E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్, రోహిణిని విడగొట్టిన ప్రభావతి.. శృతికి రోహిణి వార్నింగ్… ఇంట్లో ఏం జరుగుతుంది..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్, రోహిణిని విడగొట్టిన ప్రభావతి.. శృతికి రోహిణి వార్నింగ్… ఇంట్లో ఏం జరుగుతుంది..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode May12th: ప్రభావతితో మాట్లాడాలని రోహిణి తన గదికి వెళ్తుంది.. నేను చెప్పాలనుకున్న అత్తయ్య కాకపోతే మీ కొడుకు ప్రయోజకుడు అవుతాడని అలా దాచి పెట్టాను.. డబ్బులతో నేనేమీ నగలు, చీరలు లాంటివి కొనుక్కోలేదు కదా మీరు ఎందుకు నన్ను అంటున్నారు అని రోహిణి మళ్లీ అక్కడికి వెళ్లి ప్రభావతిపై అరుస్తుంది. అదే తప్పే నన్ను క్షమించండి అని ప్రభావతి ఎంత చెప్తున్నా సరే అస్సలు వినదు. ఇక రోహిణికి శృతి వాళ్ళమ్మ శోభ ఫోన్ చేసి నిన్ను మీ అత్తయ్య కొట్టింది అంట కదా నువ్వు ఏదో ఫ్రాడ్ చేసావ్ అంట కదా అని అడుగుతుంది. మాట విన్న రోహిణి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. మీరు మీ కూతురికి సలహాలు ఇచ్చుకోండి అని శోభకి చెప్తుంది..

రోహిణికి షాకిచ్చిన ప్రభావతి..

నీ పెళ్ళాం ఇంట్లో ఉందా లేదా అని మనోజ్ ని అడుగుతుంది ప్రభావతి.. ఇంట్లోనే ఉంది ఎక్కడుందో తెలియడం లేదు పైనే ఉందేమో అని మనోజ్ అంటాడు.. పైన ఉందని నిదానంగా చెప్తావ్ ఏంటి రా ఒకసారి మీ ఆవిడ ఎక్కడుందో పిలువు అని ప్రభావతి అంటుంది.. కానీ మనోజ్ చిన్నగా పిలవడంతో ప్రభావతి ఏంటా చిన్నగా ప్రేమగా పిలుస్తున్నావు? ఏ రోహిణి అని గట్టిగా కేకలు వేసి ప్రభావతి పిలుస్తుంది. ఏం జరిగింది అని రోహిణి కంగారు పడిపోతూ అక్కడికి వస్తుంది. పెద్దవాళ్లంటే నీకు మర్యాద లేదా గౌరవం లేదా అంటూ పొంతన లేకుండా మాట్లాడడంతో రోహిణి ఏం జరిగింది అత్తయ్య అనేది భయపడుతుంది. ఏం జరిగిందమ్మ అర్థం కావడం లేదు అని మనోజ్ అడిగిన సరే నువ్వు షో రూమ్ కి వెళ్ళాలి కదా వెళ్లు ముందు అని మనోజ్ ని పంపిస్తుంది.

శోభను ఎందుకు అవమానించావు..?

Advertisement

సుతి వాళ్ళమ్మతో ఎలా మాట్లాడాలి కూడా నీకు తెలియదా ఎందుకు ఇలా మాట్లావు. మర్యాద లేకుండా మాట్లాడాల్సిన అవసరం నీకేంటి. నిజమైన బుద్ధుండి ఇలా మాట్లాడుతున్నావా అని ప్రభావతి రోహిణి తిడుతుంది. నువ్వు తప్పు చేయకుంటే ఆవిడ ఎందుకు నీతో అలా మాట్లాడుతుంది నువ్వు తప్పు చేశావు కాబట్టే కదా ఆవిడ నీతో అలా మాట్లాడింది అయితే నువ్వు తిడతావా అని రోహిణికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.. నువ్వు తప్పు చేయకుండా అంటే వాళ్ళని అనే వాళ్ళు కాదు కదా నువ్వు తప్పు చేశావు కాబట్టే వాళ్ళని అంటున్నారు అని రోహిణికి దిమ్మ తిరిగిపోయేలా చెప్తుంది ప్రభావతి.

శృతికి స్ట్రాంగ్ వార్నింగ్..

