోసం ఏది చెయ్యొద్దు మేము ఆ 30 లక్షలు ఎలా రాబట్టుకోవాలో మాకు తెలుసు అని రోహిణి అంటుంది.. చూసావా రా నీ పెళ్ళాం ఏం మాట్లాడుతుంది రా కష్టపడుతూ మా పనులు మానుకొని ఇదంతా చేస్తూ ఉంటే ఇలా మాట్లాడుతుంది ఏంటి అని మనోజ్ ని తిడతాడు బాలు.. కానీ రోహిణి మాత్రం మా డబ్బులు మేము ఎలా రాబట్టుకోవాలో మేము చూసుకుంటాం అది మా సమస్య నువ్వేమి ఇన్వాల్వ్ అవ్వద్దు అని బాలు తో అంటుంది.. ఆ మాట వినగానే మీనా సీరియస్ అవుతుంది. అయితే మీనా బాలు మనకెందుకు నాన్న చెప్పడం వల్ల ఇదంతా చేశామని అంటారు.. ఇక రోహిణి ఆ పనిని మళ్లీ గుణకి అప్పగించాలని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: నీ దిక్కున్న చోటు చెప్పుకో.. అమూల్య పెళ్లి తర్వాతే ఆస్తి..భద్ర సంబరాలు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×