// // Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు రోహిణి షాక్.. ఇంట్లోంచి వెళ్లిపోయిన రోహిణి.. చిచ్చు పెట్టిన శోభా.. -->
E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు రోహిణి షాక్.. ఇంట్లోంచి వెళ్లిపోయిన రోహిణి.. చిచ్చు పెట్టిన శోభా..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు రోహిణి షాక్.. ఇంట్లోంచి వెళ్లిపోయిన రోహిణి.. చిచ్చు పెట్టిన శోభా..
Advertisement

Gundeninda GudiGantalu Today episode May11th: నీకోసం నేను అండగా నిలబడితే నువ్వు మాత్రం నన్ను ఇలా అడ్డంగా బుక్ చేస్తావని అనుకోలేదు. నువ్వు తప్పించుకోవడం కోసం నన్ను ఈడిపిస్తావా అసలు నాతో మాట్లాడద్దు నా దగ్గరికి రావద్దు అని రోహిణి అంటుంది. తప్పు నువ్వు చేసే నన్ను అంటావేంటి రోహిణి. ఆ డబ్బులు నేను ఆ రోజే ఇస్తాను అని అన్నాను.. నువ్వు వద్దు అని చెప్పేసి నన్ను ఆపావు. మీ నాన్న ఇచ్చాడు అని చెప్పి మా వాళ్ల దగ్గర గొప్పగా చెప్పుకున్నావు.. మీ నాన్న ఉన్నాడా లేదా అని మనూజ్ కి అనుమానం వస్తుంది.. ఇప్పుడు నా మీదకు వేస్తున్నావా నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ మనోజ్ నువ్వు ఇంత చేతకాని వాడివని అస్సలు ఊహించలేదు అని రోహిణి గొడవపడుతుంది..

మనోజ్ ను అవమానించిన రోహిణి..

నాకు చేతగాని వాడిని అని అంటున్నావు కదా ఇప్పుడు.. నువ్వేదో పెద్ద ఉద్ధరించినట్లు మాట్లాడుతున్నావే అని మనోజ్ కూడా గట్టిగా అనడంతో రోహిణి చాలా ఫీల్ అయిపోతుంది. ఆ కోపంతో ఇంట్లోంచి వెళ్లిపోవాలి అని అనుకుంటుంది. నీలాంటి వాడి దగ్గర ఉండడం కన్నా వెళ్ళిపోవడమే బెటర్. ఎవడైనా కానీ పెళ్ళాన్ని వెనకేసుకొని వస్తాడు నువ్వు మాత్రం అందరి ముందు రా నన్ను ఒక బఫుడ్ని చేసావు. మీ అమ్మ కొడుతుంటే కనీసం ఆ పని కూడా ఆపలేదు అని రోహిణి దారుణంగా తిట్టేస్తుంది.. ఇక ఇంట్లో ఉండడం నావల్ల కాదు నేను వెళ్ళిపోతున్నాను అని రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది.. బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతుంది..

ప్రభావతికి సత్యం క్లాస్..

Advertisement

నువ్వు చేసింది ఏమైనా బాగుందా ఇంటికి పెద్ద కోడలు అంటే నీ తర్వాత ఆ స్థానం తనదే.. అలాంటిది నువ్వు ఇలా కోడలు మీద చేయి చేసుకోవడం నాకు అస్సలు నచ్చలేదు అని సత్యం ప్రభావతితో అంటాడు.. చేసింది మాత్రం ఏమైనా కరెక్టా.. తన వల్ల నేను నానమ్మకాన్ని పోగొట్టుకున్నాను అని బాధపడిపోతూ ఉంటుంది.. నేను చేసింది కరెక్టే మీరు ఈ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోవద్దు అని ప్రభావతి సత్యంతో అంటుంది.. ఎంత చెప్పిన సరే ప్రభావతి తన తీరుని మాత్రం మార్చుకోదు. అప్పుడే టెన్షన్ పడుతూ వచ్చిన మనోజ్ రోహిణి వెళ్ళిపోతుంది అని అంటాడు. వెళ్ళిపోతే పోనివ్వరా మళ్ళీ అదే తిరిగి వస్తుంది నువ్వు మాత్రం వెళ్లదు అని సలహా ఇస్తుంది..