శృతి వాటర్ తాగడానికని ఫ్రిజ్ దగ్గరికి వస్తే.. మీనా శృతి అని గట్టిగా అరుస్తుంది.. ఏంటి ఏమైంది ఎందుకలా అరిచావు అని అడుగుతుంది.. ఏం పని చేస్తావు అని అడిగితే నేను డబ్బింగ్ చెప్తాను కదా మళ్ళీ కొత్తగా అడుగుతున్నావేంటి మీనా అని శృతి అంటుంది. చల్ల నీళ్లు తాగితే నీ గొంతు పోతుంది అని మీనా చెప్తుంది. అప్పుడు అక్కడికి వచ్చినా రోహిణి నీ గురించి నువ్వు ఏం అనుకుంటున్నావు మీ అమ్మకు ఇంట్లో విషయాల గురించి చెప్తావా అని రోహిణి అంటుంది. నేనేమీ మీ బెడ్ రూమ్ విషయాలు ఏం షేర్ చేయలేదు కదా హాల్లో జరిగిన విషయాల గురించి కదా చెప్పింది చెప్తే తప్పేంటి ఎవరెవరికి నేను చెప్పలేదు మా అమ్మకి నేను చెప్పిందని శృతి అంటుంది.. ఇంకొకసారి నా విషయాల గురించి ఎవరికైనా చెప్తే మర్యాదగా ఉండదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది.

మనోజ్ కు రోహిణి దూరం అవుతుందా..?

Advertisement

నా టైం బాగోలేదు అని రోహిణి బెడ్ రూమ్ లోకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటుంది.. ఇంత టైం అయినా మనోజ్ ఇంకా ఇంటికి రాలేదని మనోజ్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు.. ఏమైంది ఫోన్ లిఫ్ట్ చేయలేదని రోహిణి మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తుంది. మనోజ్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేస్తే అమ్మ నన్ను చంపేస్తుంది అని అనుకుంటాడు. ఒకసారి అమ్మకు ఫోన్ చేసి అడిగి రోహిణి తో మాట్లాడాలి అని మనోజ్ ప్రభావతి కి ఫోన్ చేస్తే రోహిణి తో మాట్లాడొద్దని చెప్తుంది.. అది విన్న మనోజ్ రోహిణి కి ఫోన్ చేసి షో రూమ్ లో ఇవాళ పని ఉంది అని ఏదో ఒకటి చెప్పి మ్యానేజ్చేసి ఫోన్ పెట్టేస్తాడు..

బాలును అవమానించిన మనోజ్..

మనోజ్ ఇవాళ ఇంటికి రాలేదు అని మీనా చెప్పగానే.. వాడు తిండికి అస్సలు ఆకలేడు కదా కనీసం తిన్నాడో లేదో అని వాడి కోసం బిర్యాని తీసుకొని వెళ్తాను అని అక్కడ ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతాడు.. షో రూమ్ లో ఒంటరిగా కూర్చుని ఉన్న మనోజ్ దగ్గరికి వెళ్లిన బాలు ఏంట్రా భోజనం చేయలేదా ఇంకా అని అనగానే.. వేయి రూపాయలు అవుతున్నాయి రా అందుకే తినాలనిపించలేదు అని అంటాడు. నీ కోసం బిర్యాని తీసుకొచ్చాను అని బాలు బిర్యానీ పెట్టిన తర్వాత తిన్న మనోజ్ నువ్వు ఎప్పుడైనా భోజనం చేయకపోతే చెప్పు నీకు నేను భోజనం తీసుకొస్తాను అని అంటాడు.. ఇలా భోజనం తీసుకొచ్చి షో రూమ్ ని కొట్టేయాలని అనుకుంటున్నావా అని మనోజ్ అనగానే బాలు ఎమోషనల్ అయిపోతాడు.. నువ్వు మారవు రా ఇంకా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

రోహిణికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్..

రోహిణి కోసం చపాతి తీసుకుని వెళ్లి ఇచ్చిన మీనాని రోహిణి దారుణంగా మాట్లాడుతుంది. మమ్మల్ని అత్తయ్య తిట్టడం కొట్టడం మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు కదా అని రోహిణి మాట్లాడటంతో మీనా దిమ్మ తిరిగిపోయేలా షాక్ అవుతుంది.. ఆకలితో ఉన్నావు కదా అని భోజనాన్ని పైకే తీసుకొచ్చి పెట్టాను అది నేను చేసిన తప్పు. నీలాగా నేను లక్షలు మింగి ఉండి ఉంటే ఎన్ని పూల షాపులు కొనే దాన్ను అని మీనా రోహిణి కి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది.. నువ్వు ఇంకా మారతావని నేను అస్సలు అనుకోలేదు. మరి అది ఇస్తే తీసుకుంటాను ఆ మర్యాదను తిరిగి నేను ఇస్తాను అంతే అని మీనా రోహిణి కి చెప్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : చక్రీ మామూలోడు కాదు..కన్నీళ్లు పెట్టుకున్న మహా.. గాయత్రిని చూసి కన్నా షాక్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×