తల్లి ఒడిలో పడుకొని బాధపడ్డ రోహిణి..

రోహిణి వెళ్ళిపోయిందని మనోజ్ చెప్పగానే సత్యం కంగారు పడిపోతాడు. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని ప్రభావతిని సత్యం ఎంతగా అడుగుతున్నా సరే తను మాత్రం చెప్పింది వినాలి అని అంటుంది.. రోహిణి జరిగిన విషయం అంతా.. తన తల్లి సుగుణము ఒడిలో పడుకొని బాధపడిపోతూ ఉంటుంది.. ఎందుకు నువ్వు ఇలా చేసావు నీదే తప్పు అని సుగుణమ్మ కూడా అనడంతో రోహిణి సీరియస్ అవుతుంది.. తల్లిని కాబట్టి నీకు ఆపరాన్ని నిలబెట్టుకునేలా చేసుకుని చెప్తున్నాను.. నువ్వు ఏమి అనకుండా ఉండాలంటే నీ ఫ్రెండ్ విద్య దగ్గరికి వెళ్ళు నువ్వు చేసే ప్రాడు పనులకి తన సహాయంగా ఉంటుంది కదా నీకు తానా అంటే తందానా అంటుంది అని సుగుణమ్మ గడ్డి పెట్టి రోహిణి తన అత్తవారింటికి వచ్చేలా చేస్తుంది..

మీనా, శృతి నవ్వుతో షాక్..

Advertisement

మీనా, శృతి ఇద్దరు కూడా కామెడీ వీడియోలను చూసి నవ్వుకుంటూ ఉంటారు.. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి ఏంటి మీరిద్దరూ అంతగా నవ్వుకుంటున్నారు అని అడుగుతుంది.. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు అర్థం కావడం లేదా ఎందుకు మీరిద్దరూ ఇలా నవ్వుకుంటున్నారు అని అనడంతో ప్రభావతి మాటకి శృతి సమాధానం చెబుతుంది.. మీరేం అత్తయ్య ఆంటీ మా మీద పడతారు మేమేం తప్పు చేశామని అని శృతి అడుగుతుంది. రోహిణి వెళ్ళిపోయింది ఆ విషయం కూడా మీకు తెలియలేదా ఎందుకు మీరు ఇంతగా ఇది చేస్తున్నారు అని ప్రభావతి ఇద్దరికీ క్లాస్ పీకుతుంది.. అసలు రోహిణి ఎక్కడికి వెళ్లిందో అర్థం కావడం లేదు అని ప్రభావతి అనడంతో అప్పుడే ఇంట్లోకి వచ్చిన రోహిణి చూసి శృతి మీరు ఆ మాట రోహిణి అడగండి అని అంటుంది..

ప్రభావతి దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

ప్రభావతితో మాట్లాడాలని రోహిణి తన గదికి వెళ్తుంది.. నేను చెప్పాలనుకున్న అత్తయ్య కాకపోతే మీ కొడుకు ప్రయోజకుడు అవుతాడని అలా దాచి పెట్టాను.. డబ్బులతో నేనేమీ నగలు, చీరలు లాంటివి కొనుక్కోలేదు కదా మీరు ఎందుకు నన్ను అంటున్నారు అని రోహిణి మళ్లీ అక్కడికి వెళ్లి ప్రభావతిపై అరుస్తుంది. అదే తప్పే నన్ను క్షమించండి అని ప్రభావతి ఎంత చెప్తున్నా సరే అస్సలు వినదు. ఇక రోహిణికి శృతి వాళ్ళమ్మ శోభ ఫోన్ చేసి నిన్ను మీ అత్తయ్య కొట్టింది అంట కదా నువ్వు ఏదో ఫ్రాడ్ చేసావ్ అంట కదా అని అడుగుతుంది. మాట విన్న రోహిణి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. మీరు మీ కూతురికి సలహాలు ఇచ్చుకోండి అని శోభకి చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : సోమవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×